సెల్ఫీ కోసం లక్షల ఖర్చు, తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నసెల్ఫీలు

|

ఇప్పుడు నడుస్తోంది సెల్ఫీల ట్రెండ్. ఈ సెల్ఫీల పిచ్చి యువతలో ఇప్పుడు నరనరాల్లోకి ఎక్కిందంటే దానికి వారి తల్లిదండ్రులు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా....దేశాధ్యక్షులు మొదలుకుని హాలీవుడ్ తారల దాకా అంతా సెల్పీ సెల్ఫీ అని పడి చస్తున్న వాళ్లే..ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా‌గ్రామ్ ..ఇలా కనిపించిన ప్రతీ సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టాలని యువత తెగ తాపత్రయ పడి లక్షలు వదిలించుకుంటోంది. తల్లిదండ్రుల గుండెలు గుభేల్ మనేలా చేస్తోంది.

 

Read more : ఒబామా.. నీ సెల్ఫీ కేక మామా

సెల్ఫీల కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ

సెల్ఫీల కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ

సెల్ఫీల కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్న యువతీ యువకులతో తల్లిదండ్రుల గుండెల్లో ఇప్పుడు గుబుల మొదలైంది. డబ్బు ఇలా సెల్పీల కోసం తగలేస్తుండటంతో వారు షాకవుతున్నారు. తలలు బాదుకుంటున్నారు.

ఢిల్లీకి చెందిన సాహిల్ కమ్రా తన ముక్కు, పెదాలకు

ఢిల్లీకి చెందిన సాహిల్ కమ్రా తన ముక్కు, పెదాలకు

ఢిల్లీకి చెందిన సాహిల్ కమ్రా తన ముక్కు, పెదాలకు అతగాడు రూ. 80 వేలతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఇకమీదట తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లో సెల్ఫీలు తీసుకోగలనని, ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసం వచ్చిందని సాహిల్ చెబుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మనోడికి 500 మంది వరకు ఫాలోవర్లున్నారు మరి!

తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత
 

తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత

తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు పెరిగారని, ఫేస్బుక్లో లైకులు కూడా ఇంతకుముందు కంటే ఎక్కువ వస్తున్నాయని కమ్రా ఆనందం వ్యక్తం చేశాడు. తాను రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, దానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని అతడు అంటున్నాడు.

గడిచిన రెండేళ్లలో తన వద్దకు వచ్చే పేషెంట్ల సంఖ్య 25 శాతం పెరిగిందని

గడిచిన రెండేళ్లలో తన వద్దకు వచ్చే పేషెంట్ల సంఖ్య 25 శాతం పెరిగిందని

డాక్టర్ అనూప్ ధీర్ అనే వైద్యుడు అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. గడిచిన రెండేళ్లలో తన వద్దకు వచ్చే పేషెంట్ల సంఖ్య 25 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. అయితే.. వచ్చేవాళ్లలో మూడోవంతు మంది మాత్రమే అబ్బాయిలు.. మిగిలిన వాళ్లంతా అమ్మాయిలేనట. తన కింది పెదవి కంటే పై పెదవి పెద్దగా ఉందని, దాన్ని సరిచేస్తారా అని కూడా అడుగుతున్నారని ఆయన వాపోయారు.

రియాల్టీ షోలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కిమ్ కర్దాషియాన్కు

రియాల్టీ షోలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కిమ్ కర్దాషియాన్కు

రియాల్టీ షోలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కిమ్ కర్దాషియాన్కు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 4.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఇదంతా తన సెల్ఫీల పుణ్యమేనని ఆమె చెబుతోంది.

రణవీర్‌సింగ్ మంచాన పడ్ట సమయంలో

రణవీర్‌సింగ్ మంచాన పడ్ట సమయంలో

ఇక బాలీవుడ్ హీరోగా కంటే... దీపికా పడుకొనే బాయ్‌ఫ్రెండ్‌గానే బాగా పాపులర్ అయిన రణవీర్‌సింగ్ మంచాన పడ్ట సమయంలో ముంబైలోని ఓ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుని ఆపరేషన్ థియేటర్ నుంచే ఓ సెల్ఫీ దిగి... అభిమానుల కోసం దాన్ని ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశాడు.

న్యూయార్క్‌లో జెన్నిఫర్‌ రెనాల్డ్స్‌ అనే యువకుడు

న్యూయార్క్‌లో జెన్నిఫర్‌ రెనాల్డ్స్‌ అనే యువకుడు

న్యూయార్క్‌లో జెన్నిఫర్‌ రెనాల్డ్స్‌ అనే యువకుడు సెల్ఫీలో ముక్కు దగ్గర తేడాగా కనిపించిందని ఏకంగా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించేసుకున్నాడు. సర్జరీ తర్వాత తనమీద తాను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటున్నాడు. ఇప్పుడు చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో అంటూ తెగ గంతులేసేస్తున్నాడు..

సెల్ఫీకోసం ఫేస్‌ షేపులు మార్చేసే వారు అమెరికాలో

సెల్ఫీకోసం ఫేస్‌ షేపులు మార్చేసే వారు అమెరికాలో

ఇతనొక్కడే కాదు, సెల్ఫీకోసం ఫేస్‌ షేపులు మార్చేసే వారు అమెరికాలో చాలామందే ఉన్నారు. రెనాల్డ్స్‌ను చూసి ఇన్‌స్పైర్‌ అయిపోయి ముఖాన్ని తీసుకెళ్లి డాక్టర్లకు అప్పగించేస్తున్నారు. ఆపరేషన్‌కు ముందు ఎలా ఉన్నారో, ఆ తర్వాత ఎలా మారిపోయారో ఫొటోలు తీసుకుని మరీ సోషల్‌ సైట్లలో పోస్టు చేసేస్తున్నారు.

 అమ్మడు సెల్ఫీల కోసం 15 వేల డాలర్లు

అమ్మడు సెల్ఫీల కోసం 15 వేల డాలర్లు

ఇక ఈ అమ్మడు సెల్ఫీల కోసం 15 వేల డాలర్లు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ముందు తర్వాత నేను ఎలా ఉన్నానంటూ పోస్ట్ చేసింది.

2012లో కను రెప్పలకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న

2012లో కను రెప్పలకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న

2012లో కను రెప్పలకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న వారి సంఖ్య ఆరు శాతం ఉంటే.. 2013లో 10 శాతానికి పెరిగింది.. ఈ ఏడాది ఏకంగా 25 శాతం పెరిగింది.. అమెరికన్లు సెల్ఫీలకు ఏ రేంజ్‌లో ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారో ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతోంది.. మరి సెల్ఫీనా మజాకా..!

ఎక్కువగా ముఖారవిందం బాగాలేదని

ఎక్కువగా ముఖారవిందం బాగాలేదని

ఎక్కువగా ముఖారవిందం బాగాలేదని యువత సెల్ఫీలు తీసుకోవాలన్న యావతోనే ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ల బాట పడుతున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఇలా తమ వద్దకు వస్తున్న యువత 25 శాతం మేర పెరిగిందని అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్లు చెబుతున్నారు.

ఐ ఫోన్ తో క్లినిక్ లకు వస్తున్న సదరు యువతీ యువకులు

ఐ ఫోన్ తో క్లినిక్ లకు వస్తున్న సదరు యువతీ యువకులు

ఐ ఫోన్ తో క్లినిక్ లకు వస్తున్న సదరు యువతీ యువకులు ఆ ఫోన్లలో తమ సెల్ఫీలతో పాటు ఫేస్ బుక్ లోని ఇతరుల సెల్ఫీలను చూపుతూ వారిలాగే తమ మోమును కూడా కాస్త సరిదిద్దండంటూ కోరుతున్నారట.

సో మీరు కూడా సెల్ఫీ కోసం మీ ముఖం బాగాలేదని

సో మీరు కూడా సెల్ఫీ కోసం మీ ముఖం బాగాలేదని

సో మీరు కూడా సెల్ఫీ కోసం మీ ముఖం బాగాలేదని ప్లాస్టిక్ సర్జరీల వెంట పరుగులు తీసి డబ్బులు ఊడగొట్టుకోకండి. డబ్బులు చాలా విలువైనవని గుర్తించుకోండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Nip, tuck, click: Selfies see demand for plastic surgery to soar by 25%, as patients go in search of the picture perfect look

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X