Home
News

భారత ప్రభుత్వం బ్లాక్ చేయమని తెలిపిన 52 చైనీస్ యాప్ లు ఇవే.....

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా చాలా రకాల యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి యాప్ లలో వినియోగదారుల డేటాను దొంగిలించే వాటిని భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు గుర్తించాయి.

Chinese App List

Chinese App List

ఈ యాప్ లను వినియోగదారులు వెంటనే ఉపయోగించడం ఆపమని ప్రజలతో పాటుగా ప్రభుత్వానికి కూడా సలహా ఇచ్చింది. ఈ ప్రమాదకరమైన యాప్స్ లలో అధికంగా 52 మన పొరుగు దేశమైన చైనాకు సంబంధించినవి కావడం మరొక విషయం. ప్రస్తుతం ఇండియా యొక్క సరిహద్దులలో జరిగిన ముఖాముఖి ఘర్షణల కారణంగా కూడా చైనా యాప్ లను వినియోగించడం వెంటనే ఆపమని ప్రభుత్వం ప్రజలను కోరింది.

టిక్‌టాక్, షేర్‌ఇట్, UC బ్రౌజర్

టిక్‌టాక్, షేర్‌ఇట్, UC బ్రౌజర్

చైనా యొక్క యాప్ లు కొన్ని పెద్ద మొత్తంలో ప్రజల యొక్క ప్రైవేట్ డేటాను సేకరిస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. ఇటువంటి యాప్ ల జాబితాలో దేశంలో చాలా మంది ప్రజలు ఉపయోగించే కొన్ని ప్రసిద్ధి చెందిన యాప్ లు ఉండడం గమనార్హం. ఈ చైనీస్ యాప్ లలో టిక్‌టాక్, షేర్‌ఇట్, UC బ్రౌజర్, జెండర్ మరియు క్లీన్ మాస్టర్ వంటివి కూడా ఉన్నాయి.

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ

ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘర్షణల కారణంగా చైనా యొక్క యాప్ ల వినియోగాన్ని నిలిపివేయాలని తెలిపిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సిఫారసులకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ మద్దతు ఇచ్చినట్లు మరియు ఇవి దేశ భద్రతకు హానికరమని భావించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన మరిన్ని సిఫారసులపై కూడా చర్చలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 52 చైనీస్ యాప్ లలో ప్రతి దానితో కలిగే నష్టాలను ఒక్కొక్కటిగా పరిశీలించాల్సి ఉంటుంది అని ప్రత్యేకంగా తెలిపారు.

హానికరమైన చైనీస్ యాప్ ల వివరాలు

హానికరమైన చైనీస్ యాప్ ల వివరాలు

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు తొలగించవలసిన చైనీస్ యాప్ ల వివరాలు వరుసగా ఈ క్రింద ఇవ్వబడ్డాయి. టిక్‌టాక్, వాల్ట్-హైడ్, విగో వీడియో, బిగో లైవ్, వీబో, వీచాట్, షేర్‌ఇట్, UC న్యూస్, UCబ్రౌజర్, బ్యూటీప్లస్, జెండర్, క్లబ్‌ఫ్యాక్టరీ, హెలో యాప్, లైక్, క్వాయ్, రోమ్‌వే, షీన్, న్యూస్‌డాగ్, ఫోటో వండర్, APUS బ్రౌజర్, VivaVideo-QU వీడియో ఇంక్, పర్ఫెక్ట్ కార్ప్, CM బ్రౌజర్ మరియు వైరస్ క్లీనర్ (హాయ్ సెక్యూరిటీ ల్యాబ్). ఈ యాప్ లను వెంటనే మీ యొక్క ఫోన్ లలో వాడుతుంటే కనుక వెంటనే డెలిట్ చేయవలసిందిగా ప్రజలను ప్రభుత్వం కోరింది.

లడాఖ్ వివాదం - బాయికాట్ చైనా ప్రోడక్ట్స్

లడాఖ్ వివాదం - బాయికాట్ చైనా ప్రోడక్ట్స్

లడాఖ్ లోని వివాదాల కారణంగా మూడు రోజుల క్రితం చైనాకు మరియు ఇండియా యొక్క జవాన్లకు మధ్య జరిగిన కాల్పులలో 20 మంది ఇండియా యొక్క జవాన్లు చనిపోయారు. వీరి యొక్క మరణానికి నిరసనగా చైనా యొక్క వస్తువులను నిషేదించవలసిందిగా ప్రభుత్వం పిలుపును ఇచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరు చైనా యొక్క వస్తువులను కొనుగోలు చేయరాదని తెలిపింది. దేశంలో చైనా పేరుతో గల రెస్టారెంట్ లను కూడా వెంటనే మూసివేయాలని ఆదేశాలను కూడా ఇచ్చింది.

చైనా ప్రోడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్స్

చైనా ప్రోడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్స్

ఇండియాలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ విభాగాలలో దూసుకుపోతున్న చైనా బ్రాండ్ల మీద కూడా బాయికాట్ చైనా నినాదం వినిపిస్తున్నది. ఇందులో భాగంగా ఈ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉన్న అమీర్ ఖాన్, దీపికా పదుకొనె వంటి స్టార్లకు కూడా వాటి నుంచి వెంటనే తప్పుకోవాలి అని ప్రభుత్వం సూచనలను ఇచ్చింది.

Best Mobiles in India

English summary
Indian Intelligence Agencies listed 52 Chinese Apps and Asked Government to Block
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X