ఇంటెల్ అతి పెద్ద డిజైన్ సెంటర్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో

|

అమెరికాకు చెందిన ప్రముఖ గ్లోబల్ చిప్ మేకర్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ సంస్థ కొత్తగా డిజైన్ అండ్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని హైదరాబాద్‌ నగరంలో ఎర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇంటెల్ యొక్క ఈ కొత్త ఆఫీస్ డిసెంబర్ 2 న ప్రారంభం కానున్నట్లు తెలిపింది.ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక రకాల ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటెల్ కూడా వాటి స్థానంలోకి చేరింది.

ఇంటెల్

అమెరికాకు చెందిన ఈ ఇంటెల్ సంస్థ యొక్క డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఆఫిస్ సెంటర్ మాధపూర్ యొక్క ఐటి కారిడార్‌లోని సాలార్‌పురియా నాలెడ్జ్ సిటీలో ప్రారంబిస్తున్నది. ఇందులో అత్యంత భారీ సౌకర్యాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇందులో సుమారు 1,500 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. నాలుగు అంతస్తులు గల ఈ భవనాన్ని ఇంటెల్ సంస్థ లీజుకు తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది నవంబర్‌లోనే ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివ్రుతి రాయ్ తనను కలిసి ఇంటెల్ షాపును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అని ఐటీ మంత్రి విలేఖరులకు తెలిపారు.

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ 2019: ఆఫర్స్ ఒకసారి చూసేయండిఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ 2019: ఆఫర్స్ ఒకసారి చూసేయండి

సెమీకండక్టర్ డిజైన్

ఇండియాలో 20 సంవత్సరాలు పూర్తి చేసిన ఇంటెల్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌కు చెందిన సెమీకండక్టర్ డిజైన్ స్టార్టప్ (Ineda) ఇనెడా సిస్టమ్స్‌లో కొంత భాగాన్ని సొంతం చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు 5G లతో పాటు డిజైన్ మరియు ఇంజనీరింగ్ సెంటర్ మీద దృష్టి సారించడానికి గ్రాఫిక్స్ యొక్క నైపుణ్యాల కోసం అనుభవం వున్న 100 ఇంజనీర్లను యుఎస్ ఆధారిత సంస్థల నుండి ఇనేడా సిస్టమ్ కొనుగోలు చేసినట్లు తెలిపింది.

 

Google Pay On Air feature: RS.1,000లు పొందవచ్చు ఎలాగో తెలుసుకోండి!!Google Pay On Air feature: RS.1,000లు పొందవచ్చు ఎలాగో తెలుసుకోండి!!

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్ మరియు అమెజాన్‌ల యొక్క అతి పెద్ద సెంటర్లను కలిగి ఉన్న హైదరాబాద్‌లోని మార్క్యూ పేర్ల జాబితాలో ఇప్పుడు ఇంటెల్ సంస్థ కూడా సరికొత్తగా వాటి జాబితాలో చేరింది. అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలో అతి పెద్దదైన తన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మూడు నెలల తర్వాత ఇంటెల్ సంస్థ తన డిజైన్ సెంటర్ ను ప్రారంబిస్తున్నది.

 

BSNL,Jio,Airtel,Vodafone Rs.1000ల లాంగ్ టర్మ్ ప్లాన్‌లుBSNL,Jio,Airtel,Vodafone Rs.1000ల లాంగ్ టర్మ్ ప్లాన్‌లు

వన్‌ప్లస్ R & D Center

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ సంస్థ కూడా తన అతిపెద్ద R & D కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. గత ఏడాది అమెరికాకు చెందిన సెమీకండక్టర్ మరియు టెలికమ్యూనికేషన్ పరికరాల సంస్థ క్వాల్కమ్ 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను యుఎస్ వెలుపల హైదరాబాద్‌లో స్థాపించనున్నట్లు ప్రకటించింది.

 

Mi క్రెడిట్ సర్వీసును Dec 3 న ప్రారంభిస్తున్న షియోమిMi క్రెడిట్ సర్వీసును Dec 3 న ప్రారంభిస్తున్న షియోమి

రామారావు ట్వీట్

గ్లోబల్ టెక్ లీడర్ ఇంటెల్ డిసెంబర్ 2 న హైదరాబాద్లో తమ కొత్త డిజైన్ మరియు ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఆవిష్కరించనున్నందుకు సంతోషంగా ఉంది. ఇది ఒక హై ప్రొడక్ట్ ఇన్నోవేషన్ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత పెంచుతుంది " అని తెలంగాణ సమాచార సాంకేతిక మంత్రి కెటి రామారావు ట్వీట్ ద్వారా తెలిపారు.

Best Mobiles in India

English summary
Intel's Largest Design and Engineering Center now Opens in Hyderabad on Dec 2

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X