ఈ ప్రశ్నలు ఇంకా మిస్టరీలుగానే ఉన్నాయి

Posted By:

భగత్ సింగ్ ఉరి జాతిపిత మహాత్మా గాంధీకి సంతోషం కలిగించిందా...లాల్ బహుదూర్ శాస్త్రి మరణం వెనుక రష్యా కుట్ర దాగి ఉందా..భారత న్యూక్లియర్ పితామహుడు బాబా హోమ్లిని అమెరికా సిఐఏ చంపేసిందా..తాజ్ మహల్ ఒకప్పుడు శివాలయమా ....సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక మిస్టరీ ఏమిటి..2004 సునామికి రెండవ ప్రపంచ యుద్దానికి ఉన్న సంబంధం ఏమిటీ..అశోకుడు స్థాపించిన రహస్య నగరాలలో మనం నివాసం ఉన్నామా..ఇండియా ఇప్పటికీ బ్రిటీష్ పాలనలో ఉందా..భారత ఆయుధాస్ర్తం అగ్ని ఇండియాను తప్పుదోవ పట్టించిందా..ఇలా ఎన్నో అవాక్కయ్యే వాస్తవాలు ఇప్పుడు మీ ముందుకొచ్చాయి. మిగతా కథనం స్లైడర్ లో ..

Read more: మిస్టరీకే మిస్టరీ: బెర్ముడా ట్రయాంగిల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భగత్ సింగ్ ఉరి మహాత్మా గాంధీకి నచ్చిందా..?

పోరాటయోధుడు భగత్ సింగ్ ఉరి జాతిపిత మహాత్మా గాంధీకి నచ్చిందా అంటే కొందరు ధియరిస్టులు అవుననే సమాధానమిస్తున్నారు. 

భగత్ సింగ్ ఉరి మహాత్మా గాంధీకి నచ్చిందా..?

గాంధీజి సిద్ధాంతాలకు భగత్ సిద్ధాంతాలకు అసలు పోలికే లేకపోవడంతో పాటు అహింసా మార్గంలో పోతున్న గాంధీకి హింసా మార్గం నచ్చేది కాదని అందుకే భగత్ సింగ్ ఉరి విషయంలో కొంచెం ఆనందంగా ఫీల్ అయ్యారని కొందరు సిద్ధాంతకర్తలు వాదిస్తారు.ఇందులో ఎంత మాత్రవ నిజముందో అనేది తెలియదు. అయితే భగత్ సింగ్ భావాలను గాంధీజి ఎప్పటికి అంగీకరించేవాడు కాదని ధియరిస్టులు చెబుతున్నారు.

లాల్ బహుదూర్ శాస్త్రి విషం తాగారా..?

భారత దేశ స్వాతంత్ర్య సమరయోధుడు అలాగే దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి రష్యాలో హర్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారని ప్రపంచానికి తెలుసు. 

లాల్ బహుదూర్ శాస్త్రి విషం తాగారా..?

అయితే కొందరు సిద్ధాంతకర్తలు ఆయన విషం తాగి చనిపోయేలా చేశారని వాదిస్తారు. ఆయనది హత్య కాదని కావాలనే చంపేశారని వారు వాదిస్తున్నారు. ఆయన మరణం ఇప్పుడొక మిస్టరీలా ఉంది. దీనికి సంబంధించి ఆర్టీఐలో ఒకతను డెత్ సర్టిప్ కేట్ కు దాఖలు చేయగా ఆ అభ్యర్థనను ఆర్టీఐ తిరస్కరించింది.

హోమ్లి బాబా మరణం వెనుక సీఐఏ హస్తం..?

న్యూక్లియర్ పోగ్రామ్ కి ది పాదర్ ఆప్ ఇండియా గా ఉన్న హోమ్లి బాబా 1966లో విమాన ప్రమాదంలో మరణించారు. 

హోమ్లి బాబా మరణం వెనుక సీఐఏ హస్తం..?

అయితే ధియరిస్టులు మాత్రం దీని వెనుక సీఐఏ హస్తం ఉందని బలంగా నమ్మతున్నారు. ఇండియా న్యూక్లియర్ రంగంలో దూసుకుపోతుందని భావించి సీఐఏ ఈ పని చేసిందని కొందరు వాదిస్తున్నారు.

సుభాస్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదు..?

సుభాస్ చంద్రబోస్ మరణం ఎలా జరిగిందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అందరూ సుభాస్ చంద్రబోస్ విమానప్రమాదంలో మరణించారని నమ్ముతారు. 

సుభాస్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదు

కాని ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదని 1985 వరకు బతికే ఉన్నారని గుమ్ నామి బాబా పేరుతో అప్పటిదాకా బతికే ఉన్నారని కొందరు ధియరిస్టులు వాదిస్తారు. మరికొందరు ఆయన రష్యాలో యుద్ధంలో చనిపోయారని చెబుతారు.నిజాలేమిటనేది ఎవరికీ తెలియదు.

యుఎఫ్ ఓలు ఇండియాలో ఉన్నాయా ..?

ఏలియన్స్ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై కొందరు అమెరికాలో ఉన్న ఏరియా 51 లాగే ఇండియాలో కూడా ఏరియా 51 ఉందని వాదిస్తారు. 

యుఎఫ్ ఓలు ఇండియాలో ఉన్నాయా ..?

అది హిమాలయ పర్వతాల్లో ఉందని చెబుతారు. ఇండియా చైనా సరిహద్దుల్లో యుఎఫ్ ఓలను చూశామని ఇప్పటికే సైనికులు కూడా చెబుతున్నారు. మరి నిజాలేమిటో తెలియదు.

2004 సునామికి రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధం

2004లో సునామి వచ్చి అల్లకల్లోలం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొందరు సిద్ధాంత కర్తలు దీనికి రెండవ ప్రపంచ యుద్ధానికి లింక్ ఉందని చెబుతారు. 

2004 సునామికి రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధం

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యునైటైడ్ స్టేట్స్ , న్యూజిలాండ్ సీక్రెట్ గా తీర ప్రాంతాల్లో సునామి బాంబు తయారుచేసి దానిని టెస్టింగ్ చేశారని అది సక్స్ స్ కావడంతో దాని ఎఫెక్ట్ తీరంపైన పడిందని వారు చెబుతారు. అలాగే హిందూ మహ సముద్రంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి అణు బాంబు ఒకటి ఉందని అది ఒక్కసారిగా పేలడంతో 2004లో అతి పెద్ద సునామి వచ్చిందని ధియరిస్టులు చెబుతుంటారు. ఇందులో ఏది నిజమో తెలుసుకోవాలంటే తలలు బద్దలు కొట్టుకోవాల్సిందే.

అశోకుడు స్థాపించిన రహస్య సిటీలలో మనం ఉన్నామా..?

270 బిసీలో అశోకుడు కొన్ని రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేశాడట. ఈ కథ ప్రకారం మన సమాజం 9 మంది మనుషులు అలాగే 9 పుస్తకాలతో రక్షణ వలయంగా నడుస్తోందని కొందరు ధియరిస్టులు చెబుతారు.

అశోకుడు స్థాపించిన రహస్య సిటీలలో మనం ఉన్నామా..?

ఆ బుక్స్ పేర్లు వరుసగా వార్ ఫేర్,సోషియాలజీ,కమ్యూనికేషన్, రసవాదం,మరణం, సూక్ష్మ జీవశాస్త్రం,కాంతి,గురుత్వాకర్షణ,కాస్మోలజీ మీద ఆధారపడిఉందని వారు విశ్వసిస్తారు.

తాజ్ మహల్ కాదది శివ టెంపుల్

తాజ్ మహల్ ని షాజహాన్ ఆయన ప్రియురాలు ముంతాజ్ పేరిట నిర్మించాడని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం.అయితే దీనిపై కొందరు సిద్ధాంతకర్తలు భిన్నంగా స్పందిస్తారు. 

తాజ్ మహల్ కాదది శివ టెంపుల్

అయితే మార్విన్ మిల్లర్ అనే ధియరిస్టు 300 సంవత్సరాల క్రితమే షాజహాన్ దానిని శివటెంపుల్ కోసం నిర్మించాడని ఆ తర్వాత అదే తాజ్ మహల్ అయిందని చెబుతున్నారు. దీనిని అప్పుడు తేజోమహాలయ అని కూడా పిలిచేవారని చెబుతున్నారు.

ఆడం బ్రిడ్జి హనుమాన్ నిర్మించారా..?

ఇండియా శ్రీలంకలను కలుపుతూ ఇసుకతో అలాగే గుండ్లుతో నిర్మించిన ఆడమ్స్ బ్రిడ్జిని హనుమంతుడు నిర్మించారని రామాయణం చెబుతోంది. 

ఆడం బ్రిడ్జి హనుమాన్ నిర్మించారా..?

అయితే కొంతమంది సిద్ధాంతకర్తలు మాత్రం అది అంతకు ముందే ఉన్నదని చెబుతారు. హనుమంతుడు నిర్మించక ముందు అలాంటి బ్రిడ్జి ఒకటి ఉండేదని దాని ప్రకారమే హనుమంతుడు ఈ బ్రిడ్జిని నిర్మించారని చెబుతారు.

ఇండియా ఇప్పటికీ బ్రిటీష్ కాలనీనే..

ఇండియా ఇప్పటికీ బ్రిటీష్ ఆధీనంలోనే ఉందా..అంటే అవుననే సమాధాన మిస్తున్నారు  ధియరిస్టులు..ఎందుకంటే ఎటువంటి వీసా లేకుండానే ఎలిజబెత్ భారత్ మొత్తం చుట్టేశారట.  

ఇండియా ఇప్పటికీ బ్రిటీష్ కాలనీనే..

ఇండియా 1947లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అలాగే కామన్ వెల్త్ లో కూడా భాగంగా ఉంది .అయితే క్వీన్ ఎలిజబెత్ ఎటువంటి వీసా లేకుండానే ఈ దేశాలన్నీ తిరిగింది. మన ఇండియాను సైతం 1997లో ఎటువంటి వీసా లేకుండానే సందర్శించింది.

విమానాన్ని రైట్ బ్రదర్స్ కంటే ముందే శివాకర్ బాపూజి..

విమానాన్ని మొదటగా కనుగొన్నది ఎవరు అంటే ఎవరైనా రెట్ బ్రదర్స్ గురించి చెబుతారు. కాని వారికన్నా ముందే మన ఇండియా శాస్త్రవేత్త శివాకర్ బాపూజి మనుషుల కోసం విమానాన్ని కనుగొన్నారు.

విమానాన్ని రైట్ బ్రదర్స్ కంటే ముందే శివాకర్ బాపూజి..

ఇది 1895లో కనుగొన్నారు. 1500 అడుగుల ఎత్తులో ఈ విమానం ఎగిరింది కూడా.అయితే ఇది రికార్డులకెక్కలేదు. అయితే పదే పదే బ్రిటీష్ వారి నుంచి హెచ్చరికలు రావడం అలాగే నిధులు ఆగిపోవడంతో ఈ విమానం ఆయనకు కలగానే మిగిలిపోయింది.

అగ్ని ఇండియాను తప్పుదోవ పట్టించింది

భారత దేశపు అస్త్రం అగ్ని భారత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిందని కొందరు ధియరిస్టులు చెబుతున్నారు. అగ్ని కెపాసీటీ దాదాపు 8000 అయితే అది కేవలం 5.500 కిలోమీటర్లకే పరిమితమైందని అందువల్ల అది బారత్ ని తప్పుదోవ పట్టించిందని చైనా ధియరిస్టులు వాదిస్తున్నారు. 

అగ్ని ఇండియాను తప్పుదోవ పట్టించింది

వరుసగా విజయవంతమైన అగ్ని క్షిపణులను భారత్ కేవలం 5,500 కిలోమీటర్ల దూరం మాత్రమై పైకి పంపి ఆశ్చర్యంలో మునిగితేలిపోయారని వారు అంటున్నారు. మరి నిజాలేంటనేది తెలియదు.

సంజయ్ గాంధీని కన్న తల్లే చంపిందా..?

సంజయ్ గాంధీ తెలుసు కదా..ఇందిరాగాంధీ తనయుడు..ఇతను ఓ మంచి ఫైలెట్ కూడా..ఫైలెట్ నడుపుతూ విమానప్రమాదంలో మరణించాడని ప్రపంచానికి తెలుసు.అయితే అది వాస్తవం కాదని ఇందిరాగాంధీనే తన కొడుకును చంపిందని కొందరు ధియరిస్టులు చెబుతున్నారు. సంజయ్ గాంధీ తల్లిని ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేసేవాడని అది తట్టుకోలేకే తల్లి ఈ పని చేసిందని వారు చెబుతున్నారు.మరి దీంట్లో నిజాలేంటనేది ఎవరికీ తెలియదు.

ఫిరోజ్ గాంధీ గాంధీ వంశానికి చెందినవాడేనా..?

ఫిరోజ్ గాంధీ ఈ పేరు కన్నా ఇందిరగాంధీ భర్తగా బాగా పాపులర్ అయిన వ్యక్తి ..ఈయనంటే మామ పండిట్ నెహ్రూకి చెప్పలేనంత కోపం. పార్లమెంట్ లో ఫిరోజ్ వేసే ప్రశ్నలకు నెహ్రూ బిత్తరపోయేవాడు. అయినా ఏమి అనేవాడు కాదు. అయితే అప్పుడు ఫిరోజ్ గాంధీని ఇందిరా గాంధీ ప్రేమించడం అది పండిట్ కి నచ్చకపోవడంతో ఇందిరా గాంధీ ఎక్కడ దూరమవుతుందోనని ఆ పెళ్లికి నెహ్రూ ఒప్పుకున్నారు. అయితే ఫిరోజ్ గాంధీ అసలు వేరే ఏదో ఉంది. ఈయన పార్సి మతానికి చెందినవాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Interesting Indian Conspiracy Theories You Need To Know
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot