భారత ప్రభుత్వం నుంచి ‘కొత్త ఆపరేటింగ్ సిస్టం’
భారత్ ఆపరేటింగ్ సిస్టం సొల్యూషన్స్ (బాస్) పేరుతో సరికొత్త ఆపరేటింగ్ సిస్టంను భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ నెలలోనే OSను అధికారికంగా విడుదల చేయబోతున్నారు. వైరస్ దాడులను తట్టుకునే విధంగా శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లతో రాబోతున్న ఈ ఆపరేటింగ్ సిస్టంను సీ-డాక్ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్) వారు అభివృద్థి చేసారు.
Read More : మోటో ఎక్స్‌ప్లేలో ఉన్నవేంటి..? లేనివేంటి..?

ఇక మీదట ప్రభుత్వ అధికారిక వ్యవహారాలన్నీ ఈ ఓఎస్ ఆధారంగానే నిర్వహించనున్నారు. ఈ లైనక్స్ లైనన్స్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ప్రభుత్వ సైబర్ స్పేస్‌ను మరింత పటిష్టం చేస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబడుతోన్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం...


Click it and Unblock the Notifications








