తోక చుక్కపై ఫీలే ల్యాండర్ దిగింది

Posted By:

తోక చుక్కపై తొలి అడుగు విజయం పడింది. ఇప్పటి వరకూ తోకచుక్కపై ఏమీ దిగలేదు..అయితే ఆ అద్భుత ఘట్టాన్ని ఈసా తన ఖాతాలో వేసుకుంది. రోసెట్టా వ్యోమనౌక సాయంతో 67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో తోకచుక్కపై ఫీలే ల్యాండర్ ను ఈసా దింపింది. ఇది ఖగోళ చరిత్రలోనే అత్భుతమైన ఘట్టం.అంతరిక్షం నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనే దిశగా మానవాళి వేసిన తొలి అడుగు విజయం.

Readmore: దూసుకొస్తున్న మైక్రోసాఫ్ట్ న్యూ ఆఫీస్

ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించింది. 67పీ తోకచుక్క ఆగస్టు 13న సూర్యుడికి అత్యంత సమీపానికి దాదాపు 186 మిలియన్ కిలోమీటర్ల దరిదాపులకు వెళ్లింది. ఆ సమయంలో ఆ తోకచుక్క ఉపరిత ఉష్ణోగ్రత మార్పులు,స్పందనలను చిత్రాల రూపంలో రోసెట్టా ఇటీవల భూమిపైకి పంపింది. ఈ నేపథ్యంలో 67పీ తోకచుక్కపై ఫీలే ల్యాండింగ్ ప్రయోగ విశేషాలు తెలుసుకుందాం.

Read more : చిచ్చురేపుతున్నఅక్రమ సంబంధాల గుట్టు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎవరు ప్రయోగించారు

ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ 67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో అనే తోక చుక్కపై రోసెట్టా వ్యోమనౌకను 2004లో ప్రయోగించింది.

పదేళ్ల పాటు..

ఇది పదేళ్ల పాటు సుమారు 640 కోట్ల కిలోమీటర్లు అంతరిక్షంలో ప్రయాణించి గతేడాది నవంబర్ 12న ఆ తోకచుక్కను చేరింది.

ఫీలే ల్యాండర్

వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఆ తోక చుక్క చుట్టూ తిరుగుతూనే ఫీలే ల్యాండర్ ను రోపెట్టా ఆ తోకచుక్కపై జారవిడిచింది.

ఇదే తొలిసారి

ఇలా ఒక తోకచుక్కపై వ్యోమనౌకను దింపటం ఇదే తొలిసారి

ఎందుకు ప్రయోగించారు..?

సౌరకుటుంబం ఏర్పడినప్పుడు మిగిలిపోయిన పురాతన పదార్థంతో 450 ఏళ్ల క్రితం ఈ తోకచుక్క ఏర్పడిందని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు.

160 కోట్ల ఖర్చు

దానిపై అధ్యయనం చేస్తే భూమిపై నీరు ఎలా వచ్చింది. జీవం ఎలా ఏర్పడింది..గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి...సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితులు ఏంటీ ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయోగించారు. సుమారు 160 కోట్ల ఖర్చుతో ఈసా ఈ ప్రయోగం చేపట్టింది.

67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో

బొగ్గులాగా నల్లగా రాళ్లు రప్పలతో నిండి ఉంటుంది. 14 కిమీ పరిమాణంలో ఉన్న ఈ తోకచుక్క సౌరకుటుంబం ఏర్పడినప్పుడు మిగిలిపోయిన పదార్థంతో ఏర్పడిందని శాస్ర్తవేత్తలు నమ్ముతున్నారు.

67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో

ఈ తోకచుక్క సెకనుకు 18 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. తన చుట్టూ తాను తిరగడానికి 12 గంటల సమయం తీసుకుంటుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి ఆరున్నరేళ్ల సమయం పడుతుంది.

మూగబోయిన ల్యాండర్

తోకచుక్కపై దిగే సమయంలో ల్యాండర్ మూడు సార్లు ఎగిరి పడటంతో ల్యాండర్ అనేక కుదుపులకు లోనైంది. దీంతో రాళ్ల మధ్య సూర్యరశ్మిని సోకని చీకటిలో ల్యాండర్ పడిపోయింది .

మూగబోయిన ల్యాండర్

దీంతో అక్కడ విద్యుత్పత్తి చేసుకోలేక తాత్కాలికంగా అది మూగబోయింది.అయితే బ్యాటరీ పూర్తిగా అయిపోకముందు ఇది మూడు రోజుల పాటు తాను సేకరించిన సమాచారాన్ని రోసెట్టా వ్యోమనౌకకు పంపించింది.

ఎట్టకేలకు ఏడు నెలల తరువాత మేల్కొంది

67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో తోక చుట్టూ తిరుగుతున్న రోసెట్టా ద్వారా సంకేతాలను పంపుతూ ఫీలేని నిద్రలేపేందుకు శాస్ర్తవేత్తలు ప్రయత్నించారు. అది ఎట్టకేలకు ఏడు నెలల తరువాత మేల్కొంది.

హలో ఎర్త్

హలో ఎర్త్ అంటూ భూమిపైకి సంక్షిప్త సందేశాన్ని కూడా పంపింది. వంద కేజీల బరువు,రిప్రిజిరేటర్ పరిమాణంలో ఉన్న పీలే ల్యాండర్ పది విభిన్నమైన శాస్ర్త పరికరాలతో ఆ తోకచుక్కపై పరిశోధనలు చేస్తోంది.

హలో ఎర్త్

ల్యాండర్ కి అమర్చిన కెమెరాలు 360 డిగ్రీల కోణంలో తోకచుక్క ఛాయా చిత్రాలను ఎప్పటికప్పుడు భూమిపైకి పంపుతూనే ఉంది.

తోక చుక్క పొడవు

67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో తోకచుక్క 4 కిమీ వెడల్పు అలాగే 5 కిమీ పొడవును కలిగి దాదాపు 1000 టన్నుల వరకు బరువును కలిగిఉంటుంది.

ప్రస్తుతం ఎక్కడ

ప్రస్తుతం తోక చుక్క భూమికి 30 కిలోమీటర్ల దూరంలో సెకనుకు 18 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది.

ఫీలే ల్యాండర్ బరువు

ఫీలే ల్యాండర్ బరువు భూమిపై 100 కిలోలు అలాగే తోక చుక్కపై దాని బరువు కిలో లోపే ఉంటుంది.ఎందుకంటే తోకచుక్కపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది.

రోసెట్టా జీవిత కాలం

రోసెట్టా జీవిత కాలం 12 ఏళ్లు ..దాని ప్రయాణ వేగం గంటకు 54 718 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించి 67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో తోకచుక్కను చేరింది.

సందేశం

రోసెట్టా కాంతి వేగంతో ఒక సందేశాన్ని పంపితే దాన్ని చేరటానికి 30 నిమిషాలు పడుతుంది.

67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో

1969లో సోవియట్ యూనియన్ కు చెందిన ఇద్దరు ఔత్సాహికులు 67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో తొకచుక్కను కనుగొన్నారు.ఆ ఇద్దరి పేర్లే ఈ తోక చుక్కలకు పెట్టారు.

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్ బాట్ పేజీని లైక్ చేయడం ద్వారా మీరు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు ఫొందగలరు 

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ESA's Rosetta today witnessed Comet 67P/Churyumov-Gerasimenko making its closest approach to the Sun. The exact moment of perihelion occurred at 02:03 GMT this morning when the comet came within 186 million km of the Sun.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot