అదిరే డిస్కౌంట్, ఐఫోన్ 7 రూ. 39,999కే !

Written By:

ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ 10 సేల్' రెండో రోజులో భాగంగా తన ప్లాట్ ఫామ్ పై అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్, టాబ్లెట్స్ కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా బ్రాండెడ్ ఫోన్లు ఐఫోన్ 7, 7ప్లస్, గూగుల్ ఫిక్సల్ ఫోన్లపై భారీ తగ్గింపునందిస్తోంది. తగ్గింపు వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఇదే..షియోమిని రికార్డుల వైపు నడిపిస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7 ప్లస్

ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(32జీబీ) స్మార్ట్ ఫోన్ ధరను 72,000 రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గించింది.

128జీబీ వెర్షన్ ఐఫోన్ 7 ప్లస్

128జీబీ వెర్షన్ ఐఫోన్ 7 ప్లస్ ను కొనాలనుకుంటే, దాని ధరను కూడా 19 శాతం తగ్గించింది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ ధర 82,000రూపాయల నుంచి 65,999రూపాయలకు దిగొచ్చింది.

ఐఫోన్ 7

మరో స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 7పై కూడా 27 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ 32 జిబి వర్షన్ రూ. 39,999కే లభిస్తోంది.

ఐఫోన్ 7 128 జిబి వర్షన్

ఐఫోన్ 7 128 జిబి వర్షన్ 50,999 రూపాయలకు, 256 జిబి వర్షన్ 61,999 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్ లో అందిస్తోంది.

గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్

మొబైల్ కేటగిరీలోనే గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్ ధర కూడా 13వేల రూపాయల తగ్గి, రూ.53,999కు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ కు చెందిన మరో మోడల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై 19-22 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

రెడ్ మి నోట్ ఫ్లాష్ సేల్

రెడ్ మి నోట్ ఫ్లాష్ సేల్ నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.

ప్యానసోనిక్ 109సీఎం

టెలివిజన్ కేటగిరీలో ప్యానసోనిక్ 109సీఎం ఫుల్ హెచ్డీపై అతిపెద్ద డీల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దీని ధర 49,900 రూపాయల నుంచి 27,999 రూపాయలకు తగ్గించింది.

ఎల్జీ 108 సీఎం

అదేవిధంగా ఎల్జీ 108 సీఎం ఫుడ్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర కూడా 14,901 రూపాయలు తగ్గించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 7 sells for Rs 39,999, Google Pixel for Rs 43,000 in crazy deals at Flipkart Read more At gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot