రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

Written By:

ఇండియన్ రైల్వే ఇప్పుడు సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది .ఇంతకు ముందు ఉన్న పాత నిబంధనలకు సరికొత్త నిబంధనలను జోడించి సకల సదుపాయాలను ముందుకు తీసుకొచ్చింది. వెయిట్ లిస్ట్ ప్రయాణికులకు వేరే రైలులో ప్రయాణించే అద్భుత అవకాశాన్ని ఇండియన్ రైల్వే కల్పించింది. కొత్తగా వచ్చిన రైల్వే నిబంధనలు ఏంటో మీరే చూడండి.

Read more: రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం ఎంపిక చేసిన రూట్లలో రైల్వే శాఖ కొత్త ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్ రూట్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైల్లో గమ్యానికి చేర్చేందుకు వికల్ప్ పథకాన్ని విస్తరించింది.

వారి ఇష్టం మేరకు వేరే రైల్లో

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని వారి ఇష్టం మేరకు వేరే రైల్లో వెళ్లవచ్చు. ఈ పథకం మెయిల్ / ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో వర్తిస్తుంది. అయితే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ పథకం చెల్లుబాటుకాదు.

వికల్ప్ కింద ప్రత్యామ్యాయ వసతి

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

అయితే వికల్ప్ కింద ప్రత్యామ్యాయ వసతి కల్పించాక మీరు ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అనుమతించరు. అంతే కాకుండా చార్జీలో తేడాలున్నా మీకు ఎటువంటి రీఫండ్ ఇవ్వరు.దీనికి ఎలాంటి అదనపు చార్జీలు కూడా ఉండవు.

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి ..

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

 తత్కాల్ లో అయితే మీరు మీ ప్రయాణానికి సంబంధించి టికెట్లను రద్దు చేసుకుంటే టికెట్ లో సగం మొత్తం వెనక్కిస్తారు . ప్రస్తుతం ఇందులో అటువంటి రీఫండ్ సౌకర్యం లేదు.

బుకింగ్ వేళల్లో మార్పు

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పులు కూడా చేశారు. ఏసీ బుకింగ్ లకు ఉదయం 10 నుంచి 11 వరకు. స్లీపర్ కోచ్ టికెట్ బుకింగ్ లకు ఉదయం 11 నుంచి 12 వరకు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో కేవలం మొబైల్ టికెట్లనే అనుమతిస్తారు.

 జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి ..

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో బోగీల సంఖ్య పెంచారు. దీనివల్ల ఎక్కుమంది కన్ఫర్మ్ టికెట్స్ పొందొచ్చు.

ప్రయాణికులకు ప్రత్యామ్నాయం సువిధ

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయం సువిధ పథకం. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ మాదిరి తక్కువ స్టాప్లు ఉంటాయి. సర్వీసు రైళ్లకు ముగింపు ప్రీమియం ఉంటుంది. రైళ్లలో ప్రయాణికులకు గమ్యస్థానం వచ్చేటప్పుడు అప్రమత్తం చేసేందుకు 'వేకప్ కాల్' సౌకర్యం కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. 

లెవెల్ క్రాసింగ్ల వద్ద హెచ్చరికలు

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాల నివారణకు రైల్వే సాంకేతికత సహాయంతో హెచ్చరికలు చేసే కొత్త విధానాన్ని అవలంబించనుంది. సీసీ కెమెరాలు, రేడియో పౌనఃపున్యం ఆధారంగా పనిచేసే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చారు.

అన్ రిజర్వ్డ్ రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

అన్ రిజర్వ్డ్ రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి హ్యాండ్ హెల్డ్ టర్మినల్స్ ను ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్లాట్ ఫాం టికెట్, అన్ రిజర్వ్డ్ టికెట్, సీజన్ టికెట్లను కొనొచ్చు. రైల్వేలో ట్రాక్ మరమ్మతులకు ట్రాక్మెన్, కీమెన్ల కోసం తేలికైన టూల్ కిట్ను రైల్వే తీసుకొచ్చింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Indian Railways to change few online booking rules from July 1 Check out the list here
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting