డేటా స్పీడ్ విషయంలో మోసం, ట్రాయ్ దిమ్మతిరిగే వార్నింగ్

Written By:

దిగ్గజ టెల్కోలు ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ , జియోలపై టెలికం నింయత్రణ సంస్థ మండిపడింది. మీరు ఏం చేయాలన్నా దాని గురించి పూర్తిగా కస్టమర్లకు చెప్పాల్సిందేనని ట్రాయ్ టెల్కోలకు అక్షింతలు వేసింది. డేటా స్పీడ్ విషయంలో కాని అలాగే లిమిట్ విషయంలో కాని వారికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని టెల్కోలను ఆదేశించింది.

చేధించలేని మిస్టరీ : ఈ నంబర్ వాడిన వాళ్లంతా చనిపోతున్నారు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డేటా వినియోగ పరిమితిని

మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్లకు సంబంధించి డేటా వినియోగ పరిమితిని కస్టమర్లకు తప్పకుండా తెలియజేయాలని టెలికం కంపెనీలను నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది.

కనెక్షన్ స్పీడ్ ఎంతకు తగ్గుతుందన్న విషయాన్ని

అదేవిధంగా 'పరిమితి దాటిన తర్వాత (ఫెయిర్ యూసేజ్ విధానం) కనెక్షన్ స్పీడ్ ఎంతకు తగ్గుతుందన్న విషయాన్ని కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కస్టమర్ వాడే డౌన్‌లోడ్ స్థాయి

ఫెయిర్ యూసేజ్ ప్రకారం కస్టమర్ వాడే డౌన్‌లోడ్ స్థాయి దాటిన తర్వాత టెల్కోలు ఆటోమేటిగ్గా స్పీడును తగ్గించే అవకాశం ఉంది. ఈ విషయం కస్టమర్లకు అసలు తెలియదు. ఈ రూలు మార్చాలని ట్రాయ్ తేల్చి చెప్పింది.

కనీస స్పీడ్ 512 కేబీపీఎస్

ఫిక్స్‌డ్ (వైర్‌లైన్) బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీని వర్తింపజేశాక కనీస స్పీడ్ 512 కేబీపీఎస్ కంటే తగ్గకూడదని ట్రాయ్ తేల్చిచెప్పింది.

రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఈ-మెయిల్ రూపంలో

దీంతో పాటు టెల్కోలు డేటా లిమిట్ ఎంతవరకూ చేరిందనే (50%, 90%, 100%) సమాచారాన్ని కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఈ-మెయిల్ రూపంలో ఎప్పటికప్పుడు పంపాల్సిదేనని తేల్చి చెప్పింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Inform broadband users of data usage limit, speed, Trai tells telcos read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting