దేశంలో ఎయిర్‌టెల్‌దే రాజ్యం: పోరాడుతున్న బిఎస్ఎన్ఎల్

Written By:

దేశం మొత్తం ఇప్పుడు మొబైల్స్ తో నిండిపోయింది. అవును..నిజం. ఇప్పుడు దేశంలో ఎంత మంది దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయనే ఫిగర్ తెలిస్తే అందరూ అవాక్కు అవ్వాల్సిందే. దేశ జనాభా 130 కోట్లు అనుకుంటే మొబైల్ ఫోన్లు ఉన్నవారి సంఖ్య జూన్ చివరి నాటికి 103.5 కోట్లకు చేరింది. మే నెలలో 103.3 కోట్లగా ఉన్న మొబైల్ సబ్‌స్క్రైబర్ల (వైర్‌లెస్) సంఖ్య జూన్ చివరికి 0.19% స్వల్ప వృద్ధితో 103.5 కోట్లకు ఎగసింది. ఇదే సమయంలో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.48 కోట్ల నుంచి 2.47 కోట్లకు తగ్గిందని ట్రాయ్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశంలో మొబైల్ యూజర్లను కలిగిఉన్న టాప్ ఫైవ్ కంపెనీలపై ఓ లుక్కేయండి.

జియో ఉచిత సునామిని అడ్డుకోవాల్సిందే :టెల్కోల మూకుమ్మడి దాడి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 25.57 కోట్లకు చేరగా అందులో అత్యధికంగా 14 లక్షల మంది కొత్త యూజర్లు జతయ్యారు. ఇంకా పెరుగుతారని అంచనా.

#2

ఎయిర్‌టెల్ తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొత్త కస్టమర్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది. దీనికి 13 లక్షల మంది జతయ్యారు. దీంతో కంపెనీ మొత్తం యూజర్లు 8.95 కోట్లకు చేరారు. ఈ చర్యతో బీఎస్‌ఎన్‌ఎల్ టాప్-5 మొబైల్ సర్వీసెస్ కంపెనీల జాబితాలో ఎయిర్‌సెల్‌ను వెనక్కు నెట్టింది.

#3

ఎయిర్‌సెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కొత్తగా 6.7 లక్షలు పెరిగింది. దీంతో కంపెనీ యూజర్లు 8.89 కోట్లకు చేరారు.

#4

వొడాఫోన్‌కు యూజర్ల సంఖ్య 7 లక్షల పెరుగుదలతో 19.93 కోట్లకు ఎగసింది.

#5

ఐడియా కస్టమర్ల సంఖ్య 6.8 లక్షలు పెరిగింది. మొత్తం యూజర్లు 17.62 కోట్లకు చేరారు.

#6

ట్రాయ్ గణాంకాల ప్రకారం.. మొత్తం టెలికం కస్టమర్ల సంఖ్య (వైర్‌లెస్, వైర్‌లైన్) 105.9 కోట్లుగా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write India's Mobile User Base Touches 103.5 Crore: Telecom Regulator
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot