రూ. 2600 కోట్ల డ్రోన్ల ప్రాజెక్ట్ :భారత్ కీలక అడుగు

Written By:

సువిశాల గగనతలంతో పాటు సుదీర్ఘమైన సాగరతీరం ఉన్న భారత్ లో వైమానిక దళం పాత్ర చాలా కీలకమైనది. శత్రువులు ఏ పక్కనుంచి దాడిచేస్తారో తెలియదు కాబట్టి అణుక్షణం అప్రమత్తంగా ఉండాలి. చేతిలో అత్యాదునిక ఆయుధాలు ఉండాలి. రిమోట్ కంట్రోల్ తో పెనువిధ్వంసం సృష్టించే ఆయుధాలు కావాలి. భారత్ ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అత్యాధునికమైన మానవరహిత యుద్ధ విమానాల ప్రాజెక్ట్ కు పచ్చజెండా ఊపింది.

Read more: అవి బయటకు వచ్చి ఉంటే పెను వినాశనమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియా ఎట్టకేలకు మరో కీలక అడుగు

ఇండియా ఎట్టకేలకు మరో కీలక అడుగు ముందుకేసింది. ఆయుధ సముపార్జనలో దూసుకుపోతున్న అగ్రరాజ్యాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అయింది. మానవరహిత యుద్ధ విమానాలను అలాగే పోరాట డ్రోన్లను సొంతంగా తయారుచేయాలని ప్రాజెక్ట ఘటక్ కు శ్రీకారం చుట్టింది.

అత్యాధునిక ఆయుధాలను సముపార్జించుకునేందుకు భారీ మొత్తాన్నే

వీటితో పాటు అగ్ని క్షిపణులను తయారుచేసేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. శత్రువులను నాశనం చేయగల అత్యాధునిక ఆయుధాలను సముపార్జించుకునేందుకు భారీ మొత్తాన్నే వీటికోసం భారత ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం దాదాపు రూ. 2600 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపింది. ఆ ప్రాజెక్ట్ పేరే ఘటక్.

తరువాయి భాగం ఆర్థికశాఖ అమోదం తెలపడమే

ఇప్పటికే దీనికి సంబంధించి ఢిపెన్స్ శాఖ క్లియెరెన్స్ కూడా ఇచ్చింది. ఇక తరువాయి భాగం ఆర్థికశాఖ అమోదం తెలపడమే. అక్కడ అమోదం పొందిన తరువాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైల్ కేబినెట్ కమిటీ ముందుకు వస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

2009లో 12.50 కోట్లతో UCAV గా బయటకు వచ్చినా

ప్రాజెక్ట్ ఘటక్ అనేది మానవరహిత యుద్ధ విమానాలను తయారుచేసే పోగ్రామ్. ఇది 2009లో 12.50 కోట్లతో UCAV గా బయటకు వచ్చినా అప్పటి నుంచి సాధ్యాసాధ్యాల మీద చర్చలు జరుగుతూ వచ్చాయి.

అయితే ఇది 2013 నాటికి ఓ కొలిక్కి వచ్చిందని

అయితే ఇది 2013 నాటికి ఓ కొలిక్కి వచ్చిందని రక్షణ శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ పార్లమెంట్ లో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ను ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ అలాగే డీఆర్ డీఓ సంయుక్తంగా చేపడుతున్నాయి.

దీనికి మరింత మెరుగులు దిద్దడానికి ఐఎఎఫ్ సహకారం

ఇప్పుడు ఇది ప్రారంభదశలోనే ఉండటంతో దీనికి మరింత మెరుగులు దిద్దడానికి ఐఎఎఫ్ సహకారం తీసుకునే ఆలోచనలో ఉంది. అత్యంత తక్కువ బరువుగల జెట్ విమానాలను తయారుచేసే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నారు.

ఇది పూర్తి కావడానికి దశాబ్దం కాలం

అలాగే ఎక్కువ దూరం ఎగరగలిగేలా డ్రోన్ల రెక్కలను తయారుచేయనున్నారు. అయితే ఇది పూర్తి కావడానికి దశాబ్దం కాలం పడుతుందని తెలుస్తోంది.

కావేరీ ఏరోస్పేస్ ఇంజిన్లతో అభివృద్ధి

మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే UCAV ప్రాజెక్ట్ లో తయారయ్యే డ్రోన్లకు కావేరీ ఏరోస్పేస్ ఇంజిన్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇవి 52 కిలోన్యూటన్ పొడి వేరియంట్ ఉంటుందని అంచనా.

తేజాస్ తేలికపాటి యుద్ధ విమానాల పవర్ ప్లాంట్ కోసం

అయితే ఆశ్చర్యంగా తేజాస్ తేలికపాటి యుద్ధ విమానాల పవర్ ప్లాంట్ కోసం దీన్ని సమకూర్చకోవాలని చూస్తే అది విజయవంతం కాలేదు. ఇది తేజాస్ యుద్ధ విమానాలకు అధిక శక్తిని అందించడంలో విఫలమైంది.

అప్పుడు స్వదేశీ యుద్ధ ప్రాజెక్టు కోసం

అప్పుడు స్వదేశీ యుద్ధ ప్రాజెక్టు కోసం అమెరికా GE ఇంజిన్లు వాడవలిసి వచ్చింది. అయితే ఇది తర్వాత అన్ని హంగులను సమకూర్చుకుని 1989లో ఆమోదం పొందింది. దాదాపు రూ. 2,839 కోట్లు దీని కోసం ఖర్చు చేశారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు రావని అత్యంత శక్తివంతమైన డ్రోన్లకు ఈ ఇంజిన్ ఉపయోగిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write India set to develop own stealth combat drones
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot