గూగుల్ కారుకు ఫైన్ తంటాలు

By Hazarath
|

అమెరికాలో వాహనాలు అతి వేగంగా వెళ్లడమే కాదు.. అతి నెమ్మదిగా వెళ్లినా నేరంగానే పరిగణిస్తారు. సిలికాన్‌వ్యాలీలో ఐటీ సెక్టార్‌లో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించాల్సి ఉండగా.. ఓ చిన్న కారు గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. వెనుక వచ్చే వాహనాలకు ఇబ్బంది కలుగుతుండటాన్ని గమనించిన ఓ పోలీసు వెంటనే బైక్‌పై దూసుకువచ్చి.. ఫైన్ కట్టాలని కారు ఆపాడు.

Read more: గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

కానీ, కారులో ఎవరూ లేరు. ఇదేమిటీ..? అని ఆశ్చర్యపోయేలోపే ప్రఖ్యాత గూగుల్ సంస్థ ఉద్యోగులు వచ్చి.. ఇది డ్రైవర్ లేకుండా నడిచే కారు అని వివరించారు. ప్రయోగాత్మకంగా వీధుల్లో తిప్పుతున్నామని, ఇందుకు అనుమతి కూడా ఉందని వెల్లడించారు. డ్రైవర్ లేకుండా నడిచే కార్లు రోడ్డు భద్రత దృష్ట్యా ఎంత తక్కువ వేగంతో ప్రయాణించినా.. శిక్షార్హం కాదని పోలీసులు తెలిపారు.

Read more: పదేళ్ల రహస్యాన్ని చేధించిన గూగుల్ మ్యాప్

ఈ సంఘటనను గూగుల్ సంస్థ తన సామాజిక మీడియా వేదిక అయిన గూగుల్ ప్లస్‌లో పోస్ట్ చేసింది. అతి నెమ్మదిగా నడుస్తున్నావ్..? అంటూ పోలీస్ కారులోకి తొంగి చూస్తున్న ఫొటోను కూడా జతచేసింది. ఈ సందర్భంగా గూగుల్ కారుకు ఇంతకుముందు జరిగిన ప్రమాదాలను చూద్దాం.

డ్రైవర్ లేకుండా నడిచే కార్లను పెద్ద ఎత్తున

డ్రైవర్ లేకుండా నడిచే కార్లను పెద్ద ఎత్తున

మాములుగా అసహజ మరణాల్లో రోడ్డు ప్రమాదాలే అగ్రభాగాన నిలుస్తున్న సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా డ్రైవర్లే కారణం అని గూగుల్ చెబుతోంది. అందుకే డ్రైవర్ లేకుండా నడిచే కార్లను పెద్ద ఎత్తున తయారు చేయడానికి ఈ సాంకేతిక దిగ్జజం గూగుల్ సిద్దపడిన విషయం తెలిసిందే.

డ్రైవర్ లేని కార్లు 2020 నాటికి విస్తృత వాడకంలోకి

డ్రైవర్ లేని కార్లు 2020 నాటికి విస్తృత వాడకంలోకి

గూగుల్ ప్రయోగాత్మకంగా నడుపుతున్న డ్రైవర్ లేని కార్లు 2020 నాటికి విస్తృత వాడకంలోకి రాగలవని భావిస్తున్నారు.అయితే ఇప్పటిదాకా గూగుల్ ఆన్ లైన్ లో వేసిన పోస్టింగ్ లో ఆరు సంవత్సరాల క్రితం రోడ్లపైన ప్రవేశ పెట్టిన డ్రైవర్ లు లేని తమ కార్లు ఇంతవరకు కేవలం 11 స్వల్ప ప్రమాదాలకు మాత్రమే గురయ్యాయని పేర్కొన్నారు.

ప్రమాదాలు జరిగే సమయంలో కూడా

ప్రమాదాలు జరిగే సమయంలో కూడా

ఎవరికీ గాయాలు కుడా కాని ఈ ప్రమాదాలకు మానవ సంబంధమైన పొరపాట్లే అని తెలిపింది. ప్రమాదాలు జరిగే సమయంలో కూడా డ్రైవర్ లేని కార్లల్లో గల సాఫ్ట్ వేర్, సెన్సర్లు సమస్యలను తక్షణమే పరిగణలోకి తీసుకొనే డ్రైవర్ లు ఉండే వాహనాల్లో కన్నా వేగంగా నివారణ చర్యలు తీసుకుంటున్నామని గూగుల్ డ్రైవర్ లేని కార్ల ప్రోగ్రాం డైరెక్టర్ క్రిస్ ఉర్మ్సన్ తెలిపారు.

లైట్ వేయడంకోసం ఆగినప్పుడు ఎవరినో గుద్దుకోవచ్చని..

లైట్ వేయడంకోసం ఆగినప్పుడు ఎవరినో గుద్దుకోవచ్చని..

కొన్ని సార్లు వేగం, దూరం గురించి వాస్తవాలను పరిగణలోకి తెసుకోలేక పోతామని, కేవలం లైట్ వేయడంకోసం ఆగినప్పుడు ఎవరినో గుద్దుకోవచ్చని అన్నారు. అన్ని రకాల ప్రమాదాలను నివారించాలని కోరుకొంటున్నా సొంతంగా డ్రైవ్ చేసే సమయాలల్లో కొన్ని సార్లు పొరపాట్లు అనివార్యం అవుతాయని ఆయన చెప్పారు.

గూగుల్ కార్లకు జరిగిన ఏడు ప్రమాదాలల్లో

గూగుల్ కార్లకు జరిగిన ఏడు ప్రమాదాలల్లో

గూగుల్ కార్లకు జరిగిన ఏడు ప్రమాదాలల్లో రెండు వెనుక భాగంలో, రెండు ప్రక్కనుండి రాసుకు వెళ్ళినవి, స్టాప్ సైన్ దాటి వెళ్ళిన కారుతో డీకొనడం మరొకటి. మరో ఎనిమిది ప్రమాదాలు నగరంలోని రోడ్లపై జరిగినవి.

17 లక్షల మైళ్ళు తిరగగా 10 లక్షల మైళ్ళకు 6.5 చొప్పున ప్రమాదాలు

17 లక్షల మైళ్ళు తిరగగా 10 లక్షల మైళ్ళకు 6.5 చొప్పున ప్రమాదాలు

గూగుల్ కార్లు సొంతంగా నడిపిన వాటితో సహా 17 లక్షల మైళ్ళు తిరగగా 10 లక్షల మైళ్ళకు 6.5 చొప్పున ప్రమాదాలు జరిగాయి. డ్రైవర్ లేని కార్ల సాంకేతిక పరిజ్ఞానం కోసం గూగుల్ విశేషంగా పెట్టుబడి పెడుతున్నది.

తన కార్ ను మార్కెట్ లోకి తీసుకు రావడానికి

తన కార్ ను మార్కెట్ లోకి తీసుకు రావడానికి

ఉబెర్ వంటి ఇతర టెక్ కంపెనీలతో, సాంప్రదాయ కార్ల ఉత్పత్తి దారులతో పోటీ పడుతూ తన కార్ ను మార్కెట్ లోకి తీసుకు రావడానికి సిద్దపడుతున్నది. 2020 నాటికి సాధారణ ఉపయోగానికి ఈ కార్లు సిద్దం కాగలవని చెబుతున్నారు.

తన కార్ ను మార్కెట్ లోకి తీసుకు రావడానికి

తన కార్ ను మార్కెట్ లోకి తీసుకు రావడానికి

ఉబెర్ వంటి ఇతర టెక్ కంపెనీలతో, సాంప్రదాయ కార్ల ఉత్పత్తి దారులతో పోటీ పడుతూ తన కార్ ను మార్కెట్ లోకి తీసుకు రావడానికి సిద్దపడుతున్నది. 2020 నాటికి సాధారణ ఉపయోగానికి ఈ కార్లు సిద్దం కాగలవని చెబుతున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Police pull over Google's driverless car for driving too slowly

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X