వందేమాతరంతో హోరెత్తిన పాక్ వెబ్‌సైట్లు

Written By:

మీరు విన్నది నిజమే.. వందేమాతరం నినాదాలతో పాకిస్తాన్ వెబ్‌సైట్లు మార్మోగిపోయాయి. మరి ఎవరు ఆ నినాదాలు చేశారు అని మీరు ఆశ్చర్యపోతున్నారా.. ఆ నినాదాలు చేసింది మన ఇండియాలోని హ్యాకర్స్. పాకిస్తాన్ లో ని పలు వెబ్‌సైట్లను ఇండియాలోని కొంతమంది హ్యాకర్స్ హ్యాకింగ్ చేసి అందులో మన ఇండియా జెండాతో కూడిన వందేమాతరం నినాదాలు రాశారు. మరి ఇదంతా ఎందుకు చేశారనేగా మీ డౌటు..మీ డౌటు తీరాలంటే కథనం చదవాల్సిందే.

Read more : నేతాజీ మృతిపై గాంధీజీ గందరగోళం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో

పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతీయుల గుండె రగిలిపోతోంది. దేశం కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరులకు తమకు నచ్చిన రీతిలో నివాళులర్పిస్తున్నారు. ఆ త్యాగధనుల కుటుంబాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటువంటివారిలో హ్యాకర్లు కూడా ఉన్నారు.

పాకిస్తాన్ వెబ్ సైట్లలో శుక్రవారం వందేమాతరం అంటూ

పాకిస్తాన్ వెబ్ సైట్లలో శుక్రవారం వందేమాతరం అంటూ నినాదాలు కనిపించాయి. పాకిస్తాన్ లోని పలు ముఖ్యమైన వెబ్ సైట్లను భారతీయ హ్యాకర్లు హ్యాక్ చేశారు.

పాకిస్తాన్ కు చెందిన ముఖ్యమైన 7 వెబ్ సైట్లలోకి

పాకిస్తాన్ కు చెందిన ముఖ్యమైన 7 వెబ్ సైట్లలోకి చొరబడ్డారు. అందులో పాకిస్తాన్ బార్ కౌన్సిల్ వెబ్ సైటు, విద్య, టూరిజం వెబ్ సైట్ కూడా ఉన్నాయి. కేరళకు చెందిన హ్యాకర్లు ఇండియన్ బ్లాక్ హ్యాట్స్ పేరుతో వెబ్ సైట్లలోకి చొరబడ్డారు.

ఈ సైట్లు ఓపెన్ చేయగానే

ఈ సైట్లు ఓపెన్ చేయగానే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిని అడ్డుకుని ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను కీర్తిస్తూ నివాళుర్పించినట్లు పొందుపర్చారు. వెబ్ సైట్లలో వందేమాతరం అంటూ నినాదం కూడా పెట్టారు. భారత సైనికులను చూసి యావద్భారతం గర్విస్తోందన్నారు. జై భారత్ మాతాకీ అంటూ వెబ్ సైట్లలో ప్రకటన చేశారు కూడా.

పఠాన్ కోట్ ఉగ్రవాద దాడిలో ప్రాణ త్యాగం చేసిన

పఠాన్ కోట్ ఉగ్రవాద దాడిలో ప్రాణ త్యాగం చేసిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కు నివాళులర్పించారు. ఇండియన్ బ్లాక్ క్యాట్స్ పేరుతో ఈ హ్యాకింగ్ జరిగింది. ఈ హ్యాకింగ్ ను నిరంజన్ కుమార్తె విస్మయ కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆ వెబ్ సైట్లలో ఉన్న సమాచారం ఏదీ తీసేయలేదని

అంతేకాదు .. ఆ వెబ్ సైట్లలో ఉన్న సమాచారం ఏదీ తీసేయలేదని, కేవలం నివాళర్పించామని హ్యాకర్లు ప్రకటించారు. తాము వెబ్సైట్ల నుంచి దేనినీ తొలగించలేదని, లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్తె విస్మయ ఫొటోను మాత్రమే అప్లోడ్ చేశామని వీరిలో ఓ హ్యాకర్ ఓ పత్రికకు తెలిపారు. తమది సైబర్ యుద్ధం కాదని, పాకిస్థాన్ ప్రజలకు సందేశమని స్పష్టం చేశారు.

మన దేశం, మన ప్రజల కోసం విలువైన జీవితాలను

ఈ ఫొటో క్రింద ''పఠాన్‌కోట్ దాడిలో ప్రాణాలర్పించిన ధైర్యసాహసాలు నిండిన సైనికుల కుటుంబాలకు ఐబీహెచ్ టీమ్ తరపున గొప్ప గౌరవ వందనం సమర్పిస్తున్నాం. మన దేశం, మన ప్రజల కోసం విలువైన జీవితాలను సమర్పించిన ధైర్యవంతులైన సైనికులకు చిన్న నివాళి.

ఇది కేవలం పాకిస్తాన్ ప్రజలకు భారతీయుల తరఫున పంపించే

ఇది కేవలం పాకిస్తాన్ ప్రజలకు భారతీయుల తరఫున పంపించే సందేశమేనని అందులో వారు పేర్కొన్నారు. మేం క్షమిస్తాం. మేం మర్చిపోతాం .. మా నుంచి మరేమీ ఆశించకండి. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం, భారత మాతాకీ జై, వందేమాతరం అని రాశారు.

హ్యాకింగ్ జరిగిన వెబ్సైట్లు ...

పాకిస్థాన్ గవర్నమెంట్ హోం రీమౌంట్ డిపో మోనా, ఫోటిల్ కిచెన్ అప్లయెన్సెస్, సెంటర్ ఫర్ పాకిస్థాన్ అండ్ గల్ఫ్ స్టడీస్, సీఎస్డీ - పాకిస్థాన్ గవర్నమెంట్ కేరింగ్ స్టోర్, మస్లమ్ సన్స్, పాకిస్థాన్ బార్ కౌన్సిల్, ఎస్ఓఎల్పీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడర్న్ లాంగ్వేజెస్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write By Hacking 7 Pakistani Websites Indian Hackers Pay Unique Tribute To Pathankot Martyrs
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot