హైదరాబాద్‌లో రూ. 1500 కోట్లతో గూగుల్ కొత్త క్యాంపస్

Written By:

అమెరికా నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ రెండోసారి ఆ దేశంలో పర్యటించనున్న వేళ పలు కంపెనీలు ఇండియాలో భారీ పెట్టుబడులతో విస్తరణ,అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాయి. తమ కంపెనీల వృద్ధికి భారత మార్కెట్ అత్యంత కీలకమని ఈ కంపెనీలు భావిస్తుండటమే ఇందుకు కారణం.సిస్కో,గూగుల్ వంటి టాప్ కంపెనీలు ఇండియాలో మరింతగా తమ పెట్టుబడులను విస్తరించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పై కన్నేసిన టాప్ 8 కంపెనీలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : 18 సంవత్సరాల గూగుల్ చరిత్ర ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్

రూ. 1500 కోట్ల వ్యయంతో గూగుల్ తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ ను నిర్మించనుంది. అమెరికా తర్వాత గుగూల్ నిర్వహిస్తున్న సెంటర్లలో ఇదే అతి పెద్దది అవుతుందని గూగుల్ స్వయంగా వెల్లడించింది.

సిస్కో

ఈ సంవత్సరంలో సుమారు రూ. 1300 కోట్లను పెట్టుబడిగా పెట్టిన సిస్కో భారతీయులను మరింత టెక్ నైపుణ్యవంతులుగా చేసేలా శిక్షణా కార్యక్రమాల విస్తరణకు రూ. 360 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది.

మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్

ఇండియాలో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రూ. 1400 కోట్లను పెట్టుబడుల రూపంలో పెట్టాలని ప్రణాళికలు రచించింది.

ఉబెర్ టెక్నాలజీస్

క్యాబ్ ఆధారిత టాక్సీ సేవలందిస్తున్న ఉబెర్ ఇప్పటికే 18 నగరాల్లో సేవలందిస్తుండగా మరిన్ని నగరాలు,పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు రూ. 6500 కోట్లను కేటాయించింది. వచ్చే ఐదేళ్లలో తన అంతర్జాతీయ కార్యాలయాన్ని ఇండియాలో రూ. 310 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

జనరల్ మోటార్స్

ఇండియాలో కార్లను తయారుచేసె ఎగుమతులు చేస్తే ఎక్కువ మార్జిన్లు పొందవచ్చని భావిస్తున్న జనరల్ మోటార్స్ ఇండియాలో రూ. 6400 కోట్లతో ప్లాంటును నిర్మించాలని ప్లాన్ వేసింది.ఈ ప్లాంటులో 12 వేల మందికి ఉపాధి కూడా లభిస్తుంది.

హిల్లియార్డ్ ఎనర్జీ

సౌర పవన విద్యుత్ సేవలందిస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 500 మెగావాట్ల సౌర,150 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టనుంది. ఇందుకోసం రూ.3800 కోట్లను పెట్టుబడుల రూపంలో పెట్టనుంది.

జాన్సన్ అండ్ జాన్సన్

బేబికేర్ ఉత్పత్తుల అగ్రగామిగా ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ రూ. 4 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇండియాలోనే అతి పెద్ద తయారీకేంద్రాన్ని తెలంగాణాలో నిర్మించనుంది. సుమారు 48 ఎకరాల్లో నిర్మించే ఈ ప్లాంటు వచ్చే సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని 1500 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తారని సంస్థ చెబుతోంది.

మార్స్

స్నిక్కర్స్ ,గెలాక్సీ వంటి బ్రాండ్ల పేరుతో చాక్లెట్లను విక్రయిస్తున్న మార్స్ సంస్థ పుణెలో రూ.960 కోట్ల వ్యయంతో ప్లాంటును పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఇండియన్స్ కు చేరువైన పలు రకాల చాక్లెట్లను ఇక్కడే తయారుచేసి అందిస్తామని చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Investment intentions of US companies in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot