ఇక గూగుల్ మ్యాప్స్‌లో రైళ్ల వివరాలు

Posted By:

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ ట్రాన్సిట్ ఫీచర్ ద్వారా నెటిజనులకు మరింత చేరువైంది. ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్‌లో బస్సు, కారు రూట్లను మాత్రమే తెలుసుకోగలిగే వాళ్లం. తాజాగా ఈ ట్రాన్సిట్ ఫీచర్ పుణ్యమా అంటూ భారతీయ రైల్వే సమాచారాన్ని, ప్రయాణ వేళల్ని, రూట్ల వివరాలను తెలుసుకోగలిగే వెసలబాటును గూగుల్ కల్పించింది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ ద్వారా ఎనిమిది భారతీయ నగరాలు మీదగా వెళ్లే రైళ్లకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

 ఇక గూగుల్ మ్యాప్స్‌లో రైళ్ల వివరాలు

12,000 రైళ్లకు సబంధించిన వివరాలను గూగుల్ ట్రాన్సిట్ ఫీచర్ ద్వారా పొందవచ్చు. దీంతో పాటు అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, పూణే నగరాల నుంచి వెళ్లే బస్ అలానే మోట్రో రూట్‌లకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చిన గూగుల్ వెల్లడించింది.

 ఇక గూగుల్ మ్యాప్స్‌లో రైళ్ల వివరాలు

గూగుల్ ట్రాన్సిట్ ఫీచర్ ద్వారా మీరో ఓ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే... ముందుగా గూగుల్ మ్యాప్స్‌లో మీ గమ్యస్థానాన్ని టైప్ చేసి "Get Directions" పై క్లిక్చే సి, ఆ తరువాత "Public Transit" ఐకాన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ గమ్యస్థానానికి సంబంధించి అందుబాటులో ఉన్న బస్, ట్రెయిన్ లేదా మెట్రో రూట్‌లు కనిపిస్తాయి.

(ఇంకా చదవండి: రాత్రుళ్లు స్విచాఫ్ చేయకండి!)

English summary
Indian Railways schedules will now be available on Google Transit feature of Maps. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot