విమానం కూలిపోలేదు బాంబుతో పేల్చారు

Posted By:

రష్యా విమానం సాంకేతిక లోపంతో కూలిపోయిందని రష్యా అధికారులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అది సాంకేతిక లోపం కాదని దాన్ని బాంబులతో పేల్చారని బ్రిటన్ ,అమెరికా అధికారులు తేల్చి చెప్పడంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ కు గురయింది. ఓచిన్న తీవ్రవాద సంస్థగా పుట్టుకొచ్చిన ఐసిస్‌ విమానాలను కూల్చేస్థాయికి ఉగ్రవాదాన్ని విస్తరించిందా...? విమానాలను కూల్చివేసే ఆయుధ సంపత్తి ఐసిస్ వద్ద ఉందా...! సాంకేతిక కారణాల వల్లే విమానం కూలిపోయిందని రష్యా, ఈజిప్టు ఎందుకు చెబుతున్నాయి...! మానవ ప్రమేయం లేదన్నప్పుడు తామే బాధ్యులమని ఐసిస్ ఎందుకు చెబుతోంది... విమాన ప్రమాదం వెనుక ఇలాంటి ఎన్నో ప్రశ్నలు...కాని లోతులకెళ్లే కొద్దీ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..

Read more:రష్యా ఉగ్రరూపం: ప్రపంచాన్ని కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో..

ఇటీవల రష్యాకు చెందిన విమానం కూలిపోయిన ఘటనలో 224 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో జరిగిన ప్రమాదంలో కూలిపోయి ఉండొచ్చని భావించారు

అది బాంబుదాడితో కూలిపోయిందని..

అయితే విమానాన్ని మేమే కూల్చేశామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఓ వీడియోను అంతర్జాలంలో ఉంచినప్పటికీ దీనిని అధికారులు ధ్రువీకరించలేదు. అయితే విమానం కూలిపోయిన ఘటన ప్రమాదం కాదనీ, అది బాంబుదాడితో కూలిపోయిందని అమెరికా, బ్రిటన్ భద్రతా విభాగానికి చెందిన అధికారులు బుధవారం ప్రకటించారు.

ఇది బాంబుదాడిలో కూలిపోయినట్లు నిర్థారణ అవుతున్నా..

ఈజిప్టులోని సినాయ్ పెనున్స్లా వద్ద జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయనీ, ఇది బాంబుదాడిలో కూలిపోయినట్లు నిర్థారణ అవుతున్నా ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారో స్పష్టంగా తెలియడం లేదన్నారు.

బ్లాక్ బాక్స్ కొంతవరకు ధ్వంసం కావడంతో ..

దీనికి సంబంధించిన మరింత విచారణ జరగాల్సి ఉందని అమెరికా, బ్రిటన్ భద్రతా విభాగానికి చెందిన అధికారులు ప్రకటించారు.విమాన ప్రమాదంలో సమాచారాన్ని సేకరించడానికి అత్యంత కీలకంగా భావించే బ్లాక్ బాక్స్ కొంతవరకు ధ్వంసం కావడంతో దీని నుండి సమాచారాన్ని సేకరించడం క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై రష్యా దాడులు ..

గత కొంత కాలంగా ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై రష్యా దాడులు జరుపుతుండడంతో దానికి ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉగ్రవాదులు రష్యా విమానం కూలుతున్నప్పటి దృశ్యాలతో..

మొన్న విమానం కనిపించకుండా పోయిన వెంటనే ఉగ్రవాదులు రష్యా విమానం కూలుతున్నప్పటి దృశ్యాలతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. రష్యా విమానం కూలుతుండగా ఆఖరి క్షణాల్లో తీసిన వీడియో ఇదని ఆ సంస్థ పేర్కొన్న విషయం విదితమే.

తమ వాదనను వ్యతిరేకిస్తున్నవారికి సవాల్

అయితే ఈజిప్ట్‌లోని సినాయి ద్వీపకల్పంలో రష్యా విమానం కూలిపోవడానికి తామే కారణమని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ పునరుద్ఘాటించింది. దీనికి ఎలాంటి కొత్త ఆధారాలు బయటపెట్టకపోయినా.. కూల్చింది తాము కాదని రుజువు చేయాలని తమవాదనను వ్యతిరేకిస్తున్నవారికి సవాలు విసిరింది.

విమాన ప్రమాద ఘటనలో ఉగ్రవాద లింకు లేదని..

ఈ వాదనను ఇటు ఈజిప్టు, అటు రష్యా కొట్టిపారేస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనలో ఉగ్రవాద లింకు లేదని స్పష్టం చేశాయి. అయితే, ఆ విమానాన్ని తామే కూల్చామని చెప్తూ.. ఆధారంగా కూలుతున్న దృశ్యాలతో ఓ వీడియో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ విడుదల చేసింది. క్షిపణితో తామే విమానాన్ని కూల్చేశామని ప్రకటించింది.

విమానంలోని మొత్తం 224మంది ప్రాణాలు..

ఈ ఘటనలో విమానంలోని మొత్తం 224మంది ప్రాణాలు కోల్పోయారు. . ఈజిప్టులో కూలిన విమాన ప్రయాణికులకు సంబంధించిన ఫొటోలు హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ విమానంలో ప్రయాణించిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఐసిస్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు ..

సిరియా ప్రభుత్వానికి మద్దతుగా ఆదేశంలో మిలటరీ ఆపరేషన్ కొనసాగిస్తోంది రష్యా. ముఖ్యంగా ఐసిస్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తూ మిలిటెంట్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రతి దాడులు తప్పవంటూ హెచ్చరించిన ఐసిస్... రష్యా విమానాన్ని టార్గెట్ చేసుకొని ప్రతీకారం తీర్చుకున్నట్లుగా చెబుతోంది.

ఈజిప్టులో విమానం బయలుదేరిన ప్రాంతం సిరియా సరిహద్దుల్లోనే ..

ప్లైట్‌లో ప్రయాణిస్తున్న వారందరూ రష్యన్లే కావడం... విమానం కూలిపోయిన ప్రాంతంలో ఐసిస్ ప్రాభల్యం అధికంగా ఉండటంతో ఉగ్రవాద చర్యపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈజిప్టులో విమానం బయలుదేరిన ప్రాంతం సిరియా సరిహద్దుల్లోనే ఉంటుంది. ఇక్కడి కొండ ప్రాంతాల్లో ఐసిస్ రెండేళ్లుగా పాతుకుపోయింది. స్థానిక ప్రజలను, సైనికులను కూడా పొట్టన పెట్టుకుంది.సిరియాలో రష్యా చేస్తున్న వైమానిక దాడులు ఐసిస్ ఉనికికే ప్రమాదకరంగా మారాయి.

దీంతో సిరియా - ఈజిప్టు సరిహద్దుల నుంచి రష్యాపై దాడికి ఐసిస్ కుట్ర ..

దీంతో సిరియా - ఈజిప్టు సరిహద్దుల నుంచి రష్యాపై దాడికి ఐసిస్ కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులంతా చనిపోయారు...దేవుడికి ధన్యవాదాలు... సినాయ్‌లో రష్యా విమానం కూలిన తర్వాత ఐసిస్ అనుబంధం సంస్థ పేరుతో వెలువడిన ప్రకటన ఇది. ఐసిస్ ఉగ్రవాదులకు అధికారిక న్యూస్ ఏజెన్సీగా వ్యవహరిస్తోన్న అమాక్ సంస్థ వెబ్‌సైట్‌లోనూ రష్యా విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించారు.

ఎక్కడో ఇరాక్, సిరియాలో పట్టున్న ఐసిస్ తమనేం చేస్తుందిలే అనుకుంటున్న దేశాలు..

విమాన ప్రమాదాలు కొత్త కాదు.. వందల సంఖ్యలో ప్రయాణికులు మరణించిన ఘటనలు చరిత్రలో ఎన్నో. కానీ సినాయ్‌లో రష్యా విమానం కుప్పకూలడం మాత్రం భిన్నమైంది. ప్రమాదం వెనుక ఉగ్రవాదులు ఉన్నారన్న వార్తలు రష్యా సహా ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేశాయి. ఎక్కడో ఇరాక్, సిరియాలో పట్టున్న ఐసిస్...తమనేం చేస్తుందిలే అనుకుంటున్న దేశాలు కూడా మిలిటెంట్ అటాక్‌తో అలర్ట్ అయ్యారు. విమానాలను కూల్చేసే స్థాయికి ఐసిస్ ఎలా ఎదిగిందనేదే ఇప్పుడు ప్రశ్న.

ముప్పై వేల అడుగుల ఎత్తున వెళ్తున్న విమానాన్ని కూల్చివేసి ..

ఆకాశంలో ముప్పై వేల అడుగుల ఎత్తున వెళ్తున్న విమానాన్ని కూల్చివేసి నేలమట్టం చేయడం ఐసిస్‌కు ఎలా సాధ్యమైంది...? సాధారణంగా మిలిటెంట్ గ్రూప్స్ వద్ద రాకెట్ లాంచర్లు ఉంటాయి. భూమిపై దాడులు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. వాయులక్ష్యాలను చేధించాలంటే మిలటరీ తరహా ఆయుధాలు కావాలి..

రష్యా విమానంపై ఐసిస్ ఉగ్రవాదులు క్షిపణిని ప్రయోగించారా...?..

రష్యా విమానంపై ఐసిస్ ఉగ్రవాదులు క్షిపణిని ప్రయోగించారా...? ఐసిస్ అదే చెబుతోంది. ఇదిగోండి సాక్ష్యం అంటూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. విమానం నేలకూలుతున్న దృశ్యాలు ఇవి. ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన ఓ లోగో కూడా ఆ ఫూటేజ్‌పై ఉంది.

రష్యా, ఈజిప్టు ప్రకటించిన కొన్ని గంటలకే ఐసిస్..

విమాన ప్రమాదం వెనుక ఎవరి హస్తం లేదని సాంకేతిక లోపంతోనే కూలిపోయిందని రష్యా, ఈజిప్టు ప్రకటించిన కొన్ని గంటలకే ఐసిస్ దీనిని విడుదల చేసింది. 30వేల అడగుల ఎత్తులో ఉండే విమానాన్నిపేల్చే సామర్ధ్యం మిలిటెంట్‌ గ్రూప్స్‌కు లేవని ఆయా దేశాలు గట్టిగా వాదిస్తున్నా... ఐసిస్ మాత్రం తమ ఉగ్రరూపాన్ని వీడియోలతో సహా ప్రపంచం ముందుంచింది..

రష్యా, ఈజిప్టు చెబుతున్న వాదనలు ఎలా ఉన్నా..

విమానాన్ని కూల్చివేసి ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి తమ ఉనికిని చాటుకున్నారు. రష్యా, ఈజిప్టు చెబుతున్న వాదనలు ఎలా ఉన్నా... ఉగ్రవాద చర్యను తోసిపుచ్చలేం. సిరియా అంతర్యుద్ధం, రష్యా వైమానిక దాడులు, సిరియాలో అమెరికా సంయక్త దళాలు ఆపరేషన్, ఉగ్రవాదు స్థావరాల కూల్చివేత... ఈ వరుస పరిణామాలను చూస్తుంటే...ఐసిస్ పాత్రనుకొట్టిపారయలేం.

ఐసిస్ ఉగ్రవాదులు మిసైల్ దాడులకు దిగడం..

ఐసిస్ ఉగ్రవాదులు మిసైల్ దాడులకు దిగడం ఆందోళన కలిగించే పరిణామమే. ఈజిప్టు, సినాయ్ ద్వీపకల్పం సిరియా, టర్కీ, గాజాస్ట్రిప్‌ , పాలస్తీనా ... అంతర్యుద్దాలతో ఈ దేశాలన్నీ రావణకాష్టంలా రగులుతూనే ఉంటాయి.

రోజురోజుకు పెరిగిపోతున్న ఉగ్రవాద కార్యకలాపాలు..

వీటికి తోడు రోజురోజుకు పెరిగిపోతున్న ఉగ్రవాద కార్యకలాపాలు అశాంతిని సజీవంగా ఉంచుతున్నాయి. కేవలం తమ ప్రాభల్యమున్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తూ నెత్తురు పారిస్తున్న ఐసిస్ విమానాన్ని కూల్చివేసి... అక్కడితో ఆగుతుందా...? లేక ముందు ముందు మరింత విధ్వంసానికి పాల్పడుతుందా.. అదే జరిగితే ప్రపంచానికదే పెనుసవాలే.

రష్యా ఇప్పుడు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ..

ఉగ్రవాదులపై యుద్ధం చేస్తున్న రష్యా ఇప్పుడు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ప్రమాదానికి నిజంగానే ఉగ్రవాదులు కారణమైతే వారిని నామరూపాల్లేకుండా చేసేందుకు వెనుకాడబోదు.అమెరికా లాడెన్ ను మట్టుబెట్టినట్లే..రష్యా ఉగ్రవాదులపై విరుచుకుపడటం ఖాయం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ISIS Advance Technology and bomb downed Russian plane say US UK officials
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot