నమ్మగలరా..ఇండియాలో 95 కోట్ల మందికి ఇంటర్నెట్ తెలియదు !

Written By:

ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అంటూ దూసుకుపోతున్నారు..మరోవైపు రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబాని 100 కోట్ల యూజర్లను చేరుకోవడమే లక్ష్యంగా ఉచిత ఆఫర్ల సునామిని సృష్టిస్తున్నారు. అయితే వీరి లక్ష్యానికి ఇండియా ఎంత దూరంలో ఉందో తెలిస్తే అందరూ షాక్ తినాల్సిందే. మొత్తం డిజిటల్ ద్వారానే చెల్లింపులు జరపాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపుకు దేశంలో 95 కోట్ల మంది సిద్ధంగా లేరని వాస్తవాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

స్పెసిఫికేషన్ పరంగా ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశంలో 95 కోట్ల మందికి

ప్రపంచంలో ఇంటర్నెట్ యూజర్లను కలిగిన రెండో అతిపెద్ద దేశంగా భారత్ కొనసాగుతున్నప్పటికీ దేశంలో 95 కోట్ల మందికి ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని అసోచామ్-డెలాయిట్ సంయుక్త నివేదిక పేర్కొంది.

దేశంలో ఇంటర్నెట్ డేటా ప్లాన్ ధరలు

దేశంలో ఇంటర్నెట్ డేటా ప్లాన్ ధరలు ప్రపంచ దేశాల కన్నా తక్కువగా ఉన్నాయని, స్మార్ట్ఫోన్స్ కూడా తక్కువ ధరలకు లభ్యమౌతున్నాయని అయినా కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఇంకా చాలా మందికి అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరమని తెలిపింది.

చైనా తర్వాతి రెండో స్థానంలో

ప్రస్తుతం భారత్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 35 కోట్లుగా ఉందని, చైనా తర్వాతి రెండో స్థానంలో ఇండియా కొనసాగుతోందని పేర్కొంది.

డిజిటల్ కి సంబంధించి మెళుకవలు

డిజిటల్ రంగంలో పురోగతి సాధించాలంటే స్కూళ్లు, కాలేజీల్లో డిజిటల్ కి సంబంధించి మెళుకవలు నేర్పించాలని ఆవశ్యకత ఎంతైనా ఉందని అలా అయితేనే మోడీ డిజిటల్ ఇండియా కల సాకారం అయ్యే అవకాశం ఉంటుందని రిపోర్ట్ తెలిపింది.

ఇంటర్నెట్ వైపు

ప్రజల్లో ముందుగా డిజిటల్ టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాలని అలాగే సైబర్ సెక్యూరిటీ విషయంలో మెళుకవలు నేర్పించాలని అప్పుడే వారు ఇంటర్నెట్ వైపు మళ్లే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Internet connectivity still out of reach for 950 mn Indians': Assocham-Deloitte study read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot