గూగుల్ ఎగ్గొట్టిన పన్ను రూ. 12 వేల కోట్లు

Written By:

ప్రపంచటెక్ దిగ్గజాల్లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న గూగుల్ కూడా పన్నులు ఎగ్గొట్టడంలో తానేమి తీసిపోలేదని నిరూపించింది. ఫ్రాన్స్ ప్రభుత్వానికి దాదాపురూ. 12 వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించకపోవడంతో ఫ్రెంచి పోలీసులు గూగుల్ కార్యాలయంలో సోదాలు చేశారు. తమ ఆర్థిక వ్యవహారాలను అత్యంత సంక్లిష్టంగా మార్చుకుని ఒక దేశంలో ఆదాయాలను వేరే దేశంలో వచ్చినట్లు చూపించడం ద్వారా చాలా తక్కువ మొత్తంలోనే గూగుల్ పన్నులు కడుతోందనేది ఫ్రెంచ్ అధికారుల ఆరోపణ. యూరప్ లో గూగుల్ ప్రధాన కార్యాలయం ఐర్లండ్ నగరంలో ఉంది.

Read more : మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

గూగుల్ ఎగ్గొట్టిన పన్ను రూ. 12 వేల కోట్లు

అయితే అక్కడ కార్పోరేట్ పన్ను రేట్లు చాలా తక్కువగా ఉండటంతో గూగుల్ ఇలా చేసిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కొత్తమే కాదు. ఇంతకుముందు 2011లో కూడా గూగుల్ కార్యాలయంపై ఫ్రెంచ్ అధికారులు దాడిచేశారు. అప్పట్లో ఐర్లండ్ లోని గూగుల్ కార్యాలయానికి భారీ స్థాయిలో నిధులను బదిలీ చేశారన్న ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. అయితే గూగుల్ బ్రిటన్ కు రూ. 1286 కోట్ల రూపాయల పన్ను బకాయిలు చెల్లించేందుకు అంగీకరించడం అక్కడ అనేక విమర్శలకు తావిస్తోంది.

Read more : ఆ దేశంలో అడుగుపెడితే వీటిని మరిచిపోవాల్సిందే

గూగుల్ ఎగ్గొట్టిన పన్ను రూ. 12 వేల కోట్లు

బ్రిటన్ కంటే ఫ్రాన్స్ లోనే గూగుల్ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ కట్టకుండా అక్కడ కడుతున్నారని ఆ దేశానికి చెంది ఓ మంత్రి గత ఫిబ్రవరిలో వ్యాఖ్యానించారు. పన్ను సంగతి పక్కనబెడితే ఇప్పుడు గూగుల్ ప్రపంచాన్ని ఏలేందుకు సరికొత్త టెక్నాలజీతో దూసుకొస్తోంది. అదేంటో మీరు చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

దీని ద్వారా మనకు అవసరమైన పనులను గూగుల్ కు చెబితే అది చేసి పెడుతుంది. అంటే మీరు పని చేస్తూనే ఇంకొ పనిని పూర్తి చేయవచ్చు. ఉదాహరణకు మీరు డ్రైవింగ్ చేస్తూనే సినిమా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అది మీరు గూగుల్ కి చెబితే చాలు చేసేస్తుంది.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

గూగుల్ హోమ్ .. ఇది ఒక వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. దీంతో ఇంట్లో పలు పనులను చేయొచ్చు. అంటే వాయిస్ కమాండ్స్ ద్వారా గదిలో పాటలను ప్లే అవుతాయి. లైట్స్‌ను ఆన్ చేసుకోవచ్చు. గూగుల్ హోమ్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని పిచాయ్ తెలిపారు.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఫేస్బుక్ మెసెంజర్, వాట్సప్‌కు పోటీగా గూగుల్ ఈ మెసేజింగ్ యాప్ ను ఆవిష్కరించింది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు మీ స్నేహితుడికి ఒక ఫోటో పంపాలనుకుంటే .. దాన్ని అప్లోడ్ చేస్తే .. ఈ యాప్ దానికి సరైన కొటేషన్ ని చూపిస్తుంది. అలాగే ఇది మనకు ఏదైనా టెక్స్ కు సరిపడే వీడియో లింక్స్ ను చూపిస్తుంది.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఇది వీడియో కాలింగ్ యాప్. స్లో నెట్వర్క్ లో కూడా నాణ్యమైన వీడియో కాలింగ్ తమ ఉద్దేశమని పిచాయ్ తెలిపారు. ఇందులో నాక్ నాక్ ఫీచర్ కూడా ఉంటుందని, దీంతో కాల్ కు ఆన్సర్ చేయక ముందే అవతలి వారి లైవ్ వీడియో చూడొచ్చని పేర్కొన్నారు. ఈ సమ్మర్లోనే రెండు యాప్స్ అందుబాటులోకి తెస్తామన్నారు.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

గూగుల్ సంస్థ తన ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఇన్‌స్టాంట్ యాప్స్ అనే మరొక ఫీచర్ ను జతచేయనున్నది. ఇన్‌స్టాంట్ యాప్స్ అంటే వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్‌స్టాల్ చేసుకోకుండానే పనిచేస్తాయి. ఈ యాప్స్ స్మార్ట్ ఫోన్ కు బదులు గూగుల్ సర్వర్లలో రన్ అవుతాయి.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

దీనికి డే డ్రీమ్ అని నామకరణం చేసింది. కార్డ్ బోర్డ్ కన్నా చాలా పవర్ పుల్ గా ఇది పనిచేస్తుంది. ఎంత వేగంతో పనిచేస్తుందో మీరు చూస్తారని గూగుల్ చెబుతోంది. లుక్ కూడా దుమ్ము రేపే విధంగా ఉందని తెలుస్తోంది.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

గూగుల్ మ్యాప్ ఇప్పుడు సరికొత్త హంగులతో ముందుకు రానుందని సుందర్ పిచాయ్ తెలియజేశారు. ఇది డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఇదొక అత్యధ్బుతమైన ఫీచర్ . ఈ ఫీచర్ ని గూగుల్ నక్సస్ ఫోన్లకు ముందుగా అందుబాటులోకి తీసుకొస్తోంది.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఇది స్మార్ట్ వాచీలకు సూపర్ గా పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. స్మార్ట్ ఫోన్లు మాదిరిగానే స్మార్ట్ వాచీలకు ఈ వర్సన్ అందుబాలుటోకి తీసుకొచ్చినట్లు గూగుల్ చెబుతోంది.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తూనే ఇంకో పనిచేయవచ్చు. అంటే మల్టీ టాస్కింగ్ యాప్. ఉదాహరణకు మీరు గూగుల్ లో ఏదైనా విషయం శోధిస్తూ మీ ప్రెండ్స్ తో వాట్సప్ లో చాట్ చేయవచ్చు.

షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఇదే కాకుండా మొబైల్ సాప్ట్ వేర్ కి సంబంధించి కొత్త అప్ డేట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్లన్నింటినీ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన సంస్థ వార్షిక డెవలపర్ సమావేశంలో సుందర్ పిచాయ్ ఆవిష్కరించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Investigators raid Google Paris HQ in tax evasion inquiry
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot