మిరుమిట్లుగొలిపే ఫీచర్లతో ఐఫోన్ 7..

By Hazarath
|

ఆపిల్ నుంచి ఐ ఫోన్ త్వరలో జిగేల్మంటూ దర్శనమివ్వబోతోంది. ఇప్పటిదాకా వచ్చిన వాటికి భిన్నంగా ఆపిల్ ఐ ఫోన్ 7ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్‌లో ఎవరూ ఊహించని ఫీచర్స్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. డ్యూయెల్ లెన్స్ కెమెరాతో ఈ అతిత్వరలో మార్కెట్లో కనువిందు చేయనుందని సమాచారం. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఐఫోన్ 7 ఫీచర్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

Read more : గూగుల్ నుంచి ఆదాయం పొందడమెలా..?

ఫోన్ 7 పేరుతో కొత్త మోడల్ని

ఫోన్ 7 పేరుతో కొత్త మోడల్ని

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్ మోడళ్లతో వినియోగదారుల మదిని దోచుకున్న యాపిల్, మరో సరికొత్త డిజైన్తో మొబైల్ రంగ విఫణిలోకి రాబోతుంది. ఐఫోన్ 7 పేరుతో కొత్త మోడల్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

అద్భుతమైన కెమెరా ఫీచర్‌తో

అద్భుతమైన కెమెరా ఫీచర్‌తో

అద్భుతమైన కెమెరా ఫీచర్‌తో యాపిల్ 2014 లో ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని అనంతరం అదే డిజైన్‌తో మరిన్ని ఫీచర్స్‌ను కలుపుకొని ఐఫోన్ 6 ఎస్‌ను గత ఏడాది (2015) లో విడుదల చేశారు.

జానీ ఈవ్స్ టీమ్ ఈ మోడళ్ల రూపకల్పనలో
 

జానీ ఈవ్స్ టీమ్ ఈ మోడళ్ల రూపకల్పనలో

జానీ ఈవ్స్ టీమ్ ఈ మోడళ్ల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే .. కెమెరా లెన్స్‌లో కొన్ని లోపాలున్నట్టు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయి.

వినియోగదారులకు ఆమోదయోగ్యమైన రీతిలో ఐఫోన్ 7 ను

వినియోగదారులకు ఆమోదయోగ్యమైన రీతిలో ఐఫోన్ 7 ను

ఈ ఫిర్యాదులతో 6, 6 ఎస్ లోపాలను సరిచేసుకుని, వినియోగదారులకు ఆమోదయోగ్యమైన రీతిలో ఐఫోన్ 7 ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు యాపిల్ తెలిపింది.

డ్యూయల్ లెన్స్ కెమెరాతో ఐఫోన్ 7 ను

డ్యూయల్ లెన్స్ కెమెరాతో ఐఫోన్ 7 ను

5.5 అంగుళం, డ్యూయల్ లెన్స్ కెమెరాతో ఐఫోన్ 7 ను రూపొందించనున్నారు. అదేవిధంగా, ప్రస్తుతమున్న వైట్ ప్లాస్టిక్ బ్యాండ్లను కూడా తొలగించనున్నట్టు మార్కెట్లో రూమర్స్ వస్తున్నాయి.

ఈ కొత్త మోడళ్లలో వేరే రకం మెటల్‌ను

ఈ కొత్త మోడళ్లలో వేరే రకం మెటల్‌ను

6, 6 ఎస్ మోడళ్లలో వాడిన మెటల్ కూడా రేడియో సిగ్నల్స్‌కు ఆటంకం కలుగజేస్తుండడంతో, ఈ కొత్త మోడళ్లలో వేరే రకం మెటల్‌ను వాడాలని యాపిల్ భావిస్తోంది.

అల్యూమినియం, గ్లాస్తో కప్పేసిన ఈ మోడళ్లకి

అల్యూమినియం, గ్లాస్తో కప్పేసిన ఈ మోడళ్లకి

అల్యూమినియం, గ్లాస్తో కప్పేసిన ఈ మోడళ్లకి తెలుపు రంగు వాటి రూపును నాశనం చేస్తుందని వినియోగదారులు నుంచి అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఈ లోపాలన్నింటినీ సరిచేసుకుని ఐఫోన్ 7 ను రూపొందించనున్నట్టు యాపిల్ తెలిపింది.

సెప్టెంబర్ తర్వాతనే సరికొత్త ఐఫోన్ 7

సెప్టెంబర్ తర్వాతనే సరికొత్త ఐఫోన్ 7

సెప్టెంబర్ తర్వాతనే సరికొత్త ఐఫోన్ 7 మార్కెట్లోకి వస్తుందని సంకేతాలు వస్తున్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, 3.5 ఎమ్ఎమ్ హెడ్ఫోన్, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్‌తో ఐఫోన్ 7 వినియోగదారుల ముందుకు రాబోతున్నది.

ఐఫోన్ 6 గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్

ఐఫోన్ 6 గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్

అయితే ఇది ఎప్పడు రిలీజవుతుందో అనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఐ ఫోన్ 6 గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయింది కాబట్టి ఇది కూడా సెప్టెంబర్‌లో రిలీజయ్య అవకాశం ఉంది.

రానున్న ఐ ఫోన్ 7 ధర సుమారుగా

రానున్న ఐ ఫోన్ 7 ధర సుమారుగా

రానున్న ఐ ఫోన్ 7 ధర సుమారుగా 539 డాలర్ల నుంచి 699 డాలర్ల వరకు ఉండే అవకాశం ఉంది. సో ఐ ఫోన్ ప్రేమికులు ఇప్పటినుంచే రెడీ అవ్వండి మరి.

Best Mobiles in India

English summary
Here Write iPhone 7 release date, specs, price and rumours

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X