RS.7000 లోపు స్మార్ట్‌ఫోన్‌ల బరిలోకి ఇన్ఫినిక్స్ హాట్ 8

|

ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌ అనేది ట్రాన్స్షన్ హోల్డింగ్స్ యొక్క సబ్ బ్రాండ్ నుండి వచ్చిన తాజా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌. కేవలం 6,999 రూపాయల ధర వద్ద ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. రియల్‌మి C2 మరియు రెడ్‌మి 6 తరువాత ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌ 7,000 రూపాయల లోపు విభాగంలో ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P22 చిప్‌సెట్‌ను అందించే మూడవ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌
 

ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌ చౌకైన ధరలో శక్తివంతమైనది మాత్రమే కాకుండా ఈ హ్యాండ్‌సెట్ యొక్క ఇతర స్పెసిఫికేషన్ లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరాలు, మైక్రో SD కార్డ్ స్లాట్, గ్రేడియంట్ డిజైన్ మరియు వెనుక వైపు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి. ఏదేమైనా 6,999 రూపాయల ధర ట్యాగ్ తో ఇన్ఫినిక్స్ హాట్ 8 గొప్పగా ఉంది. ఈ ధరతో దీని అమ్మకాలు అక్టోబర్ 31, 2019 వరకు చెల్లుతుంది. బహుశా పండుగ సీజన్లో బలమైన అమ్మకాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్‌కు ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క తాత్కాలిక ధర 6,999 రూపాయలు. ఈ ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 2019 అక్టోబర్ 31 వరకు 6,999 రూపాయలుగా ఉంటుంది. దీని తరువాత కంపెనీ దీని యొక్క ధరను పెంచుతుందో లేక తగ్గిస్తుందో తెలియదు. ఈ స్మార్ట్‌ఫోన్ కాస్మిక్ పర్పుల్ మరియు క్వెట్జల్ సియాన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క మొదటి అమ్మకం సెప్టెంబర్ 12 న, ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.

ఆఫర్స్ వివరాలు

ఇప్పటి వరకు రెడ్‌మి 7A మరియు రియల్‌మి C2 మాత్రమే ఇండియాలో 7,000 రూపాయల లోపు స్మార్ట్‌ఫోన్‌లలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇన్ఫినిక్స్ హాట్ 8 ఈ విభాగంలో వీటికి కొత్త పోటీదారుగా మారుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో వాస్తవానికి మరే ఇతర సంస్థ 5000 mah బ్యాటరీ మరియు 4 జిబి ర్యామ్‌తో 7,000 రూపాయల దిగువన అందించడం లేదు.

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన స్పెసిఫికేషన్లను అందిస్తుంది. ఫోన్ ముందు భాగంలో 6.52-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P22 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో క్లబ్‌చేయబడి ఉంది. ఇది నిజం 6,999 రూపాయల వద్ద ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. అదనంగా మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరిని 256GB వరకు విస్తరణకు కూడా అవకాశం ఉంది.

కెమెరాలు

ఆప్టిక్స్ మరియు కెమెరాల విషయానికొస్తే ఇన్ఫినిక్స్ హాట్ 8లో మొత్తంగా నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనుకవైపు మూడు కెమెరాలు మరియు ముందువైపు ఒకటి ఉన్నాయి. వెనుక వైపున f / 1.8 ఎపర్చర్‌తో పని చేసే 13MP ప్రాథమిక షూటర్ ఉంది. అలాగే మరొక రెండు కెమెరాలు 2MP సెన్సార్‌లతో ఉన్నాయి. సెల్ఫీస్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో సింగిల్ 8MP సెల్ఫీ షూటర్‌ ఉంది. ముందు మరియు వెనుక కెమెరాలు పోర్ట్రెయిట్ మోడ్ మరియు LED ఫ్లాష్‌ను అందిస్తాయి.

కనెక్టివిటీ

స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G, VoLTE, వై-ఫై 802.11 b/g/n , బ్లూటూత్, GPS మరియు మైక్రో యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంచబడింది. ఈ స్కానర్ ఫోన్‌ను 0.3 సెకన్లలో అన్‌లాక్ చేయగలదు. చివరగా అదనపు బ్యాటరీ జీవితాన్ని అందించడానికి ఇన్ఫినిక్స్ హాట్ 8 స్మార్ట్‌ఫోన్‌ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు AI స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ మద్దతు కూడా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Infinix Hot 8 Launched in India at Rs 6,999:Here are the Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X