ప్రధాని మోడీ డిజిటల్ ఇండియాకి సవాల్

Written By:

ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాకి రానున్న కాలంలో సవాల్ పరిస్థితులు ఎదురుకానున్నాయని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 3జీ ,4జీ టెలికాం సర్వీసులు శరవేగంగా దూసుకొస్తున్నప్పటికీ వినియోగదారుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. దేశంలో 120 కోట్లకు పైగా జనాభా ఉంటే వారిలో ఇప్పటిదాకా ఇంటర్నెట్ వాడే వినియోగదారులు కేవలం 34. 3 కోట్లు మాత్రమే. 2020 నాటికి ఇది 60 కోట్లకు చేరే అవకాశం ఉందని అసోచామ్ చెబుతోంది.

రూ. 149తో జియోకి షాకిస్తున్న బిఎస్ఎన్ఎల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజిటల్ ఇండియా కోసం ఎన్నో సవాళ్లు

ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా కోసం ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని అసోచామ్ చెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలోని మెట్రో నగరాల్లో స్పెక్ట్రమ్ లభ్యత పదోవంతు మాత్రమే ఉందని అసోచామ్-డిలాయిట్ అధ్యయనం వెల్లడించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవాంతరాలు

ఫలితంగానే అధిక వేగంతో కూడి డేటా సర్వీసులు, పబ్లిక్ వైఫై అందించడంలో అవాంతరాలు ఎదురవుతున్నట్టు పేర్కొంది. దీని వల్ల డిజిటల్ ఇండియా ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.

31,000 హాట్స్పాట్స్ మాత్రమే

అసోచామ్ నివేదిక ప్రకారం .. అంతర్జాతీయంగా చూస్తే ప్రతి 150 మందికి ఒక వైఫై హాట్స్పాట్ ఉంది. ఈస్థాయికి భారత చేరుకోవాలంటే 80 లక్షలకు పైగా హాట్స్పాట్స్ అవసరం. ప్రస్తుతం 31,000 హాట్స్పాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

దేశంలోని 55 వేలకు పైగా గ్రామాల్లో

ఇప్పటికే దేశంలోని 55 వేలకు పైగా గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ లేదు. సర్వీస్ ప్రొవైడర్లకు లాభదాయకత లేకపోవడం వల్లనే పల్లెల్లో కనెక్టివిటీ సమస్య ఏర్పడుతోంది. పన్ను విధింపు, కట్టుదిట్టమైన నియంత్రణలు డిజిటల్ ఇండియాకు అవరోధాలుగా మారుతున్నాయి.

సాంకేతిక సామర్ధ్యం

సాంకేతిక సామర్ధ్యం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని తెలిపింది. దీనికి ఉదాహరణగా రీసెంగ్ గా జరిగిన కార్డుల హ్యాకింగ్ గురించి ప్రస్తావించింది. 32 లక్షల మందికి సంబంధించిన డెబిట్ కార్డు వివరాలు తస్కరణకు గురయ్యాయని, ఇలాంటి ఉదంతాలు సెక్యూరిటీ వ్యవస్థనుమరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Internet user base to almost double to 600 million by 2020: Assocham Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting