ఫేస్‌బుక్ నుంచి డబ్బులు సంపాదించండి

Written By:

ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్న వీడియోల ద్వారా తగినంత మనీని సంపాదించలేని పబ్లిషర్లకు ఫేస్‌బుక్ గుడ్ న్యూస్ చెప్పింది. టీవీ చూసేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ మాదిరి ఇక ఈ వ్యాపార ప్రకటనలు ఫేస్‌బుక్ లైవ్ వీడియోలోకి కూడా రాబోతున్నాయి. లైవ్ వీడియోస్ మధ్యలో 20 సెకన్ల యాడ్స్‌ను వేయాలని ఫేస్‌బుక్ నిర్ణయించిందట. తన నెట్‌వర్క్‌పై షేర్ చేసే వీడియోస్ ద్వారా మనీ ఆర్జించాలని సోషల్ మీడియా దిగ్గజం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లు గమనించారా...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్జించిన రెవెన్యూలను

అయితే ఇలా ఆర్జించిన రెవెన్యూలను పబ్లిషర్లకు పంచబోతున్నట్టు ఫేస్‌బుక్ పేర్కొంది. రీకోడ్ రిపోర్టు ప్రకారం పబ్లిషర్స్ వీడియోల మధ్యలో యాడ్స్‌ను వేయడం కంపెనీ త్వరలోనే ప్రారంభించబోతుందని తెలుస్తోంది.

టీవీ కమర్షియల్ యాడ్స్ మాదిరే

అచ్చం టీవీ కమర్షియల్ యాడ్స్ మాదిరే ఈ యాడ్స్ కూడా ఉండబోతున్నాయని తెలిపింది. యాడ్స్ ద్వారా ఆర్జించిన రెవెన్యూలను పబ్లిషర్లు, తను పంచుకోవాలనుకుంటోందని పేర్కొంది.

మనీని ఆర్జించలేని వారికి

ఫేస్‌బుక్‌లో వీడియోలు షేర్ చేస్తూ మనీని ఆర్జించలేని వారికి ఇది ఓ గుడ్ న్యూస్ లాంటిదని రీకోడ్ రిపోర్టు చేసింది.

20 సెకండ్ల యాడ్ పూర్తిగా అయిపోయేంత వరకు

మధ్యలో వచ్చే 20 సెకండ్ల యాడ్ పూర్తిగా అయిపోయేంత వరకు లైవ్ స్ట్రీమ్ చేయడం కుదరదని రీకోడ్ రిపోర్టు పేర్కొంది.

నాలుగు నిమిషాలు లైవ్ స్ట్రీమ్

యాడ్ బ్రేక్‌కు ముందు పబ్లిషర్లు కనీసం నాలుగు నిమిషాలు లైవ్ స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రేక్, మళ్లీ లైవ్ ప్రొగ్రామ్ రన్ అయ్యేలా టెస్టింగ్ ప్రారంభించామని కంపెనీ అధికార ప్రతినిధి చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook is starting to put ads in the middle of its videos read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting