గొప్ప ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ద్వారా రియల్‌మి 5 & 5ప్రో సేల్స్

|

ఇండియాలో స్మార్ట్ ఫోన్ రంగంలో రోజు రోజుకి ఎక్కువ పోటీ పెరుగుతున్నది. ముక్యముగా మిడ్ రేంజ్ మొబైల్ లలో ఎక్కువ పోటీ పెరుగుతున్నది. అన్ని కంపెనీల వలె రియల్‌మి కూడా తక్కువ ధరలో అద్భుతమైన లక్షణాలు గల స్మార్ట్ ఫోన్లను ఇటీవల ఇండియాలో రిలీజ్ చేసింది. రియల్‌మి 5 ఇప్పుడు ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు మళ్లీ అమ్మకాలు మొదలు కానున్నాయి. రియల్‌మి 5 ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Realme 5 sale Start Today in India via Flipkart : Price, Mesmerizing offers and More

అంతేకాకుండా అదే ఫోన్ ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా సెప్టెంబర్ మధ్యలో అందరికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా రియల్‌మి 5 యొక్క ప్రో వెర్షన్ కూడా మొదటిసారిగా సెప్టెంబర్ 4 న అమ్మకాలు మొదలు కానున్నాయి. రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్ ధరలు, స్పెసిఫికేషన్స్, ఆఫర్లు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధర

రియల్‌మి 5 యొక్క బేస్ వేరియంట్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర 9,999 రూపాయలు. అలాగే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర 10,999 రూపాయలు. టాప్-ఎండ్ మోడల్ 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ధర 11,999 రూపాయలు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్‌లో క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ పర్పుల్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది.

ఆఫర్స్

ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న అమ్మకపు ఆఫర్ల విషయానికొస్తే రిలయన్స్ జియో 7,000 రూపాయల విలువైన ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. మొబిక్‌విక్‌తో 10 శాతం సూపర్‌కాష్‌ను కూడా పొందవచ్చు. చివరగా కొనుగోలుదారులు కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం Paytm UPI ద్వారా 2,000 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ (నానో) సిమ్ స్లాట్ లు ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా కలర్ ఓఎస్ 6.0తో రన్ అవుతుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 6.5-అంగుళాల భారీ డిస్ప్లే ఉంది. ప్యానెల్ 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత రన్ అవుతుంది. ఇది 11nm ప్రాసెస్‌లో తయారు చేయబడింది. ఈ హ్యాండ్‌సెట్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మెమొరీని 256జీబీ వరకు విస్తరించే ఎంపిక కూడా ఉంది.

కెమెరాలు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి ఫోన్ యొక్క క్వాడ్ రియర్ కెమెరాలు. ఈ సెటప్‌లో f/ 1.8 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. రెండవది 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు చివరగా మూడవది డీప్ మరియు స్థూల షాట్ల కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు వెనుక వైపు ఉన్నాయి. ఇందులో ముందు వైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. ఇది AI బ్యూటీ మోడ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000 mAh బ్యాటరీని అందిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది 4G VoLTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, a 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు మైక్రో-యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Realme 5 sale Start Today in India via Flipkart : Price, Mesmerizing offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X