అమ్మో..... చాలా డేంజర్ బాసూ

Written By:

ఇంటర్నెట్ వాడుతున్నారా..అయితే అదే పనిగా వాడకండి.మీరు అదే పనిగా వాడితే ఆరోగ్యానికి ప్రమాదనమని పరిశోధకులు చెబుతున్నారు. మీరు ఇంటర్నెట్ కు బానిసలుగా మారిపోతే మీ జీవితమే సర్వనాశనం అయిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. స్వాన్ సీ,మిలన్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నిరంతరాయ ఇంటర్నెట్ వాడకవం వల్ల ఎలాంటి దుష్పలితాలు వస్తాయో ఓ సారి చూద్దాం.

Read more:డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది

ఇంటర్నెట్ కు బానిసలుగా మారిన వారిలో రోగ నిరోధక శక్తి రోజు రోజుకు క్షీణిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

2. అనేక రోగాల దగ్గరకీ

మితి మీరిన ఇంటర్నెట్ వాడకంతో ఆరోగ్యానికి హనికరమంటున్నారు. చెప్పలేని రోగాలు మీ దరి చేరుతాయని చెబుతున్నారు.

3. జలుబుు, ఫ్లూ వంటి వ్యాధులు

నిరంతరాయ ఇంటర్నెట్ వాడకంతో జలుబు,ఫ్లూ వంటి రోగాల బారీన పడతున్నారు.

4. నిద్రలేమితనం

గంటల తరబడి ఇంటర్నెట్ ముందు గడుపుతూ ఉంటే నిద్రలేమితనం వస్తుంది.

5.అనారోగ్యపు అలవాట్లు దరికి

రోజూ ఇంటర్నెట్ వాడకంతో అనేక అనారోగ్యపు అలవాట్లు దరిచేరుతాయట..మద్యపానం ,ధూమపానం వంటి వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం ఉంది.

6.సర్వే ఎవరి మీద చేశారు.

18 నుంచి 100 మధ్య గత వయసువారి మీద ఈ అధ్యయనం నిర్వహించారు.

7.ఎక్కువ రోగాల బారీ

సర్వేలో దాదాపు 30 శాతం మంది జలుబు,తలనొప్పి ఫ్లూ వంటి వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారని వెల్లడయింది.

8. ఒత్తిడి

ఇక ఒక రోజు ఇంటర్నెట్ లేకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట

9. కారిస్టోల్ పై ప్రభావం

ఇలా అనేక రకాల రోగాలతో పాటు కారిస్టోల్ అనే హర్మోన్ మార్పలుకు లోనవతుందని వారు చెబుతున్నారు.

10. మొదడు పనిచేయదు

ఎప్పుడూ ఇంటర్నెట్ వాడకంతో మెదడు మొద్దుబారిపోయే అవకాశం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

11.కంటి సమస్యలు

గంటల తరబడి కంప్యూటర్ల ముందు గడిపే వారికి కంటి సమస్యలు తొందగా వస్తున్నాయని చెబుతున్నారు.

12.బాడి నొప్పులు

రోజు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల నడుం నొప్పులతో పాటు పొట్ట పెరగడం లాంటి సమస్యలు వస్తున్నాయని సర్వేలో వెల్లడయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A new study shows that when heavy Internet users go offline, they undergo withdrawal symptoms similar to those experienced by drug users.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot