ఇన్ఫోసిస్ అతిపెద్ద క్యాంపస్, హైదరాబాద్‌లో

Written By:

భారతదేశపు రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, తన పోచారం క్యాంపస్‌ను వచ్చే ఫిబ్రవరి నాటికి దేశంలోనే అతిపెద్ద క్యాంపస్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ప్రస్తుతం పోచారం క్యాంపస్‌లో పని చేసే ఉద్యోగుల సంఖ్య 12,000లుగా ఉంది. ఫిబ్రవరి నాటికి 25,000 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేసే విధంగా ఇన్ఫోసిస్ విస్తరణ చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.

ఇన్ఫోసిస్ అతిపెద్ద క్యాంపస్, హైదరాబాద్‌లో

సోమవారం టీ-హబ్‌ను సందర్శించిన ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా ఆ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో భేటి అయ్యారు. ఇన్ఫోసిస్‌ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా హామి ఇచ్చారు. 

సామ్‌సంగ్ రహస్య ప్రాజెక్ట్ అదేనా..?

రూ.1250 కోట్ల పెట్టుబడలతో పోచారం క్యాంపస్ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 447 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి స్థాయి మౌళిక సదుపాయాలతో చేపుడుతోన్న ఈ నిర్మాణ పనులు మూడు దశల్లో భాగంగా 10 సంవత్సరాల్లో పూర్తవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర విషయాలు

వాస్తవానికి ఇన్ఫోసిస్‌ను స్ధాపించిన వ్యవస్థాపకుల సంఖ్య 7. అయితే ఈ సంఖ్య చాలామందికి 6గా తెలుసు. ఇన్ఫోసిస్ స్థాపనకు కృషిచేసిన 7గురు వ్యవస్థాపకుల పేర్లను క్రంది చూడొచ్చు. - ఎన్ఆర్ నారాయణ మూర్తి, - నందన్ నిల్కనీ, - ఎస్ గోపాల్ క్రిష్ణన్, - కె దినేష్, - ఎన్ఎస్ రాఘవన్, - ఎస్‌డి షిబులాల్, - అశోక్ అరోరా. ఈ ఏడుగురిలో ఒకరైన అశోక్ అరోరా 1988 వరకు ఇన్ఫోసిస్‌కు సేవలందించారు. తరువాతి క్రమంలో కంపెనీలోని తన మొత్తం షేర్లను ఇతర ప్రమోటర్లకు విక్రయించి అమెరికాకు వెళ్లిపోయారు.

ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర విషయాలు

ఇన్ఫోసిస్ తన మొదటి అంతర్జాతీయ కార్యాలయాన్ని 1987లో యూఎస్‌లోని బోస్టన్‌లో ప్రారంభించింది.

ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర విషయాలు

ఇన్ఫోసిస్ 1992లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. 1993లో ఇన్ఫోసిస్ ఐపీఓ విలువ రూ.96.

ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర విషయాలు

దేశంలో రెండువ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ మొదటి రెండు సంవత్సరాల వరకు కంప్యూటర్ లేకుండానే సేల్స్ కార్యకలాపాలను నిర్వర్తించగలిగింది.

ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర విషయాలు


ఇన్ఫోసిస్ 1992లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. 1993లో ఇన్ఫోసిస్ ఐపీఓ విలువ రూ.96.

ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర విషయాలు

1999లో ఇన్ఫోసిస్, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్స్‌లో తొలి రిజిస్టర్ కాబడిన ఇండియన్ సంస్థగా గుర్తింపుపొందింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Infosys to open largest campus in Pocharam. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot