ఇంటెక్స్ నుంచి ఫిటెనెస్ బ్యాండ్

Written By:

మార్కెట్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఇంటెక్స్ తాజాగా ఓ ఫిటినెస్ బ్యాండ్ ను రిలీజ్ చేసింది. 'ఫిట్‌రిస్ట్' పేరిట నూతన ఫిట్‌నెస్ బ్యాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.999 ధరకు ఈ బ్యాండ్ వినియోగదారులకు లభిస్తోంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఫిట్‌నెస్ బ్యాండ్ల మాదిరిగానే ఫిట్‌రిస్ట్ కూడా పనిచేస్తుంది.

Read more : ఐ ఫోన్ ధరలు భారీగా తగ్గాయి

ఇంటెక్స్  నుంచి ఫిటెనెస్ బ్యాండ్

దీంతో యూజర్లు తాము నడిచిన దూరం, స్టెప్స్, క్యాలరీలు, నిద్ర వంటి వాటిని ట్రాక్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయితే దాంతో కాల్స్, మెసేజ్‌లు, మెయిల్స్‌కు చెందిన నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్లే చేసే మ్యూజిక్ ట్రాక్‌లను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఇంటెక్స్  నుంచి ఫిటెనెస్ బ్యాండ్

ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ దాదాపు 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ని ఇస్తుంది. ఈ బ్యాండ్‌లోని రిమోట్ షటర్ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. దీన్ని వాటర్ రెసిస్టెంట్, స్ల్పాష్ ప్రూఫ్ వంటి ఫీచర్లతో తీర్చిదిద్దారు. ఫిట్‌రిస్ట్ బ్యాండ్ 0.86 స్క్రీన్ సైజ్‌ను 96 x 32 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

ఇంటెక్స్  నుంచి ఫిటెనెస్ బ్యాండ్

ఆండ్రాయిడ్ 4.3 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 7 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. 21 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ డివైస్‌లో బ్లూటూత్ 4.0 టెక్నాలజీని అందిస్తున్నారు.

English summary
Here Write Intex FitRist Fitness Band Launched in India at Rs. 999
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot