సరిహద్దు దేశాలకు ఇక ముచ్చెమటలే

Posted By:

ఓ వైపు పాకిస్తాన్..మరో వైపు చైనా... మరోవైపు అత్యాధునిక టెక్నాలజీ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ వైపు నుంచి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి.. అదీగాక ఈ మధ్య పాకిస్తాన్ చర్చలకు రాంరాం చెప్పి కయ్యానికి కాలు దువ్వుతోంది. దానికి చైనా వంత పాడుతోంది..మరి విపత్కర సునామిని భారత్ ఎలా ఎదుర్కోబోతోంది.. మన ఆర్మీ ఆయుధాలను సమకూర్చకునేందుకు రెడీ అవుతుందా.. ఎప్పుడు దాడి జరిగినా ఆ దాడిని తిప్పి కొట్టేందుకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోనుందా..భారత్ ఏం చేయబోతోంది అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం..

Read more :రణ రంగం.. పాక్ వెనుక చైనా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్షణాల్లో విధ్వంసం

క్షణాల్లో విధ్వంసం

అవి ఆకాశంలోంచి ప్రమాదాన్ని మోసుకొస్తాయి. క్షణాల్లో విధ్వంసం సృష్టిస్తాయి. ఉగ్రసంస్థల చేతిలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. అవేంటో తెలుసా డ్రోన్స్ .. అవును ఈ డ్రోన్స్ ఇప్పుడు భారత్ అమ్ములపొదిలోకి రానున్నాయి. అత్యాధునిక డ్రోన్స్ భారత్ లో సైన్యం చేతికి రానున్నాయి.

భారత రక్షణ రంగం మరో కీలక అడుగు

భారత రక్షణ రంగం మరో కీలక అడుగు

ఆయుధ సమపార్జనలో భారత రక్షణ రంగం మరో కీలక అడుగు ముందుకేసింది. అటు పాకిస్తాన్,ఇటు చైనా సరిహద్దులో తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతుండటం ఆ రెండు దేశాలకంటే మెరుగైన లేదా సరిసమానమైన ఆయుధ సంపత్తిని కలిగిఉండటం అనివార్యంగా మారిన నేపథ్యంలో అత్యాధునిక డ్రోన్లను సమకూర్చకునేందుకు సిద్ధమైంది.ఇందుకోసం ప్రతిష్టాత్మక హెరాన్ టీపీ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోనున్నది.

హెరాన్ టీపీ డ్రోన్లు

హెరాన్ టీపీ డ్రోన్లు

ఇజ్రాయెల్ ఎయిరో స్పేస్ ఇండస్ట్రీ తయారు చేసిన హెరాన్ టీపీ డ్రోన్లు భూమి నుంచి దాదాపు 11 కిలోమీటర్లు ఎత్తులో ప్రయాణించగలవు.నేలపైనున్న అతి చిన్న వస్తువును కూగా గుర్తించి ఫోటో స్కానింగ్ చేస్తుంది. ఆదేశానుసారం పేళుళ్లు కూడా జరుపుతుంది.

వీలైనంత త్వరగా వాటిని డెలివిరీ చేయాలని..

వీలైనంత త్వరగా వాటిని డెలివిరీ చేయాలని..

అయితే మూడు సంవత్సరాల క్రితం దీని గురించి చర్చలు జరిపిన భారత ప్రభుత్వం వీలైనంత త్వరగా వాటిని డెలివిరీ చేయాలని కోరుతోంది. ఇప్పటికే పాకిస్తాన్, చైనాలు డ్రోన్లను సమకూర్చకునే పనిలో బిజీగా ఉన్నాయి కూడా.

ఏకధాటిగా 50 గంటలకు పైగా ప్రయాణం

ఏకధాటిగా 50 గంటలకు పైగా ప్రయాణం

ఈ మానవరహిత వైమానిక విమానం ఒక్కసారి ఇంధనం నింపుకున్న తర్వాత ఏకధాటిగా 50 గంటలకు పైగా ప్రయాణించగలదు.

ప్రస్తుతం భారత్ వద్ద నిఘా డ్రోన్లు

ప్రస్తుతం భారత్ వద్ద నిఘా డ్రోన్లు

ఐఏఐ రూపిందించిన డ్రోన్లలో భారత్ కు చేరుకుంటాయన్న రక్షణ శాఖ సంబంధిత వివరాలు తెలిపేందుకు నిరాకరించింది. ప్రస్తుతం భారత్ వద్ద నిఘా డ్రోన్లు మాత్రమే ఉన్నాయి.

డ్రోన్ ను కూల్చేసిన పాక్ ఆర్మీ

డ్రోన్ ను కూల్చేసిన పాక్ ఆర్మీ

కొద్ది నెలల కిందట తన భూభాగంలో ఒక డ్రోన్ ను కూల్చేసిన పాక్ ఆర్మీ అది భారత్ కు చెందిన గూఢచార డ్రోన్ అని అరోపించింది. ఆ తరువాత సదరు డ్రోన్ చైనాలో తయారయినట్లు పాకిస్తానే దానిని వినియోగించినట్లు తెలియవచ్చింది.

పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులపై డ్రోన్లతో దాడి

పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులపై డ్రోన్లతో దాడి

మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులపై డ్రోన్లతో దాడి చేసినట్లు గతవారం ప్రకటించింది. దీన్ని బట్టి ఆ డ్రోన్ ఉగ్రవాద ముఠాలే అక్కడ ప్రయోగించి ఉంటారనే అనుమానాలు మరింతగా కలుగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా భారత్ కూడా కాల్పులు,పేళుల్లు జరపగల డ్రోన్లను కొనుగోలు చేస్తున్నది.

మిలిటెంట్ గ్రూపులను భారత్ పైకి..

మిలిటెంట్ గ్రూపులను భారత్ పైకి..

జాతీయ భద్రతా సలహాదారుల సమావేశ అజెండాపై నానాయాగీ చేసి చర్చలు జరపకుండా చేసిన పాకిస్తాన్ ఇప్పుడు మిలిటెంట్ గ్రూపులను భారత్ పైకి ఎగదోసేందుకు ప్రయత్నిస్తోందని దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది కూడా.

డ్రోన్స్ తో దాడులు

డ్రోన్స్ తో దాడులు

ఈ మిలిటెంట్ గ్రూపులు డ్రోన్స్ తో దాడులు చేయొచ్చన్న సమాచారంతో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుతో పాటు ప్రధాన నగరాలను కూడా కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది .

పేరా గ్లైడర్స్ ,డ్రోన్స్

పేరా గ్లైడర్స్ ,డ్రోన్స్

మిలిటెంట్ గ్రూపులు ఇప్పటికే 70 కిలోమీటర్ల పరిధిలో వినియోగించే వీలున్న పేరా గ్లైడర్స్ ,డ్రోన్స్ సమకూర్చకున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వీటిలో దాదాపు 150 కేజీల మందుగుండు సామాగ్రిని రవాణా చేసుకునే వీలున్నట్లు కూడా తెలుస్తోంది.

ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం

ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం

ఇక పాకిస్థాన్‌కు అమెరికా మానవరహిత వైమానిక వాహనాలను (డ్రోన్స్)ను సమకూర్చనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురనుంది. ఈ విషయాన్ని అటు పాకిస్థాన్‌తో పాటు.. ఇటు అమెరికా రక్షణ శాఖ వర్గాలు నిర్ధారించాయి.

భారత వైమానిక దళాధిపతి పి.వి.నాయక్‌

భారత వైమానిక దళాధిపతి పి.వి.నాయక్‌

ఇదిలావుండగా, అమెరికా మానవరహిత వైమానిక వాహనాలు సమకూర్చడంపై ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని భారత వైమానిక దళాధిపతి పి.వి.నాయక్‌ స్పష్టం చేశారు.అందులో భాంగానే ముందు జాగ్రత్తగా ఇజ్రాయెల్ డ్రోన్లను భారత్ తమ అమ్ములపొదిలోకి తీసుకురావాలని భావిస్తోంది.

దీనిలో నిజమెంత..?

దీనిలో నిజమెంత..?

అయితే అమెరికా నుంచి పాకిస్తాన్ కు రానున్న డ్రోన్లు తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు మాత్రమే వాడుతారని అటు అమెరికా ఇటు పాకిస్తాన్ చెబుతున్నాయి. మరి దీనిలో నిజమెంత ఉందో తెలియిదు కాని దాడులకు వ్యూహరచన చేస్తుందన్నది మాత్రం వాస్తవమేనని నిఘా వర్గాల వద్ద సమాచారం కూడా ఉంది.

ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది ?

ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది ?

అసలు డ్రోన్ లతో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది ? డ్రోన్ లు ఏ రకమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి? వైమానిక దాడులకు ప్రత్యామ్నాయంగా, మిసైల్ దాడులకు మరో రూపంగా డ్రోన్ లు మారనున్నాయా? ఎగిరే చిన్న వాహనం అంతులేని విధ్వంసానికి కారణం అయ్యే అవకాశాలున్నాయా?

కాలు కదపకుండా చకచకా అన్ని పనులు

కాలు కదపకుండా చకచకా అన్ని పనులు

శాస్త్ర సాంకేతిక రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి యంత్రాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాడు. ఈ పరిణామంలో నుంచి పుట్టిందే డ్రోన్ టెక్నాలజీ. కాలు కదపకుండా చకచకా అన్ని పనులు జరిగిపోవాలి ఈ ఆలోచనే డ్రోన్ ల ఆలోచనకు పురుడు పోసింది.

నియంత్రణలు ఉండాలి..

నియంత్రణలు ఉండాలి..

యుద్ధ రంగంలో విధ్వంసానికే కాదు, డ్రోన్లను నిత్య జీవితంలో కూడా విరివిగా వాడటం మొదలు పెట్టేశారు. ఇక సైన్స్ ఎప్పుడైనా రెండంచుల కత్తిలాంటిదే. అది డ్రోన్లకైనా, న్యూక్లియర్ ఆయుధాలకైనా వర్తిస్తుంది. అదే విధంగా డ్రోన్లతో కూడా ఎంత అపాయం పొంచి ఉందో అంతే ఉపయోగం కూడా ఉంది.

మన జాగ్రత్తలో మనం

మన జాగ్రత్తలో మనం

వీటిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో విధ్వంసానికి కూడా వాడవచ్చు. సరైన నియంత్రణలు ఉన్నప్పుడే ఇలాంటి అపాయాలను నిరోధించే అవకాశాలున్నాయి. పొరుగుదేశాలు కూడా ఇదే పద్దతి అవలంభిస్తే యుధ్దాలు రావు..ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది

ఆర్మీ స్థావరాలపై పై నిఘా

ఆర్మీ స్థావరాలపై పై నిఘా

పాకిస్తాన్ ఈ మధ్య మన దేశంలోని ఆర్మీ స్థావరాలపై పై నిఘా ఉంచినట్లు తెలిసింది. అందులో భాగంగా ఈ ఫోటోను రిలీజ్ చేసింది కూడా .

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write India turns to Israel for armed drones as Pakistan, China build fleets
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot