Home
News

రైల్వే టికెట్ల బుకింగ్‌ పై డిస్కౌంట్‌.. అయితే ఈ యాప్‌ ద్వారా మాత్రమే..!

భారతీయ రైల్వే ఇటీవల అనేక కీలక చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే బుకింగ్‌ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. దళారుల చేతికి టికెట్లు లభించకుండా కేవలం టికెట్లు అవసరం అయిన వారికే లభించేలా ఆధార్‌ కార్డు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. దీంతోపాటు ARP (అడ్వాన్స్‌ రిజర్వేషన్ పిరియడ్‌) గడువు 60 రోజులుగా ఉంది. ఈ టికెట్లకు కూడా ఈ సంవత్సరం అక్టోబర్‌ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేసింది. అయితే జనవరి నుంచి మరిన్ని మార్పులు రానున్నాయి.

అయితే రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ఇటీవల రైల్‌వన్‌ యాప్‌ ను (Railone App) తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా అన్ని రకాల టికెట్ల బుకింగ్‌, PNR స్టేటస్‌, ట్రాకింగ్‌ ఫిర్యాదులు, ఫుడ్‌ ఆర్డర్‌ కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో వీటి కోసం వేర్వేరు ప్లాట్‌ఫాంలను ఉపయోగించాల్సి వచ్చేది.

3 percent discount on tickets booking through railone app

ఈ ఆరు నెలల్లో :
అయితే డిజిటల్‌ ప్లాట్‌ఫాంలను ప్రొత్సహించేందుకు వీలుగా రైల్వే రైల్‌వన్‌ యాప్‌ ద్వారా చేసే అన్‌రిజర్వడ్‌ టికెట్ల బుకింగ్‌ పై డిస్కౌంట్‌ను అందించనుంది. ఈ డిస్కౌంట్‌ను జనవరి 14 వ తేదీ నుంచి జులై 14 వ తేదీ మధ్య వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది.

రైల్‌వన్‌ యాప్‌ ద్వారా చేసే అన్‌రిజర్వడ్‌ టికెట్ బుకింగ్‌కు మాత్రమే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందించనున్నట్లు తెలిపింది. డిజిటల్‌ బుకింగ్స్‌ను ప్రొత్సహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జనవరి 14 నుంచి జులై 14 వరకు ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఇప్పటికే అందుబాటులో ఉన్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ :
రైల్‌వన్‌ యాప్ లో ప్రస్తుతం మరో డిస్కౌంట్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. రైల్‌వన్‌ యాప్‌లో R- వాలెట్‌ ద్వారా చేసే పేమెంట్స్‌ పై ప్రస్తుతం 3 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అయితే తాజాగా రైల్వే ప్రకటించిన డిస్కౌంట్‌ ఆఫర్‌.. ప్రస్తుతం అందిస్తోన్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌కు అదనమని స్పష్టం చేసింది.

ఇటీవలే కీలక మార్పులు :
భారతీయ రైల్వే ఈ సంవత్సరం అక్టోబర్‌ 1 నుంచి అడ్వాన్సడ్‌ రిజర్వేషన్‌ పిరియడ్‌ లో భాగంగా అందుబాటులోకి వచ్చే టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసింది. అంటే ప్రస్తుతం 60 రోజుల ముందుగా రైల్వే టికెట్లను బుకింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు టికెట్ల బుకింగ్‌ ప్రారంభం అవుతుంది.

ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తొలి దశలో ఉదయం 8 గంటల నుంచి 8:15AM వరకు ఆధార్‌ వెరిఫికేషన్ కలిగిన IRCTC యాప్‌, వైబ్‌సైట్‌ యూజర్లు మాత్రమే టికెట్లు బుకింగ్‌ చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అనంతరం రెండో దశలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఆధార్‌ వెరిఫైడ్ యూజర్లకే టికెట్ల బుకింగ్‌కు అవకాశం ఇచ్చింది.

అయితే డిసెంబర్‌ 29 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆధార్‌ వెరిఫైడ్‌ యూజర్లకు మాత్రమే టికెట్లు బుకింగ్‌ చేసుకొనేందుకు అనుమతి ఇస్తోంది. అయితే జనవరి 5, 2026 నుంచి రైల్వే టికెట్ల బుకింగ్‌ ప్రారంభం అయిన తొలిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆధార్‌ వెరిఫైడ్‌ యూజర్లు మాత్రమే IRCTC యాప్‌, వెబ్‌సైట్‌లో టికెట్ల బుకింగ్‌కు అవకాశం ఉంటుంది.

అయితే జనవరి 12, 2026 నుంచి ఇందులో మరిన్ని మార్పులు రానున్నాయి. రైల్వే టికెట్ల బుకింగ్‌ ప్రారంభం అయిన తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కేవలం ఆధార్‌ వెరిఫైడ్‌ IRCTC యాప్‌, వెబ్‌సైట్‌ యూజర్లకు మాత్రమే టికెట్లు బుకింగ్‌కు అవకాశం ఉంటుందని రైల్వే స్పష్టం చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Indian railway Offers 3 percent discount on tickets booking through railone app
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X