గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

Posted By:

పసిపిల్లాడు దగ్గర నుంచి పండుముసలి వరకు ఏదడిగినా చూపించగల సామర్థ్యం సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు ఉంది. వెబ్ విహరణిలో రకరకాల సెర్చ్ ఇంజిన్‌‌లు అందుబాటులో ఉన్నప్పటికి గూగుల్‌ను మాత్రమే ఏరికోరి ఎంపిక చేసుకుంటాం. ఇందుకు కారణం గూగుల్ కనబరిచే నమ్మకమైన పనితీరే. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ల జాబితాలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న గూగుల్‌ను అధిగమించటమంటే సామన్యమైన విషయం కాదు.

Read  More: శవాలతో పరాచకాలా

అలాంటిది 10వ తరగతి పాసైన ఓ కుర్రోడు గూగుల్‌ను మించిన సెర్చ్ ఇంజిన్‌ను తయారు చేసి చూపించాడు. తాను డిజైన్ చేసిన పర్సనలైజిడ్ సెర్చ్ ఇంజిన్‌ను గూగుల్ కన్నా 47శాతం ఆక్యురేట్‌గా పనిచేస్తుందంటున్నాడు కెనడాకు చెందిన 16 సంవత్సరాలు అన్‌మోల్ టుక్రిల్. ఈ చిన్నోడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా మరి....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

కేవలం 10వ తరగతి విద్యను మాత్రమే పూర్తి చేసిన టుక్రిల్‌కు ఈ సెర్చ్ ఇంజిన్‌ను డిజైన్ చేసేందుకు కొన్ని నెలలు పాటు శ్రమించాల్సి వచ్చిందట.

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

సెర్చ్ ఇంజిన్‌కు సంబంధించిన  కోడింగ్‌ను రాసేందుకు 60 గంటల సమయం తీసుకున్నాడట.

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్ సైన్స్ ఫేర్‌లో పాల్గొనేందుకు ఈ సెర్చ్ ఇంజిన్‌ను తయారు చేసినట్లు అన్‌మోల్ తెలిపారు. వాస్తవానికి అన్‌మోల్ కెనడా పౌరుడైనప్పటికి అతని కుటుంబ మూలాలు మాత్రం భారత్‌లోనే ఉన్నాయి.

 

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

రెండు వారాల ఇంటర్న్‌షిప్ నిమిత్తం భారత్‌కు విచ్చేసిన అన్‌మోల్ ప్రస్తుతానికి బెంగళూరుకు చెందిన యాడ్‌టెక్ సంస్థ ఐస్‌క్రీమ్ ల్యాబ్స్‌లో తన ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేస్తున్నారు.

 

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

టొరంటోలోని హోలి ట్రినిటీ పాఠశాల విద్యార్థి అయిన అన్‌మోల్‌ మూడవ తరగతి నుంచే కోడింగ్ పట్ల ఆసక్తి కనబర్చే వాడట. అప్పటి నుంచి కోడింగ్ పట్ల అంతకంతకు అవగాహన పెంచుకుంటూ వచ్చిన అన్‌మోల్ గూగుల్‌ను మించిన పర్సనల్ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

తాను రూపొందించిన సెర్చ్ ఇంజిన్ను ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాతనే ఈ వివరాలను ప్రపంచం ముందుకు తీసుకువచ్చినట్లు అన్‌మోల్ తెలిపారు.

 

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

ఈ పరిశోధనా పత్రాన్ని గత నెలలోనే ఇంటర్నెషనల్ హైస్కూల్ జర్నల్ ఆఫ్ సైన్స్‌కు సమర్పించానని, తనకు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదవాలని ఉందని టుక్రిల్ తెలిపారు.

 

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

గూగుల్‌‌కు గురి పెట్టిన చిన్నోడు

ఈ పదహారేళ్ల యువ కెరటం టోకోక్యాట్ పేరుతో ఓ కంప్యూటర్ సంస్థను ప్రారంభించి ఆ సంస్థను దిగ్విజయంగా నడపటం ఓ గొప్ప విషయం.

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Indian Origin Teen Claims His Search Engine is More Accurate. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting