యాపిల్ మాయ.. తెర ఒకటే, స్క్రీన్‌లు రెండు

Written By:

మీరు ఒకే తెరపై రెండు రకాల యాప్స్ చూడాలనకుంటున్నారా..యూట్యూబ్ లో సినిమా చూస్తూనే మరో పక్క అదే స్క్రీన్ పై ఫేస బుక్ లో ఛాటింగ్ చేయడం లేకుంటే ఆపీసు పని చేయడం లాంటివి చేయాలనుకుంటున్నారా..అయితే మీకోసం యాపిల్ సంస్థ సరికొత్త ట్యాబ్లెట్ ను మార్కెట్ లోకి తెచ్చింది.ఈ ట్యాబ్ తో మీరు ఒకేసారి రెండు రకాలు పనులు చేయవచ్చు. దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more :యాపిల్‌పై నెటిజన్లకు ఇంత కోపముందా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు స్క్రీన్ లు ఉంటే..

రెండు స్క్రీన్ లు ఉంటే..

చేతిలో ఒక్కటే ట్యాబ్ ..ఒక్కటే ఫోన్ వాటికి ఉండేది ఒక్కటే స్క్రీన్ ..కాని వాటిల్లో రెండు స్క్రీన్ లు ఉంటే ఒ పక్క వీడియో చూస్తూనే దానికి ఎంలాంటి ఆటంకం లేకుండా అదే స్క్రీన్ పై మరో పక్క నెట్ ఆన్ చేసుకునే అవకాశం వస్తే మొబైల్,ట్యాబ్ వర్షన్ లలో నిత్యం కొత్త ప్రయోగాలు చేస్తూ అగ్రస్థానంలో నిలిచిన యాపిల్ సంస్థ మరో కొత్త సాంకేతిక పరిజ్ఙానాన్ని ట్యాబ్ మొబైల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక అలాంటి అవసరమే ఉండదు

ఇక అలాంటి అవసరమే ఉండదు

సాధారణంగా ఒక యాప్ ద్వారా ఒక అంశాన్ని వెతుకుతూ ఉండి మధ్యలో వేరేది అవసరం ఉంటే వెంటనే తిరిగి వెనకకు వెళ్లి మరో యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక అలాంటి అవసరమే ఉండదు.

ఐఓఎస్ 09 అందుబాటులోకి

ఐఓఎస్ 09 అందుబాటులోకి

అలాంటి అవసరం లేకుండా నేరుగా ఒక ట్యాబ్ స్క్రీన్ ను రెండు భాగాలుగా చేసుకొని బహుళ కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఐఓఎస్ 09 అందుబాటులోకి తీసుకొచ్చింది.

రెండు యాప్ లను ఒకే సారి రన్ చేసుకోవచ్చు

రెండు యాప్ లను ఒకే సారి రన్ చేసుకోవచ్చు

కొత్త మోడల్ ఐఓఎస్ 09ల ద్వారా రెండు యాప్ లను ఒకే సారి రన్ చేసుకోవచ్చు. ఒక ఐపాడ్ పై ఇలాంటి వెసులుబాటు రావడం ఇదే తొలిసారి

ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2..

ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2..

అయితే ఇది కేవలం ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2 ఐపాడ్ ప్రో,ఐ పాడ్ మిని4 లో మాత్రమే సాధ్యం అవుతుంది.

దానంతట అదే రెండో యాప్ కోసం..

దానంతట అదే రెండో యాప్ కోసం..

ఉదాహరణకు ఒకసారి ట్యాబ్ ఆన్ చేసి ఏదైనా యాప్ ద్వారా ఓపుస్తకం చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో మరో అంశం కావాల్సి వస్తే అదే స్క్రీన్ పై కుడి పక్కన ఉండే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా మొత్తం స్క్రీన్ లోని మూడో వంతు భాగం దానంతట అదే రెండో యాప్ కోసం ఓపెన్ అవుతుంది.

రెండు పోగ్రాంలు ఒకే స్క్రీన్ పై..

రెండు పోగ్రాంలు ఒకే స్క్రీన్ పై..

దీంతో మనకు రెండు పోగ్రాంలు ఒకే స్క్రీన్ పై పక్కపక్కనే చూసుకుంటూ తేలికగా వేగంగా పని పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది.

ఐఓఎస్ 09 మాయ

ఐఓఎస్ 09 మాయ

దీంతో పాటు ప్రతి అంశాన్ని కూడా అదే తెరపై పెద్దగా చిన్నగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓ పక్క వీడియోలు చూస్తూనే దానికి ఏ మాత్రం భంగం కలుగకుండా మరో పక్క ఇంటర్నెట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉన్న ఈ ఐఓఎస్ 09 అమితంగా ఆకర్షించనుంది.

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో

మరొక వీడియో

మరొక వీడియో

దీనికి సంబంధించి మరొక వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iOS 9 brings a long-awaited Split-Screen multitasking feature to the iPad for the first time, letting users operate two apps simultaneously and bolstering the productivity capabilities of Apple's tablet lineup.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting