ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ఐఫోన్ స్మగ్లర్లు

Posted By:

ఇండియన్ మార్కెట్లో యాపిల్ కొత్త ఐఫోన్‌ల విడుదలకు రంగం సిద్దమవుతోన్న నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. 182 కొత్త ఐఫోన్ యూనిట్‌లను భారత్‌లోకి అక్రమంగా తీసుకువస్తోన్న 7గురు స్మగ్లర్లను ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఈ ఏడుగురు 20 ఏళ్లలోపు వారు కావటం విశేషం. వీరంతా హాంకాంగ్ నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Read More : ఫ్లిప్‌కార్ట్‌కు రూ.20 లక్షల బురిడి, సూత్రదారి హైదరాబాద్ వ్యక్తే!

అక్రమ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాలకు హాంకాంగ్ క్రేంద్రబిందువుగా ఉన్న తెలిసిందే. ఇంటిలెజెన్స్ అధికారులిచ్చిన సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు అప్రమత్తమై ఈ స్మగ్లింగ్ దందా గుట్టురట్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read More : Google.comను రూ.785కు కొనేసాడు..!

ఇకపోతే, యాపిల్ కొత్త ఐఫోన్ లైన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ లు అక్టోబర్ 16న ఇండియన్ మార్కెట్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ముందస్తు బుకింగ్స్ సైతం ప్రారంభమయ్యాయి. మార్కెట్లో వీటి ధరలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

టెక్స్టింగ్ లేదా ఎడిటింగ్ చేస్తున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే ఫోన్‌ను ఒక్క సారి షేక్ చేయండి. అండూ ఆప్షన్ మీ స్ర్కీన్ పై ప్రత్యేక్షమవుతుంది.

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

మీ ఐఫోన్ వేగంగా చార్జ్ అవ్వాలంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి ఫోన్‌ను చార్జ్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

‘రీడ్ మై ఈమెయిల్' అనే మ్యాజిక్ పదాలను మీ ఐఫోన్‌లోని సిరి యాప్‌కు చెప్పండి. అంతే, మీ అన్ని మెయిల్స్‌ను సిరి బెగ్గరగా చదివి వినిపిస్తుంది.

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

మీ మీదగా ఏఏ విమానాలు ప్రయాణిస్తున్నాయో ఐఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

పదాలను ఏలా సంభోదించాలో సిరి యాప్‌కు నేర్పించవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

టైమర్ సహాయంతో మీ ఐఫోన్‌లోని మ్యూజిక్‌ను ఆటోమెటిక్‌గా ఆఫ్ చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్‌లో వీడియోలను కావల్సినంత వేగంతో చూడొచ్చు..

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్ వాల్యుమ్ బటన్ల సహాయంతో ఫోటోలను తీసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్ ద్వారా ఒకే సారి రెండు ఫోటోలను తీుసుకోవచ్చు. స్పేస్ బార్‌ను డబల్ ట్యాప్ చేయటం ద్వారా కొత్త వాక్యాన్ని ప్రారంభించవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లలోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లో క్యాలెండర్‌ను మరింత వివరణాత్మకంగా చూడొచ్చు. మీ యాపిల్ ఐఫోన్‌లో కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను సెట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iphone 6s Smugglers Caught at IgI Airport in New Delhi. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting