రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

By Hazarath
|

మీరు ఎక్కడికైనా వెళ్లాలని నెల రోజుల ముందే టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే అనుకోని పరిస్థితుల్లో మీ ప్రయాణం కాన్సిల్ అయింది. అది చివరి నిమిషంలో మీ ప్రయాణం రద్దయింది. అటువంటప్పుడు మీరు మీ టికెట్ ని క్యాన్సిల్ చేసుకోలేకపోతారు. అనవసరంగా డబ్బులు పోయాయే అని బాధపడుతారు కూడా. అయితే ఇప్పుడు దానికి రాంరాం చెప్పేయండి. మీరు మీ టికెట్ ని వెంటనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

Read more: మొబైల్‌ నుంచే నేరుగా రైల్వే టికెట్లు తీసుకోవచ్చు

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

రైలు ప్రయాణీకులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అనుకోని పరిస్థుతుల్లో ప్రయాణం రద్దు అయినపుడు బుక్ చేసుకున్న టికెట్ ను క్యాన్సిల్ చేసుకునేందుకు చివరి నిమిషంలో పరుగులు తీయాల్సిన పని లేదు. గంటలతరబడి లైన్లో నిలబడాల్సిన అవసరం అలాగే ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు.

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తాజాగా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు డయల్ 139 పద్ధతిని కొత్తగా ఆవిష్కరించారు.

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..
 
రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

చివరి నిమిషంలో స్టేషన్ కు వెళ్ళి, క్యూలో నిలబడి ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా ... ప్రయాణీకులు ఫోన్ చేసి, వారి ట్రైన్ నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ వంటి వివరాలను అందిస్తే చాలు టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది.

స్టేషన్ కు వెళ్ళి, క్యూలో నిలబడి

స్టేషన్ కు వెళ్ళి, క్యూలో నిలబడి

అయితే ప్రయాణీకులు క్యాన్సిల్ చేసిన వెంటనే వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ను 'పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్' (పీఆర్ ఎస్) కౌంటర్ వద్ద సమర్పిస్తే ప్రయాణీకులు టికెట్ కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాటు చేశారు.

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

క్యాన్సిలేషన్ చార్జీలు భారీగా పడుతున్న నేపథ్యంలో ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు రైల్వే మంత్రి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైలు బయల్దేరే నాలుగు గంటల ముందు కౌంటర్ వద్దకు వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేయకపోతే భారీ జరిమానా పడే పరిస్థితికి తెరపడనుంది.

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

డయల్ 139 సదుపాయంతో అనుకున్న క్షణంలోనే కాల్ చేస్తే సరిపోతుంది. కాస్త తీరిగ్గా వెళ్ళి ఓటీపీని రిజర్వేషన్ కౌంటర్ లో ఇచ్చి డబ్బును వాపస్ తీసుకోవచ్చు.

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

139 నెంబర్ కేవలం రైల్వే కౌంటర్‌లో టికెట్ తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని రైల్వే శాఖ తెలిపింది.మరోవైపు ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసిన ప్రయాణికులు ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారానే టికెట్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది.

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

ఈ కొత్త సదుపాయంతో ఓ పక్క డబ్బు పూర్తిశాతం తిరిగి పొందడంతోపాటు ... క్యాన్సిలేషన్ ప్రక్రియ కూడ సులభం అయ్యింది. దీనికి సంబంధించిన సాప్ట్‌వేర్‌ను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు రైల్వే శాఖ అన్ని సన్నాహాలను పూర్తి చేసింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Now, cancel your train tickets by just dialing 139

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X