హార్డ్ డ్రైవ్స్ ఎఫెక్టు: ఇంటెల్ ఫలితాలు బేజారు

Posted By: Staff

హార్డ్ డ్రైవ్స్ ఎఫెక్టు: ఇంటెల్ ఫలితాలు బేజారు

 

ఛిప్ లను తయారుచేసే  'ఇంటెల్ కార్పోరేషన్' తన నాల్గవ త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించడం జరిగింది. ఐతే ఈసారి మాత్రం ఆశించినంత ఫలితాలను ఇంటెల్ అందుకోలేక పోయింది. ఇందుకు కారణం 'డిస్క్ డ్రైవ్స్' తక్కువగా ఉండడమేనని అంటున్నారు. ఇంటెల్ మాత్రం తన నాల్గవ త్రైమాసిక ఫలితాలు సుమారుగా $13.4 బిలియన్ల నుండి  $14 బిలియన్ల వరకు ఉండవచ్చునని అంచనా వేయడం జరిగింది. ఐతే ఈ అంచనాలను మాత్రం ఇంటెల్ అందుకోలేక పోయింది.

ప్రపంచంలో మైక్రో ప్రాసెసర్స్‌ని తయారు చేసే అతి పెద్ద చిఫ్ సెట్ కంపెనీ ఐన ఇంటెల్ పర్సనల్ కంప్యూటర్ సేల్స్ ఈ త్రైమాసికంలో బాగా పెరిగాయని పేర్కోంది. హార్డ్ డ్రైవ్ తక్కువగా ఉండడం వల్ల చాలా కంపెనీలు మైక్రో ప్రాసెసర్స్‌ని కోనుగోలు చేయడం తగ్గించాయని అన్నారు. ఈ తగ్గింపుతో ఇంటెల్ రెవిన్యూ ఒక్కసారిగా పడిపోయిందని అన్నారు.

ఇటీవల కాలంలో ధాయ్ లాండ్‌లో వచ్చిన వరదలు, భూకంపాలు కూడా ఇందుకు కారణంగా పేర్కోన్నారు. ఈ వరదలు, భూకంపాలు కారణంగా ధాయ్ లాండ్‌లో ఉన్న కొన్ని కంపెనీల ఉత్పత్తి నిలిచి పోవడంతో వాటి ప్రభావం హార్డ్ డ్రైవ్‌లపై పడింది. ఇది ఇలా ఉంటే రీసెర్చ్ సంస్ద 'ఐసప్లై' మాత్రం 2012వ సంవత్సరం మూడు త్రైమాసికాలలో పర్సనల్ కంప్యూటర్లు అమ్మకాలు 84.2 మిలియన్ జరగవచ్చునని అంచనా వేశాయి.

దీంతో ఇంటెల్ స్టాక్స్ ఒక్కసారిగా 3.9 శాతం తగ్గాయి. సోమవారం ట్రేడింగ్ మొదలయ్యే నాటికి ఇంటెల్ $24.04 దగ్గర మొదలైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot