ఈ డ్రైవ్‌ మీ చేతిలో ఉంటే ఐ ఫోన్‌లో మెమొరీ లేదనే బెంగ తీరినట్లే

Written By:

మీ చేతిలో అత్యధ్భుతమైన ఐ ఫోన్ ఉంది.దాంతో మీరు అదిరిపోయే ఫోటోలను తీసుకోవాలనుకున్నారు. కాని మీరు అప్పటికే మీ ఐ ఫోన్ మొత్తాన్ని ఫోటోలతో నింపేసారు.. అయితే అటువంటి సంధర్భంలో మీరు చాలా బాధపడుతుంటారు ఫోన్‌లో మెమొరీ లేదని..అయితే ఇప్పుడు ఆ బెంగ లేకుండా కొత్త ఫ్లాష్ డ్రైవ్‌తో సాన్ డిస్క్ ముందుకొచ్చింది. మీ ఫోటోలను డైరెక్ట్ గా అందులో సేవ్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం.

Read more: సిలికాన్ వ్యాలీ సముద్రంలో కలిసిపోనుందా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఐ ఫోన్ల్‌లోని పరిమిత ఇంటర్నల్ మెమొరీ ఇబ్బందులకు చెక్ పట్టే సరికొత్త ఫ్లాష్ డ్రైవ్‌‌ను సాన్ డిస్క్ సంస్థ ఇపుడు అందుబాటులోకి తెచ్చింది. దాని పేరే ఐ ఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్.

2

దీని ద్వారా, ఫోటోలను, వీడియోలు నేరుగా ఈ ఫ్లాష్డ్రైవ్లోకే వెళ్లేలా ఐ ఎక్స్‌పాండ్ యాప్ తో సెట్ చేసుకోవచ్చు.కేబుల్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్తో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

3

అంతేకాదు .. ఈ ఫ్లాష్ డ్రైవ్‌లో ఎన్క్రిప్షన్ సాఫ్ట్ వేర్ కూడా ఉంటుంది. దీంతో ఐఫోన్లో ఉన్నట్లే డాటా పూర్తి భద్రంగా ఉంటుందని సాన్ డిస్క్ చెబుతోంది.

4

పాస్ వర్డ్ భద్రతతో పాటు, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ వెబ్‌సైట్లలో డైరెక్టుగా షేర్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం 16 జీబీ .. 32 జీబీ .. 64 జీబీ .. 128 జీబీ సామర్థ్యంతో ఈ ఫ్లాష్డ్రైవ్లు మార్కెట్లోకి వచ్చాయి.

5

ఐపాడ్ మినీ, ఐ పాడ్ ఎయిర్ 1, ఎయిర్ 2, ప్రోలతో పాటు ఐఫోన్ 5 తరువాత మోడళ్లు, ఫిప్త్ జనరేషన్ ఐ పాడ్ లాంటి దాదాపు 15 మోడళ్లకు ఈ సాన్ డిస్క్ ను అనుసంధానం చేసుకోవచ్చు.

6

బెస్ట్ బై.కామ్, అమెజాన్, సాన్ డిస్క్.కామ్ ద్వారా ఈ సరికొత్త ఫ్లాష్ డ్రైవ్ అందుబాటులో ఉంది. కావాలనుకున్న వారు వెంటనే కొనుగోలు చేయవచ్చు.

7

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write iPhone running low on memory? SanDisk's iXpand Flash Drive is here to help
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot