సెల్‌ఫోన్ మాట్లాడితే వెన్నుపూసలు గోవిందా

Written By:

ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్‌ మన శరీర భాగాల్లో ఒకటిగా మారి పోయింది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ ఉండాల్సిందే. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇది ఓ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే ఇది అవసరాల వరకు ఉపయోగిస్తే పెద్ద సమస్యేమి ఉండదు. మనం చర్చించుకోవల్సిన అవసరం అంతకంటే లేదు. కాని ఈ సెల్‌ఫోన్‌ని ఇరవై నాలుగ్గంటలూ వదలకుండా వాడే వారు ఉన్నారు. మీరు కూడా సెల్‌ ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నారా? మెడకు, భుజానికి మధ్య ఫోన్‌ పెట్టేసి మెడను ఓ పక్కకి వంచుతూ ఫోన్లు మాట్లాడుతున్నారా? అయితే ప్రమాదమే అంటున్నారు పరిశో ధకులు. బైక్‌ నడుపుతూ, ఇంట్లో పనులు చేసుకుంటూ ఫోన్లు మాట్లాడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది.సో సెల్ ఫోన్ ఎలా మాట్లాడాలో కొన్ని టిప్స్ చెబుతున్నారు సైంటిస్టులు వాటిని చూద్దాం. 

Read more :మీ సెల్‌ఫోన్ మిమ్మల్ని చంపేస్తోందని మీకు తెలుసా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తలను వంచి గంటల పాటు సెల్‌ఫోన్‌ మాట్లాడే వారికి సమస్యలు

తలను వంచి గంటల పాటు సెల్‌ఫోన్‌ మాట్లాడే వారికి సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

వెన్నుపూసలపై 18 కేజీల బరువు

సాధారణంగా ప్రతి వ్యక్తి తల 4.5 నుంచి 5.5 కేజీల బరువు తూగుతుంది. మొబైల్‌ ఫోన్‌ను చేతుల్లో పట్టుకుని తలను 30 డిగ్రీల కోణంలో పక్కకి వంచడం వల్ల మెడభాగంలోని వెన్నుపూసలపై 18 కేజీల బరువు పడుతుందని పరిశోధ కులు పేర్కొన్నారు.

వెన్నుపూసలపై 22 కేజీల బరువు

అదే తలను 45 డిగ్రీల కోణంలో వంచితే వెన్నుపూసలపై 22 కేజీల బరువు పడుతుందట.

తలను ఎంత వంచితే అంత ఎక్కువ బరువు

తలను ఎంత వంచితే అంత ఎక్కువ బరువు మెడపై పడుతుందని, దీని వల్ల వెన్నుపూసలు అరిగిపోతాయని పరిశోధనలో వెల్లడైంది.

చేతులకు మంచి సపోర్ట్‌ లభించేలా ..

స్మార్ట్‌ ఫోన్‌ కానీ, టచ్‌ స్క్రీన్‌లు ఉపయోగించే సమయంలో కానీ చేతులకు మంచి సపోర్ట్‌ లభించేలా టేబుల్‌ వంటి ఎత్తైన బల్లకు ఆనించి, తల, మొబైల్‌ సరిగి ఉండేలా చూసుకుని ఫోన్‌ మాట్లాడితేనే వెన్నుపూస అరుగుదలను నివారించవచ్చునని పరిశోధనలో తేలింది.

వెంటనే జాగ్రత్తపడండి.

మరి మీరు కూడా మీ సెల్‌ఫోన్‌తో ఎలా మాట్లాడుతున్నారో ఓసారి పరిశీలించుకోండి. తలను వంచి సెల్‌ఫోన్‌ మాట్లాడుతుంటే మీకూ ప్రమాదం పొంచి ఉంది. వెంటనే జాగ్రత్తపడండి.

ఇక డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడే వారికి ప్రమాదం ఇంకా ఎక్కువట

ఇక డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడే వారికి ప్రమాదం ఇంకా ఎక్కువట

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Is Your Cell Phone Killing Your Back
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot