మంచం మీద పేలిన ఐఫోన్,

Written By:

యాపిల్ కొత్త ఐఫోన్ నుంచి మంటలు వ్యాపించిన సంఘటన అమెరికాలో కలకలం రేపింది. అట్లాంటాలోని డేవిడ్ గ్రిమ్‌స్లీ అనే వ్యక్తి ఇంట్లో ఐఫోన్ 6 ప్లస్ ఫైర్ అయ్యిందని స్థానిక న్యూస్ ఛానల్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

మంచం మీద పేలిన ఐఫోన్,

డేవిడ్‌కు రాత్రుళ్లు ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవటం అలవాటు. ఎప్పటిలానే ఆ రోజు రాత్రి కూడా ఫోన్‌ను తన పక్కన పెట్టుకుని నిద్ర పోతున్నాడు. మధ్య రాత్రిలో ఆకస్మాత్తుగా మెళకువ వచ్చి చూసేసరికి తన ఐఫోన్ మంటల్లో చిక్కుకుని ఉంది.

వెంటనే ఆ ఫోన్‌ను మంచం మీద నుంచి క్రిందకు విసిరేయటంతో పెను ప్రమాదమే తప్పింది.  డేవిడ్ చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పై స్పందించిన యాపిల్ యాజమాన్యం డేవిడ్‌కు కొత్త ఐఫోన్ 6 ప్లస్‌ను పంపి కూల్ చేసే ప్రయత్నం చేసింది.

2016లో హెచ్‌పీ స్మార్ట్‌ఫోన్

ఇటీవల కాలంలో  స్మార్ట్‌ఫోన్‌లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. మొబైల్ ఫోన్‌లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీనే ప్రధాన కారణం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇటువంటి ప్రమాదాల నుంచి తమ ఫోన్‌లను కాపాడుకునేందుకు ముఖ్యమైన సూచనలు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

నకిలీ మొబైల్ చార్జర్‌లను వాడొద్దు.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్ ను తొలగించండి.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచొద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 6 Plus catches fire in man’s bed. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot