భారత ఆర్మీలో ఉన్న ఈ డ్రోన్లు గురించి ఎవరికైనా తెలుసా ?

|

భారతదేశానికి విస్తారమైన గగనతలం ఉంది. అయితే చైనా, పాకిస్థాన్లతో జరిగిన యుద్ధాలతో పొందిన అనుభవాల దృష్ట్యా భారత వైమానిక దళం ఇప్పుడు సరికొత్త వ్యూహలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే భవిష్యత్తులో వచ్చే పెను సవాళ్లను, సాంకేతిక యుద్ధాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు, భిన్న ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయ సహకారాలను అందించడానికి వైమానిక దళం ఎప్పటికప్పుడు తయారుగా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించగల అత్యాధునిక డ్రోన్లు భారత్ చేతిలో ఉన్నాయి. భారత అమ్ములపొదిలోని 'విహంగ' అస్త్రాలలేంటో తెలుసుకుందాం.

Read more: తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నసెల్ఫీలు

హెచ్ఏఎల్-ధ్రువ్
 

హెచ్ఏఎల్-ధ్రువ్

త్రివిధ దళాలకు, తీర రక్షక దళానికి, పౌర అవసరాలకు పనికొచ్చే విధంగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన అడ్వాన్స్ డ్ , లైట్ హెలికాప్టర్ (ఏఎల్హెచ్) ఇది. ఈ ధ్రువ్ హెలికాప్టర్ కు ఆయుధాలు, మిసైల్స్ని అమర్చి రుద్ర హెలికాప్టర్ ను తయారు చేశారు. హెచ్ఏఎల్-రుద్ర ఆక్రమణ రకానికి చెందిన హెలికాప్టర్.

హెచ్ఏఎల్-ఏఎమ్ సీ ఏ (అడ్వాన్స్ డ్  మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్)

హెచ్ఏఎల్-ఏఎమ్ సీ ఏ (అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్)

హెచ్ఏఎల్, ఏడీఏ కలిసి అభివృద్ధి చేయనున్న అయిదోతరం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. దీనిలో రెండు ఇంజిన్లు, ఒక సీటు ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఎగిరే బహుళ ఉపయోగ ఫైటర్ విమానం ఇది వైమానిక దళంలోని ఇతర విమానాలకు తోడ్పడనుంది.

ఎన్ఏఎల్-సరస్

ఎన్ఏఎల్-సరస్

దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి పౌర విమానం. 8 నుంచి 14 మందిని తీసుకుని వెళ్లగల ఈ విమానాన్ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) అభివృద్ధి చేసింది. సరస్ విమానాన్ని మరింత అభివృద్ధిపరిచేందుకు ఎన్ఏఎల్ తో హెచ్ఏఎల్ చేతులు కలిపింది. నాటికి 70 100 2020 నుంచి మందిని తీసుకుని వెళ్లగల ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేయనున్నారు.

నిషాంత్
 

నిషాంత్

డీఆర్డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) చేసిన కృషి ఫలితంగా తయారైన తొలి దేశీయ మానవరహిత విమానం (యూఏవీ) ఇది. దీన్ని డీఆర్డీవో విభాగమైన ఏరోనాటికల్ డెవలప్ మెంట్ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేసింది. దీన్ని మొబైల్ హైడ్రో-న్యూమాటిక్ లాంఛర్తో ప్రయోగిస్తే, పారాచ్యూట్ సహాయంతో తిరిగి పొందవచ్చు.

నిషాంత్

నిషాంత్

ఇది గంటకు 125-150 కి.మీ.ల వేగంతో నాలుగున్నర గంటలు ప్రయాణిస్తుంది. శత్రు భూభాగంలోని సైనిక కదలికలపై నిఘా కోసం, లక్ష్యాలను గుర్తించడానికి, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ (ఈఎల్ఐఎన్టీ) సిగ్నల్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐజీఎన్ఐటీ) కి ఉపయోస్తారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు. చక్రాలతో కూడిన ఈ నిషాంత్ ను 'పంచి' అని పిలుస్తారు.

ఏయూఆర్ఏ

ఏయూఆర్ఏ

శత్రువులకు తెలియకుండా ఆకాశం నుంచి బాంబులను వేసే భారతీయ మానవరహిత గగనతలం నుంచి దాడిచేసే వాహనాన్నే (ఐయూఎస్ఏవీ) ఏయూఆర్ఏ అని పిలుస్తున్నారు. దీని పూర్తి పేరు అటానమస్ ఆన్మాన్య రిసెర్చ్ ఎయిర్ క్రాఫ్ట్. తేజస్ మాదిరిగా దీనికి కూడా ఒక భారతీయ పేరును నిర్ణయించాల్సి ఉంది.

ఏయూఆర్ఏ

ఏయూఆర్ఏ

ఇది సంప్రదాయ, న్యూక్లియర్ బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ, శత్రువుల రాడార్ల నుంచి తప్పించుకుని దాడిచేస్తుంది. దీనికి తేజస్ లో వాడిన 'కావేరి' ఇంజిన్ని ఉపయోగించారు.

లక్ష్య

లక్ష్య

దీన్ని కూడా డీఆర్డీవోనే అభివృద్ధి చేసింది. ఇది అధిక వేగంతో ప్రయాణించే డ్రోన్ వ్యవస్థ. దీన్ని కొంత దూరం నుంచి నియంత్రించవచ్చు. శత్రు విమానాలను ఎదుర్కోవడంలో భాగంగా పైలట్లకు, సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

లక్ష్య

లక్ష్య

ఈ డ్రోన్ గాలిలో రెండు లక్ష్యాలను తాడుతో లాక్కొని వెళుతుంది. సైనికులు వీటిని కాల్చడం ద్వారా తర్ఫీదు పొందుతారు.మొదటిసారి డీఆర్డీవో లక్ష్యకు సంబంధించిన టెక్నాలజీని ఎల్అండ్టీ కంపెనీతో పంచుకుంటుంది.

లక్ష్య 2

లక్ష్య 2

రెండు సంస్థల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిపరిచిన లక్ష్య -2 ను ఉత్పత్తి చేయనున్నారు. 'లక్ష్య'ను భూమి లేదా నౌక నుంచి' జీరో లెన్త్ లాంఛర్'తో ప్రయోగిస్తారు.

నేత్ర

నేత్ర

ఐడియా ఫోర్జ్ అనే ముంబయి కంపెనీ, డీఆర్డీవో భాగస్వామ్యంతో తయారు చేసిన తేలికపాటి స్వయం నియంత్రిత మానవరహిత వైమానిక వాహనం. సాలీడు ఆకారంలో ఉండే దీని బరువు 1.5 కిలోల కంటే తక్కువ.

నేత్ర

నేత్ర

వీటిని ప్రాథమికంగా సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) లు ఉపయోగించనున్నాయి. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, జగన్నాథ రథయాత్రలోని అశేష జనవాహినిని గమనించేందుకు దీన్ని ఇప్పటికే ఉపయోగించారు.

నేత్ర

నేత్ర

ఈ విమానంలో కెమెరా, వీడియోలతోపాటు థర్మల్ (పరారుణ) కెమెరా కూడా ఉంటుంది. ఇది వైమానిక నిఘాకు, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది.

రుస్తోమ్

రుస్తోమ్

ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ 'రుస్తోమ్ దమానియా' కృషికి గుర్తింపుగా డీఆర్డీవో దీనికి రుస్తోమ్ అని నామకరణం చేసింది. ఇది మధ్యంతర ఎత్తులో అధిక కాలం ఎగిరే మానవ రహిత యుద్ధ గగనతల వాహనం. (ఎమ్ఏఎల్ఈ-యూసీఏవీ).

రుస్తోమ్

రుస్తోమ్

రుస్తోమ్ అటానమస్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ (ఏటీవోఎల్) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రుస్తోమ్ -2 అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్లను పోలి ఉంటుంది. ఎల్ అండ్ టీ కంపెనీ రుస్తోమ్ -2 ను డీఆర్డీవో సహాయంతో మరింత ఆధునీకరించనుంది.

హెచ్ఏఎల్-తేజస్

హెచ్ఏఎల్-తేజస్

ఇది తేలికపాటి యుద్ధ విమానం (లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్-ఎల్సీఏ). ఒకే సీటు, ఒకే ఇంజిన్తో ఉండే తోకలేని ఫైటర్ విమానాన్ని దేశీయ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అభివృద్ధి చేసింది.

హెచ్ఏఎల్-తేజస్

హెచ్ఏఎల్-తేజస్

ఎల్సీఏ ప్రోగ్రాంలో భాగంగా తయారైన ఈ విమానానికి 'తేజస్' అని అటల్ బిహారీ వాజ్పేయి నామరణం చేశారు. 1980 వరకు భారత్ విదేశీ యుద్ధ విమానాల కొనుగోలుకు బిలియన్ల అమెరికన్ డాలర్లను వెచ్చించింది.

హెచ్ఏఎల్-తేజస్

హెచ్ఏఎల్-తేజస్

విదేశీ రక్షణ వ్యవస్థలపై ఆధారపడకుండా, దేశీయ తేలికపాటి యుద్ధ విమానాలు తయారు చేసే లక్ష్యంతో ఎల్సీఏ ప్రోగ్రామ్ ను 1983లో ప్రారంభించారు. 2001 లో మొదటిసారి ఎల్సీఏ గాల్లో ఎగిరింది.

హెచ్ఏఎల్-తేజస్

హెచ్ఏఎల్-తేజస్

సూపర్ సోనిక్, మల్టీరోల్ టాక్టికల్, అడ్వాన్స్డ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మార్క్- నేను ని అభివృద్ధి చేసి తేజస్ మార్క్- II ఎయిర్క్రాఫ్ట్లను తయారు చేయనున్నారు.రఫెల్ యుద్ధ విమానాలకు బదులు 120 దేశీయ తేజస్ విమానాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) సమకూర్చుకోనుంది.

తేజస్ పితామహుడు

తేజస్ పితామహుడు

మిగ్ విమానాల స్థానంలో నిర్మించతలపెట్టిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) ప్రాజెక్ట్ ను, 1985 లో డీఆర్డీవో సంస్థ అయిన ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ చేపట్టింది. దీనికి డాక్టర్ కోట హరినారాయణను ఇన్‌ఛార్జ్ గా నియమించారు. ఆయన 25 సంవత్సరాల పాటు 40 ప్రయోగశాలలు , 25 విద్యాసంస్థలు, 300 సంస్థలతో పనిచేసి తేజస్ కు రూపమిచ్చారు. అందుకే హరినారాయణను తేజస్ పితామహుడుగా పిలుస్తారు.

ప్రతిష్ఠాత్మక హెరాన్ టీపీ డ్రోన్లను

ప్రతిష్ఠాత్మక హెరాన్ టీపీ డ్రోన్లను

ఇక ఆయుధ సంపత్తిని కలిగిఉండటం అనివార్యంగా మారిన నేపథ్యంలో అత్యాధునిక డ్రోన్లను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రతిష్ఠాత్మక హెరాన్ టీపీ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోనున్నది. ఇజ్రాయెల్ ఎయిరోస్సేస్ ఇండస్ట్రీ (ఐఏఐ) తయారుచేసిన హెరాన్ టీపీ డ్రోన్లు .. భూమి నుంచి దాదాపు 11 కిలో మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు.

నేలపైనున్న అతి చిన్న వస్తువును కూడా గుర్తించి

నేలపైనున్న అతి చిన్న వస్తువును కూడా గుర్తించి

నేలపైనున్న అతి చిన్న వస్తువును కూడా గుర్తించి, పొటో, స్కానింగ్ చేస్తుంది. ఆదేశానుసారం పేలుళ్లు కూడా జరుపుతుంది. ఈ మానవరహిత వైమానిక వాహనం ఒక్కసారి ఇంధనం నింపుకున్న తర్వాత ఏకధాటిగా 50 గంటలకుపైగా ప్రయాణించగలదు.

ఐఏఐ రూపొందించిన డ్రోన్లలో హెరాన్ టీపీ సరికొత్త వెర్షన్.

ఐఏఐ రూపొందించిన డ్రోన్లలో హెరాన్ టీపీ సరికొత్త వెర్షన్.

ఐఏఐ రూపొందించిన డ్రోన్లలో హెరాన్ టీపీ సరికొత్త వెర్షన్. నిజానికి రక్షణ శాఖ మూడేళ్ల కిందటే డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదనను భారత ప్రభుత్వం ముందుంచింది. సుధీర్ఘ కసరత్తు అనంతరం గత సెప్టెంబర్ లో ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ల కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మొత్తం 10 డ్రోన్లను కొనుగోలు చేసేందుకుగానూ ఏకంగా రూ. 26 వేల కోట్లు

మొత్తం 10 డ్రోన్లను కొనుగోలు చేసేందుకుగానూ ఏకంగా రూ. 26 వేల కోట్లు

మొత్తం 10 డ్రోన్లను కొనుగోలు చేసేందుకుగానూ ఏకంగా రూ. 26 వేల కోట్లు వెచ్చించనుంది. అతి తర్వరలోనే ఇజ్రాయెల్ డ్రోన్లు భారత్ కు చేరుకుంటాయన్న రక్షణ శాఖ సంబంధిత వివరాలు తెలిపేందుకు నిరాకరించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write India tops list of drone-importing nations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X