Home
News

టెలికం రంగంపై కాయ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ !

టెలికం రంగం రాబోయే కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటుందని అలాగే చాలా కంపెనీలు వ్యాపారాల నుంచి వైదొలుగుతాయని తెలిపారు.

By Hazarath

టెలికం రంగంపై కాయ్ డైరెక్టర్ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. టెలికం రంగం రాబోయే కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటుందని అలాగే చాలా కంపెనీలు వ్యాపారాల నుంచి వైదొలుగుతాయని తెలిపారు. చివరకు ఒకటో రెండు కంపెనీలు మాత్రమే మిగులుతాయని ఆయన అన్నారు. జియో టారిప్ ఫ్లాన్లను ప్రకటించడం టెలికం రంగానికి కాస్త ఊరటని కూడా తెలిపారు. అలాగే కంపెనీలు కోట్ల రుణభారాలను మోస్తున్నాయని అన్నారు.

ఫేస్‌బుక్ నుంచి డబ్బులు సంపాదించండి

జియో సర్వీసులకు టారిఫ్‌లను నిర్ణయించడం

జియో సర్వీసులకు టారిఫ్‌లను నిర్ణయించడం

రిలయన్స్‌ జియో సర్వీసులకు టారిఫ్‌లను నిర్ణయించడం పరిశ్రమకు మంచిదేనని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ తెలిపారు. జియో ప్రకటించిన చార్జీలు కాస్త దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. సాధ్యపడని టారిఫ్‌లు కావని చెప్పారు.

ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల రుణ భారం

ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల రుణ భారం

2016, జనవరి నాటికి పరిశ్రమలోని కంపెనీల రుణ భారం రూ.30 లక్షల కోట్లు ఉంటే.. 2017, జనవరి నాటికి రూ.40 లక్షల కోట్లకు పెరిగింది. ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల రుణ భారం పడిందని ఓ ఇంటర్యూలో చెప్పారు.

విలీనానికి ప్రాధాన్యత

విలీనానికి ప్రాధాన్యత

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌ కామ్‌)లో ఎంటీఎస్‌, ఎయిర్‌సెల్‌ విలీన కసరత్తు పూర్తికాబోతోంది. ఐడియా, వొడాఫోన్‌ల విలీన చర్చలు సాగుతున్నాయి. టెలికాం సేవల వ్యాపారం నుంచి వీడియోకాన్‌ వైదొలగింది. టాటా కమ్యూనికేషన్స్‌ కూడా వ్యాపారాన్ని విక్రయించాలని భావిస్తోంది.

ఒకటి, రెండు కంపెనీలు మాత్రమే

ఒకటి, రెండు కంపెనీలు మాత్రమే

2016, జనవరి నాటికి 12-13 టెలికాం కంపెనీలు ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య అయిదుకు పరిమితమైంది. ఇక రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో ప్రైవేటు రంగంలో ఒకటి, రెండు కంపెనీలు మాత్రమే మిగిలే అవకాశం ఉందని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ తెలిపారు

ఇంత కంటే తగ్గితే కంపెనీలకు కష్టమే

ఇంత కంటే తగ్గితే కంపెనీలకు కష్టమే

రిలయన్స్‌ జియో రావడానికి ముందు సగటున డేటా వినియోగం నెలకు (ఒక్కో చందాదారుడు) 1-2 జీబీ ఉండేదని ఉచిత డేటా కారణంగా ప్రస్తుతం ఇది 6-7 జీబీకి పెరిగిందని అన్నారు. మళ్లీ రుసుములు వసూలు చేయడం ప్రారంభిస్తే.. ఇది 3-4 జీబీకి చేరొచ్చని తెలిపారు. ప్రస్తుతం ఒక జీబీ డేటా ధర రూ.49 ఉంది. ఇంత కంటే తగ్గితే కంపెనీలకు కష్టమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Source : eenadu

More from GizBot

Best Mobiles in India

English summary
Industry relieved that Jio will start charging, says COAI read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X