టీవీని కంప్యూటర్‌లా మార్చేసే ‘ఇంటెల్ కంప్యూట్ స్టిక్’

Posted By:

టీవీని కంప్యూటర్‌లా మార్చుకోగలిగే సరికొత్త ‘ఇంటెల్ కంప్యూట్ స్టిక్'ను ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. విండోస్ అలానే లైనక్స్ ఆపరేటింగ్ వర్షన్‌లలో ఈ కంప్యూట్ స్టిక్ లభ్యమవుతోంది. విండోస్ వర్షన్ కంప్యూట్ స్టిక్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ రూ.9,999కి విక్రయిస్తోంది. లైనక్స్ వర్షన్ ధర తెలియాల్సి ఉంది. హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌ను కలిగి ఉన్న డిస్‌ప్లే లేదా మానిటర్‌కు ఈ స్టిక్‌ను అనుసంధానించుకుని కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు.

Read More: డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

టీవీని కంప్యూటర్‌లా మార్చేసే ‘ఇంటెల్ కంప్యూట్ స్టిక్’

ఇంటెల్ ఆఫర్ చేస్తున్న విండోస్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్ సెర్చ్, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 32జీబి స్టోరేజ్, 2జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్‌లెస్ కీబోర్డ్ అలానే మౌస్‌లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

టీవీని కంప్యూటర్‌లా మార్చేసే ‘ఇంటెల్ కంప్యూట్ స్టిక్’

Read More: ఈ 15 స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే దొరుకుతాయ్!

ఇంటెల్ ఆఫర్ చేస్తున్న లైనక్స్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఉబుంటు 14.04ఆపరేటింగ్ సిస్టం, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 8జీబి స్టోరేజ్, 1జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్ లెస్ కీబోర్డ్ అలానే మౌస్ లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్ కు కనెక్ట్ చేసుకోవచ్చు.

Read More: తాత శవంతో సెల్ఫీ

ఇదే తరహా స్టిక్‌ను ‘స్ప్లెండో పీసీ-ఆన్-స్టిక్' పేరుతో ఐబాల్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ధర రూ.8,999. ఈ విండోస్ వర్షన్ స్టిక్ స్పెసిఫికేషన్‌‍లను పరిశీలించినట్లయితే..ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 32జీబి ఇన్‌బుల్ట్ మెమరీ.

English summary
Intel Compute Stick that converts your TV into a PC now available in India.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot