ప్రపంచాన్ని కలవరపెడుతున్న బ్రహ్మోస్‌ ఆయుధం,ఇండియా ఒక్కసారి ప్రయోగిస్తే..

బ్రహ్మోస్‌.. ఈ పేరు వింటే ఈ ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ముఖ్యంగా కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు ఈ అస్త్రం పేరు వింటే దడ పుడుతోంది.

|

బ్రహ్మోస్‌.. ఈ పేరు వింటే ఈ ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ముఖ్యంగా కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు ఈ అస్త్రం పేరు వింటే దడ పుడుతోంది. ప్రపంచ దేశాలను అంతలా కలవరపరుస్తున్న ఈ మిస్సైల్ లో ఏమున్నాయి.ఇది ఏ విధంగా ఇండియాను రక్షిస్తుంది. అసలు దీనికున్న శక్తి సామర్ధ్యాలు ఏ పాటివి..ఇది యుద్ధంలో శత్రువుల అస్త్రాలను ధ్వంసం చేస్తుందా..అనేదానిపై అందరికీ అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే బ్రహ్మోస్‌ శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో, దీని పవర్ గురించి మీకు స్పెషల్ గా అందిస్తున్నాం. ఓ లుక్కేయండి.

Read more: మరచిపోలేని ఆవిష్కరణలు మరుగునపడ్డాయి

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్..

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్..

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. దీన్ని విమానం, నౌక, సబ్‌మెరైన్ లేదా ఉపరితలం నుంచి ప్రయోగించవచ్చు. ఇది బహుళ లక్ష్యాలపై కేవలం మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగలదు.

దీన్ని శత్రుదేశాల రాడార్లు గుర్తించలేవు

దీన్ని శత్రుదేశాల రాడార్లు గుర్తించలేవు

తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల దీన్ని శత్రుదేశాల రాడార్లు గుర్తించలేవు. సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించడం వల్ల దీన్ని ఏ ప్రతిక్షిపణీ (Anti missile) ఎదుర్కోలేదు.

బ్రహ్మోస్-1 వ్యాప్తి 300 నుంచి 500 కి.మీ.లు..
 

బ్రహ్మోస్-1 వ్యాప్తి 300 నుంచి 500 కి.మీ.లు..

రష్యా సహకారంతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో తయారుచేసిన బ్రహ్మోస్-1 వ్యాప్తి 300 నుంచి 500 కి.మీ.లు, వేగం 2.8 మ్యాక్. భారత్, రష్యా దేశాల్లోని బహ్మపుత్ర, మాస్కోవా నదుల పేర్ల నుంచి 'బ్రహ్మోస్' అనే పేరును రూపొందించారు.

అమెరికా టొమహాక్ క్షిపణుల కంటే ..

అమెరికా టొమహాక్ క్షిపణుల కంటే ..

అమెరికా టొమహాక్ క్షిపణుల కంటే ఇవి ఎన్నో రెట్లు మేలైనవి. ఉపరితల, సముద్ర రకం బ్రహ్మోస్ క్షిపణులు ఇప్పటికే ఉపయోగించే స్థితిలో ఉన్నాయి. జలాంతర్గామి, వైమానిక క్షిపణి రకాలు శోధన స్థితిలో ఉన్నాయి.

సుమారు 7 మ్యాక్ వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ మార్క్-2 ..

సుమారు 7 మ్యాక్ వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ మార్క్-2 ..

సుమారు 7 మ్యాక్ వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ మార్క్-2 రకం హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. కలాం జ్ఞాపకార్థం ఈ క్షిపణిని బ్రహ్మోస్-2కె ('కె' అంటే కలాం) అని పిలవనున్నారు.

పదాతి దళాల కోసం ఉపయోగించే మొబైల్ అటానమస్ లాంచర్..

పదాతి దళాల కోసం ఉపయోగించే మొబైల్ అటానమస్ లాంచర్..

పదాతి దళాల కోసం ఉపయోగించే మొబైల్ అటానమస్ లాంచర్(ఎంఏల్ వాహనం)లో మూడు బ్రహ్మోస్ క్షిపణులు, సమాచార, రాడార్ వ్యవస్థలు అమర్చి ఉంటాయి. దీన్ని గత రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించారు.

బ్రహ్మోస్ పితామహుడు

బ్రహ్మోస్ పితామహుడు

1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం భారతీయ శాస్త్రవేత్తల ఆలోచనల్లో మార్పు తెచ్చింది. అప్పటివరకు భారత్ కేవలం దీర్ఘవ్యాప్తి, స్ట్రాటజిక్, రక్షణ, టాక్టికల్, బాలిస్టిక్ క్షిపణులపైనే దృష్టిపెట్టింది. కానీ టొమహాక్ క్రూయిజ్ క్షిపణుల సాయంతో అమెరికా ఇరాక్‌ను ఓడించడంతో భారత్ కూడా క్రూయిజ్ క్షిపణులను తయారు చేయాలని నిర్ణయించింది.

బ్రహ్మోస్ పితామహుడు

బ్రహ్మోస్ పితామహుడు

అబ్దుల్ కలాం నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి ఈ పనిని అప్పగించింది. 1995లో ఐజీఎండీపీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త శివథాను పిళ్లై ఆధ్వర్యంలో భారత్-రష్యా సంయుక్తంగా భవిష్యత్ క్షిపణి బ్రహ్మోస్ రూపకల్పన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. శివథాను పిళ్లైని 'బ్రహ్మోస్ పితామహుడిగా' పిలుస్తారు.

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ బ్లాక్-3 ..

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ బ్లాక్-3 ..

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ బ్లాక్-3 రకాన్ని 2015 మే 9న కార్ నికోబార్ ద్వీపంలో విజయవంతంగా 48వ సారి ప్రయోగించారు.

ఈ రెండు స్టేజీల బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌, రష్యాలు సంయుక్తంగా..

ఈ రెండు స్టేజీల బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌, రష్యాలు సంయుక్తంగా..

ఈ రెండు స్టేజీల బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్షిపణి 2005 నుంచి భారత నావికా దళంలో సేవందిస్తుంది. టెస్టింగ్‌లో భాగంగా బ్రహ్మోస్‌ క్షిపణి తన 49వ పరీక్షను నిర్వహించారు.

290 కి.మీ. దూరంలోని లక్షాన్ని ఛేదించగల శక్తి..

290 కి.మీ. దూరంలోని లక్షాన్ని ఛేదించగల శక్తి..

బహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. 290 కి.మీ. దూరంలోని లక్షాన్ని ఛేదించగల శక్తి దీని సొంతం.

దేశ పశ్చిమ తీరం వెంబడి

దేశ పశ్చిమ తీరం వెంబడి

దేశ పశ్చిమ తీరం వెంబడి జరిగిన నౌకాదళ డ్రిల్‌లో భాగంగా ప్రాజెక్టు 15ఎ కోల్‌కతా క్లాస్ గైడెడ్ క్షిపణి విధ్వంసక రాకెట్ల ద్వారా అంగీకార యోగ్యతా పరీక్ష కింద బ్రహ్మోస్ ను పరీక్షించిన సంగతి విదితమే.

2014 జూన్‌లో, తిరిగి 2015 ఫిబ్రవరిలో..

2014 జూన్‌లో, తిరిగి 2015 ఫిబ్రవరిలో..

2014 జూన్‌లో, తిరిగి 2015 ఫిబ్రవరిలో రెండుసార్లు విజయవంతంగా బ్రహ్మోస్‌ను పరీక్షించారు.

7,500 టన్నుల ఐఎన్‌ఎస్ కోచిని..

7,500 టన్నుల ఐఎన్‌ఎస్ కోచిని..

7,500 టన్నుల ఐఎన్‌ఎస్ కోచిని సెప్టెంబర్ 30న భారతీయ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఆ యుద్ధ నౌక 16 బ్రహ్మోస్ క్షిపణులను మోసుకు పోగలదు. నిట్టనిలువు స్థితిలో లాంచింగ్ చేస్తుంది.

భారత వైమానిక బలగాల్లో..

భారత వైమానిక బలగాల్లో..

భారత వైమానిక బలగాల్లో సు-30ఎంకెలలో మోహరించేందుకు బ్రహ్మోస్‌ మిస్సైల్‌ను ఇప్పటికే అభివృద్ధి చేయడం జరిగింది.

Best Mobiles in India

English summary
Here Write Indian Hyper sonic Missile Brahmos tested successfully from INS Kochi

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X