అణు ఆయుధాలతో పాక్ పన్నాగం

By Hazarath
|

అణు ఆయుధాలు ఉండేది పండగ చేసుకోవడానికి కాదు ఇది ఆనాటి మాట..ప్రపంచాన్నే వణికించిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు మా హీరోలు ఇది నేటి మాట..ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..పాకిస్తాన్ అనే సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ బలహీన దేశం కాదని..మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని దాడికి ఎప్పుడైనా మేము సిధ్ధమని నాడు చెప్పిన ముషారఫ్ నేడు ఉగ్రవాదమనే పాముకు పాలు పోసి పెంచింది మేమేనని వాస్తవాలను వెల్లడించారు. ఉగ్రవాదులే మా హీరోలని ప్రపంచాన్ని నాశనం చేయడానికే వారిని తయారు చేశామని చెబుతున్నారు. ప్రపంచానికే షాక్ నిస్తున్న ముషారప్ మాటల కథనం స్లైడర్ లో....

 

Read more: అమెరికా ఉగ్ర దాహానికి లక్షల మంది బలి

ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం ..

ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం ..

పాక్‌కు చెందిన దునియా న్యూస్ చానల్‌కు మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం బయటపెట్టారు. 1990లో కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమం మొదలైనప్పుడు.. లష్కరేతాయిబా సహా 11 లేదా 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. వాటికి పాక్ ప్రభుత్వం, సైన్యం పూర్తిగా సహకరించింది. ఆ సంస్థల్లో చేరిన యువకులకు శిక్షణ ఇచ్చాం.. వారు సరిహద్దులు దాటేందుకు సహకరించాం అని పేర్కొన్నారు.

పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూర్చుతున్నది ...

పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూర్చుతున్నది ...

2008 ముంబై ఉగ్రదాడి మాస్టర్‌మైండ్స్ సయీద్, లఖ్వీపై పాక్ చర్యలు తీసుకుంటుందా..? అని ప్రశ్నించగా భారత్‌కు సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కానీ, పాక్‌లో యథేచ్ఛగా తిరుగడమే కాకుండా.. విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు. ఇందుకు పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూర్చుతున్నది అని ముషారఫ్ వెల్లడించారు.

హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని..
 

హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని..

కశ్మీర్ స్వేచ్ఛకోసం పోరాడిన హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని, ఆ తర్వాత మత పోరాటం (జిహాద్) ఉగ్రవాదంగా మారిందని చెప్పారు. ఇప్పుడు వాళ్లు (పాక్‌లోని ఉగ్ర మూకలు) సొంత ప్రజలనే చంపుతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.సయీద్, లఖ్వీని కూడా పాక్ నియంత్రిస్తుందా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు ముషారఫ్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

ఆఫ్ఘన్‌లో సోవియట్ రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం..

ఆఫ్ఘన్‌లో సోవియట్ రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం..

మత పోరాటం (జిహాద్).. 1979లో ఆఫ్ఘన్‌లో సోవియట్ రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం.. నేడు ప్రపంచాన్నే వణికిస్తున్న ఉగ్రవాదంగా మారింది అని చెప్పారు. రష్యా దళాలపై పోరాటానికి తాలిబన్లకు మేమే సైనిక శిక్షణ ఇచ్చాం. తాలిబన్, హక్కానీ, ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి మాకు హీరోలు. ఆ తర్వాత విలన్లుగా మారారు అని తెలిపారు.

1990ల్లో కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి..

1990ల్లో కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి..

కశ్మీర్‌లో మత తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు లష్కరే తోయిబాతో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు శిక్షణతోపాటు పూర్తి మద్దతిచ్చినట్లు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాక్ మాజీ మిలటరీ చీఫ్ కూడా అయిన ముషార్రఫ్ 1990ల్లో కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి, శిక్షణ ఇచ్చినట్లు ఓ టీవీ చానల్‌తో అన్నారు.

హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా

హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా

ఉగ్రవాద నాయకులైన లాడెన్, హక్కానీ, అల్ జవహరీ, లష్కరే నాయకులు హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా గుర్తించారన్నారు.‘1990ల్లో ‘స్వతంత్ర కశ్మీర్' ఉద్యమం మొదలైనప్పుడు లష్కరేతోపాటు 11, 12 చిన్న చిన్న తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రాణాలకు తెగించి పోరాడేలా వారికి శిక్షణతో పాటు పూర్తి మద్దతిచ్చాం. మతతీవ్రవాదం కోసం వారిని పుట్టిస్తే.. అదే ఇప్పుడు ఉగ్రవాదమై మన వారినే చంపుతోంది. అందుకే దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది' అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

భారత్‌ చేస్తున్న వాదనకు ముషారఫ్‌ వ్యాఖ్యలు ..

భారత్‌ చేస్తున్న వాదనకు ముషారఫ్‌ వ్యాఖ్యలు ..

అయితే పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ చేసినవ్యాఖ్యలు భారత్‌ కంటే ఆయన దేశానికే ఎక్కువ ఆశ్చర్యం కలిగించి వుంటాయి. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ అండదండలున్నాయనీ, భారత్‌ చేస్తున్న వాదనకు ముషారఫ్‌ వ్యాఖ్యలు కొండంత బలాన్నిచ్చాయి. నిరాధారమైన ఆరోపణలంటూ అంతర్జాతీయ వేదికలమీద ఇంతకాలమూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్‌ను ఆయన వ్యాఖ్యలు ఇరకాటంలో పడేశాయి.

ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు ..

ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు ..

ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు తమ పాలకులకూ, నిఘా వ్యవస్థలకు మొదటినుంచీ తెలుసునంటూ ఇటీవలే భారత్‌కు చెందిన చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ మాజీ రక్షణమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వారిలో ముషారఫ్‌ కూడా ఉన్నారు.

స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ పాకిస్థాన్‌ ప్రభుత్వం ..

స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ పాకిస్థాన్‌ ప్రభుత్వం ..

ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనీ, లేదా స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ పాకిస్థాన్‌ ప్రభుత్వం కూడా ఆగ్రహించింది. ఇప్పుడు సాక్షాత్తూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు తాలిబాన్‌ ఆవిర్భావం నుంచి నేటివరకూ పాకిస్థాన్‌ నిర్వహించిన ఉగ్రవాద పాత్రను విప్పిచెప్పడం ద్వారా తన దేశానికి కాకున్నా తనకు మేలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నది.

ముషారఫ్‌ ప్రస్తుతం అనేక కేసుల్లో..

ముషారఫ్‌ ప్రస్తుతం అనేక కేసుల్లో..

ముషారఫ్‌ ప్రస్తుతం అనేక కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. బెనజీర్‌ భుట్టో హత్యకేసు ఆయనను వెంటాడుతున్నది. కొద్దిరోజుల క్రితమే అమెరికన్‌ పాత్రికేయుడు సీగల్‌ ఈ కేసు విచారిస్తున్న రావల్పిండి కోర్టుకు బేనజీర్‌ భుట్టోను ముషారఫ్‌ బెదిరించిన ఫోన్‌కాల్‌ వీడియో లింకేజ్‌ను పంపడంతో ముషారప్ మరింత ఇరకాటంలో పడ్డారు.

లాల్‌ మసీదుపై జరిగిన దాడి..

లాల్‌ మసీదుపై జరిగిన దాడి..

భుట్టో హత్యకు సూత్రధారి ముషారఫ్‌ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనితోపాటుగా, లాల్‌ మసీదుపై జరిగిన దాడి, ఒక ముస్లిం మతపెద్ద హత్య కేసులోనూ ముషారఫ్‌ ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో, డెబ్పైరెండేళ్ళ వయసులో ఒక కొత్త రాజకీయపార్టీతో మరోప్రస్థానం ఆరంభించాలనుకుంటున్న ముషార్‌ఫకు ప్రజలతో పాటు, పాకిస్థాన్‌లోని వివిధవర్గాల వారిని ఆకట్టుకోవలసిన అవసరం ఉండవచ్చు.

బాల్‌ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ..

బాల్‌ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ..

పాకిస్థాన్‌ నాయకులను, కళాకారులను అవమానిస్తూ, భారత్‌లోని మైనారిటీ ముస్లింలపై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నదంటూ శివసేన వ్యవహారశైలిపై అంతర్జాతీయస్థాయిలో ప్రచారం చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం సంకల్పిస్తున్న నేపథ్యంలో ముషారఫ్‌ బాల్‌ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ని వెనకేసుకొస్తూ, బాల్‌ థాకరే పేరు ప్రస్తావించారు.

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్‌ఫకు ..

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్‌ఫకు ..

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్‌ఫకు కొత్తకాదు కానీ, భారత్‌ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ ఆదినుంచీ అండగా ఉన్నదని అంగీకరించడం మాత్రం ఇదే ప్రధమం. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరో సాదాసీదా వ్యక్తుల నుంచి వచ్చివుంటే వాటికి ప్రాధాన్యం ఉండివుండేది కాదు.

పదేళ్ళపాటు పాకిస్థాన్‌ను ఏలిన వ్యక్తి ..

పదేళ్ళపాటు పాకిస్థాన్‌ను ఏలిన వ్యక్తి ..

కానీ, అత్యంత కీలకమైన సందర్భంలో పదేళ్ళపాటు పాకిస్థాన్‌ను ఏలిన వ్యక్తి ఆయన. సైనిక నియంతగా పాకిస్థాన్‌లోని సర్వ వ్యవస్థలనూ తన నియంత్రణలో ఉంచుకున్న వ్యక్తి. అధికారంలోకి రాకముందు కూడా భారత్‌తో వ్యవహరించే విషయంలో పాకిస్థాన్‌ పాలకులను పూర్తిగా నియంత్రించిన వ్యక్తి.

పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలకు నెలవుగా..

పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలకు నెలవుగా..

పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలకు నెలవుగా, శిక్షణాకేంద్రంగా పనిచేసిందని ఆయన ఒప్పుకోలు ఇంతకాలమూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న వాదనకు ఎనలేని బలాన్ని చేకూర్చింది. ముషారఫ్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలమీద పాకిస్థాన్‌ వ్యవహారశైలిని బలంగా ఎండగట్టడానికే కాదు, దావూద్‌ వంటివారి విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్న భారత్‌కు అనూహ్యంగా అందివచ్చిన ఆయుధంగానూ ఉపకరిస్తాయి.

పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్..

పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్..

అయితే ఆయన ఇంతకు ముందు సైతం పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్ విసిరాడు. పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ ప్రవేశించాలని చూస్తే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు..మేము చిన్న పిల్లలం కాదంటూ కుండబద్దలు కొట్టారు.

పాక్ బలహీన దేశం కాదని ..

పాక్ బలహీన దేశం కాదని ..

పాకిస్తాన్ తో దాడికి దిగొద్దని పాక్ బలహీన దేశం కాదని అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని మయన్మార్ లాంటిది కాదని మా దగ్గర దాదాపు అణు ఆయుధాలు ఉన్నాయని మన దేశానికి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు.

2020 కల్లా వీటిని 200లకు పెంచడమే తమ లక్ష్యమని...

2020 కల్లా వీటిని 200లకు పెంచడమే తమ లక్ష్యమని...

2020 కల్లా వీటిని 200లకు పెంచడమే తమ లక్ష్యమని కాబట్టి మాతో గేమ్స్ ఆడేందుకు ట్రై చేయవద్దని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఉగ్రవాదంపై కూడా తనదైన శైలిలో చెప్పారు...దీనిపై ప్రపంచదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ముఖ్యంగా భారత్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write India has aggressive attitude but Pakistan s nuclear weapons are not for celebration Musharraf

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more