మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

By Hazarath
|

సాప్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్ అలవాటు లేని మొబైల్స్ రంగంలోకి ప్రవేశించి చతికిలపడింది. ఓ వైపు ప్రత్యర్థుల నుండి తీవ్రమైన పోటీ మరోవైపు లూమియా విండోస్ ఫోన్ల వ్యూహాలు బెడిసికొట్టడంతో చేతులెత్తేసింది. ఇక మా వల్ల కాదని మొబైల్స్ రంగానికి స్వస్తీ చెప్పింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎలానో మీరే చూడండి.

Read more : ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మొబైల్ ఫోన్ల తయారీలో పేరెన్నికగన్న ఫిన్ ల్యాండ్ కంపెనీ నోకియాను కొనుగోలు చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది.

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

నోకియా స్మార్ట్ ఫోన్ వెర్షన్లు లూమియా, ఆ తర్వాత విండోస్ ఫోన్ల వ్యూహాలు దెబ్బతిన్న నేపథ్యంలో అలవాటు లేని వ్యాపారాల నుంచి తప్పుకునేందుకే మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి
 
మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

దీంతో రెండేళ్ల క్రితం నోకియా నుంచి 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ ప్రయోగానికి స్వస్తి పలకనుంది. తాజాగా కంపెనీ దాదాపు 1,850 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

సంస్థ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న 1,850 మంది ఉద్యోగులు ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. వీరిలో నోకియా నుంచి తమ కంపెనీలో చేరిన ఉద్యోగులే 1,350 మంది ఉన్నట్లు సమాచారం.

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

అంటే నోకియా ఉద్యోగుల్లో చాలావరకూ ఇక మైక్రోసాఫ్ట్లో పనిచేయరు. నోకియాను కొనుగోలు చేసినపుడు దాని 25 వేల మంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ తీసుకుంది. తాజాగా తొలగిస్తున్న వారిలో 1,350 మంది ఫిన్లాండ్కి చెందిన వారైతే .. మిగిలిన వారు వివిధ దేశాల్లో పనిచేస్తున్నవారు ఉంటారని అంచనా.

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

స్మార్ట్ఫోన్ల డిజైన్, తయారీకి దూరంగా ఉంటామని సాఫ్ట్ వేర్ పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామని మైక్రోసాఫ్ట్ కు ఫిన్లాండ్లో చీఫ్ షాప్ స్టివార్డ్ గా వ్యవహరిస్తున్న కల్లే కీలి చెప్పారు.

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

ఎక్కడైతే మేం ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నామో .. ఆ విభాగంపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తాం' అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా తెలిపారు. అంటే కంపెనీ విండోస్ -10 మొబైల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి, క్లౌడ్ సేవలకు ఇక ప్రాధాన్యమివ్వనుంది.

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్ : 1350 మంది ఇంటికి

మైక్రోసాఫ్ట్ ఇటీవలే నోకియా ఫీచర్ ఫోన్ల హక్కులను హెచ్ఎండీ గ్లోబల్కు, ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మొబైల్ కు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్, ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థలు నోకియా బ్రాండ్ మొబైళ్లను, ట్యాబ్లెట్స్ ను సంయుక్తంగా తయారుచేసి విక్రయిస్తాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Microsoft wasted at least 8 billion on its failed Nokia experiment

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X