మొబైల్ ఫోన్ వాడకానికి సంబంధించి ఆసక్తికర అపోహల ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాను అనుసరిస్తున్న చాలా మంది మదిలో పాతకుపోయిన ఈ అంశాలకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చే క్రమంలో గిజ్‌బాట్ ఆయా ప్రచారాలకు సంబంధించి విశ్లేషనాత్మక సమచారాన్ని మీకు అందిస్తోంది.(ఇంకా చదవండి: అమ్మ కోసం అరుదైన స్మార్ట్‌ఫోన్! )

పెట్రోల్ బంక్‌లో సెల్‌ఫోన్ ఉపయోగించవచ్చా..?
పెట్రోల్ బంక్‌లో సెల్‌ఫోన్ ఉపయోగించవచ్చా..?
సెల్‌ఫోన్ కారణంగా పెట్రోల్ బంక్‌లో ప్రమాదం ఏర్పడిన సంఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. చిన్న రాపిడికి సైతం పెట్రోల్ స్పందించగలదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఈ తరహా హెచ్చరికులను జారీ చేస్తుంది.

మొబైల్ ఫోన్‌లు మెదళ్లను దహించివేస్తున్నాయా..?
మొబైల్ ఫోన్‌లు మెదళ్లను దహించివేస్తున్నాయా..?
మొబైల్ ఫోన్‌లు కొంత మేర వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశ ముంది. కాబట్టి మొబైల్ ఫోన్‌ను మితంగా ఉపయోగించటం మంచిది
.

అతి మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు కారణమవుతుందా
అతి మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు కారణమవుతుందా
మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు దారితీస్తుందా అనే అంశానికి సంబంధించి బలుమైన రుజువులు ఇప్పటికి దొరకలేదు. ఈ అంశానికి సంబంధించి పరిశోధనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా సెల్‌ఫోన్‌లను అవసరం మేరకు వినియోగించుకోవటం మంచిది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలి.

సెల్‌ఫోన్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?
సెల్‌ఫోన్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?
సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులలో పెట్టుకోవటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం మగతనం పై తీవ్రంగా చూపే అవకాశముందని పలు పరిశోధనలు ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిశోధనలకు బలం చేకూర్చే రుజువులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంది.