లేటెస్ట్ షాక్ : ఫోన్ బ్యాటరీలో వందకు పైగా విషవాయువులు

Written By:

మీరు స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారా..అందులో లిధియం బ్యాటరీలు ఉన్నాయా..అయితే మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. తాజా పరిశోధనల్లో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీల్లో 100కు పైగా విష వాయువులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ విష వాయువులతో మనిషికి చాలా ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు.

జియోకి క్లీన్ చిట్ : టెల్కోలకి దిమ్మతిరిగింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వందకుపైగా విష వాయువులు

అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్‌బీసీ డిఫెన్స్‌, చైనాలోని సింఘువ యూనివర్సిటీ తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లో స్మార్ట్‌పోన్ల బ్యాటరీలు వందకుపైగా విష వాయువులను వెదజల్లుతున్నాయని తేలింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్యాబ్లెట్‌లాంటి పరికరాల్లో

ఒక్క ఫోన్లే కాకుండా ట్యాబ్లెట్‌లాంటి పరికరాల్లో వాడే బ్యాట‌రీల్లోనూ ఈ విష‌వాయువులు ఉన్నట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు. ఇవి ప్రాణాంతకమైన విషవాయువులని హెచ్చ‌రిస్తున్నారు.

వాటిల్లో కార్బన్‌ మోనాక్సైడ్

ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే బ్యాటరీల్లో ముఖ్యంగా లిథియమ్‌ బ్యాటరీలు వందకు పైగా విషవాయువులను వెదజల్లుతున్నాయని త‌మ అధ్య‌య‌నంలో స్ప‌ష్ట‌మైంద‌ని వారు చెప్పారు. వాటిల్లో కార్బన్‌ మోనాక్సైడ్ ఉందని పేర్కొన్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పూర్తిగా ఛార్జ్‌ చేసిన బ్యాటరీల నుంచి

50 శాతం ఛార్జ్‌ చేసిన బ్యాటరీ కంటే, పూర్తిగా ఛార్జ్‌ చేసిన బ్యాటరీల నుంచి ఈ విషవాయువులు ఎక్కువ‌గా విడుద‌ల అవుతున్నాయ‌ని వారు పేర్కొన్నారు.

చర్మ వ్యాధులు, కళ్లు, శ్వాస సంబంధ రుగ్మతలు

దీని ప్ర‌భావంతో చర్మ వ్యాధులు, కళ్లు, శ్వాస సంబంధ రుగ్మతలు వ‌స్తాయ‌ని వారు హెచ్చరించారు. మొబైల్‌ ఫోన్ల నుంచి వాహనాల వరకూ లిథియం అయాన్‌ బ్యాటరీలను వినియోగించడమే దీనికి కార‌ణ‌మ‌ని చెప్పారు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండు బిలియన్ల వినియోగదారులు

ప్రతి సంవ‌త్స‌రం ఈ బ్యాట‌రీల‌ను రెండు బిలియన్ల వినియోగదారులు ఉప‌యోగిస్తున్నార‌ని చెప్పారు. తమ ప‌రిశోధ‌న‌ రానున్న కాలంలో మెరుగైన బ్యాటరీల త‌యారీకి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lithium-ion batteries in smartphones emit more than 100 toxic gases, say researchers read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot