రష్యా ఉగ్రరూపం: ప్రపంచాన్ని కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

Posted By:

రష్యా ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. దానికి తోడు రష్యాలో ఇప్పుడు అమెరికా కన్నా అత్యంత శక్తివంతమైన ,శత్రువులను క్షణాల్లో మట్టుబెట్టగల ఆయుధాలు ఉన్నాయని వీటితో రష్యా ఇప్పుడు తన ఉగ్రరూపం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా అమెరికాను మించిన పవర్ కలిగి ఉందని అమెరికాకు చెందిన మాజీ యుఎస్ ఆర్మీ ఆఫీసర్ చెప్పడంతో ఇప్పుడు మళ్లీ యుద్ధమేఘాలు రాజుకునేలా ఉన్నాయి. అదీగాక రష్యా విమానం మేమే కూల్చామని ఉగ్రవాదులు చెప్పడంతో రష్యాకు పుండు మీద కారం చల్లినట్లయింది. అందుకే తాడో పేడో తేల్చుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మిగతా కథనం స్లైడర్ లో.

Read more: ప్రపంచ దేశాలకు భారత్ షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రష్యా ఇప్పడు అమెరికా కన్న అత్యంత శక్తివంతమైన పవర్ కలిగి..

రష్యా ఇప్పడు అమెరికా కన్న అత్యంత శక్తివంతమైన పవర్ కలిగి ఉందని అమెరికాకు చెందిన కౌంటర్ టెర్రర్ విశ్లేషకుడు స్కాట్ బెన్నట్ తెలిపారు. అంతేకాక ఇప్పుడు ప్రతీకార జ్వాలతో రగిలిపోతుందని అందుకు ఏమిచేయడానికైనా వెనుకాడబోదని ఆయన ప్రెస్ టీవిలో చర్చ సంధర్భంగా అన్నారు.

ఉగ్రవాదులు రష్యా విమానాన్ని కూల్చేసామని ప్రకటించడం ..

అదీగాక ఉగ్రవాదులు రష్యా విమానాన్ని కూల్చేసామని ప్రకటించడం అందులో అత్యధికభాగం రష్యన్లు ఉండటం కూడా రష్యా ఆగ్రహంతో రగిలిపోవడానికి కారణమని ఆయన తెలిపారు. ఇప్పుడు ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని మాజీ యుఎస్ ఆర్మీ ఫిజికల్ వార్ ఫేర్ ఆపీసర్ ప్రెస్ టీవికి తెలిపారు.

ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు ..

దీంతో ఇప్పుడు ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా నేతృత్వంలోని నాటో, రష్యా మధ్య సైనిక, అణుయుద్ధ వాతావరణం ఏర్పడుతున్న ప్రస్తుత సమయంలో ప్రపంచం ప్రమాదపుటంచుల్లో నిలిచిందని అమెరికా శాంతి మండలి ఆందోళన వ్యక్తం చేసింది.

ఉక్రెయిన్‌, సిరియాలలో రెండు అణ్వస్త్ర దేశాలకు చెందిన సైన్యాలు..

ఇప్పుడు తూర్పు ఐరోపాలో ప్రధానంగా ఉక్రెయిన్‌, సిరియాలలో రెండు అణ్వస్త్ర దేశాలకు చెందిన సైన్యాలు ముఖాముఖి తలపడేందుకు సిద్ధంగా వున్నాయని, ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆ ప్రాంత ప్రజలుబిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారని ప్రపంచ శాంతి ప్రియులకు రాసిన ఒక బహిరంగలేఖలో మండలి వెల్లడించింది.

రష్యా కూడా సిరియాలో పోరుబరిలో.

ఒక రకంగా చెప్పాలంటే మరో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైందని మండలి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సిరియాలో నాటో దేశాలయిన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, టర్కీ, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్‌తో పాటు అమెరికా మిత్రులయిన ఇజ్రాయిల్‌, కతార్‌, ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, జోర్డాన్‌, బెహ్రెయిన్‌, ఆస్ట్రేలియా వంటి నాటోయేతర దేశాలు తాజాగా రష్యా కూడా సిరియాలో పోరుబరిలో దిగాయని వివరించింది.

రష్యా పశ్చిమ సరిహద్దుల్లో మరో ప్రమాదం ముంచుకొస్తోందని,..

రష్యా పశ్చిమ సరిహద్దుల్లో మరో ప్రమాదం ముంచుకొస్తోందని, నాటో తన దళాలను రష్యా సరిహద్దు దేశాల్లో విస్తరించుకుంటోందని వివరించింది. రష్యా సరిహద్దు దేశాల ప్రభుత్వాలన్నీ ఇప్పుడు నాటో, అమెరికా దళాలను తమ భూభాగాలలోకి అనుమతిస్తున్నాయని మండలి తెలిపింది.

ఇది కచ్చితంగా రష్యాకు ఆగ్రహం తెప్పించే విషయమేనని..

ఇది కచ్చితంగా రష్యాకు ఆగ్రహం తెప్పించే విషయమేనని, అమెరికా-మెక్సికో-కెనడా సరిహద్దుల్లో రష్యా తన సైన్యాన్ని కూడా సహజంగానే అమెరికాకు వ్యతిరేకంగా మోహరించిందని వివరించింది. అమెరికా నగరాలకు కేవలం కొద్ది దూరంలోనే రష్యా తన సైనిక విన్యాసాలు కొనసాగిస్తుండటం ఇరుదేశాల మధ్య తారస్థాయికి చేరుతున్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోందని తెలిపింది.

అమెరికా, దాని నాటో మిత్రదేశాలకు రష్యాకు మధ్య ఘర్షణ ..

ఈ పరిస్థితులన్నీ అమెరికా, దాని నాటో మిత్రదేశాలకు రష్యాకు మధ్య ఘర్షణ సృష్టించేవేనని, ఈ ఘర్షణ అణుయుద్ధంగా మారితే ప్రపంచానికి వినాశకర పరిణామాలు తప్పవని శాంతి మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదకరపరిస్థితుల నేపథ్యంలో అణు వ్యతిరేక, శాంతి ఉద్యమకారులందరూ అప్రమత్తంగా వుండాలని తాము కోరుతున్నామని మండలి తెలిపింది.

వాస్తవానికి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు..

వాస్తవానికి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు నానాటికీ దిగజారటానికి ఇటీవల సిరియా, ఉక్రెయిన్‌లలో చోటు చేసుకున్న ఘర్షణలే మూల కారణమని, గతంలో 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనం వెనుక కూడా అమెరికా సామ్రాజ్యవాద కాంక్షే కారణమన్న విషయాన్ని విస్మరించరాదని తెలిపింది.

గత సెప్టెంబర్ 30వ తేదీనుంచి రష్యా స్వయంగా..

అయితే గత సెప్టెంబర్ 30వ తేదీనుంచి రష్యా స్వయంగా సిరియాలోని ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై వైమానికయుద్ధం ప్రారంభించింది. రష్యా చైనాలు బలపరుస్తున్న సిరియా ప్రభుత్వాన్ని ఐఎస్‌ఐఎస్ కూల్చివేయడానికి రంగం సిద్ధం కావడం ఈ వైమానిక యుద్ధానికి కారణం..

రష్యాలోని పీటర్స్‌బర్గ్‌కు వెడుతుండిన విమానాన్ని కూల్చివేసినట్టు ఐఎస్‌ఐఎస్...

ఇలా తమ స్థావరాలపై రష్యా సాగిస్తున్న దాడులకు ప్రతీకారంగా ఈజిప్టులోని షరమ్ అల్‌షేక్‌నుంచి రష్యాలోని పీటర్స్‌బర్గ్‌కు వెడుతుండిన విమానాన్ని కూల్చివేసినట్టు ఐఎస్‌ఐఎస్ ప్రకటించింది! రష్యాకు చెందిన ఈ విమానంలోని 224 మంది ప్రయాణీకులు బీభత్స జ్వాలలకు ఆహుతైపోవడం ఘోరమైన విషాదం.

ఒకే ఘటనలో ఐఎస్‌ఐఎస్ వారు ఇంతమందిని హత్య చేయడం..

ఒకే ఘటనలో ఐఎస్‌ఐఎస్ వారు ఇంతమందిని హత్య చేయడం గత ఏడాది ఇరాక్‌లో పోరాటం ఆరంభమైన తరువాత ఇదే మొదటిసారి! ఇలా ఐఎస్‌ఐఎస్ రష్యాపై దాడి చేయడం ఒక విధంగా రెండవ ఐరోపా యుద్ధం నాటి పరిణామ క్రమానికి పునరావృత్తి! ఈ రెండవ ఐరోపా యుద్ధం ఆ తరువాత రెండవ ప్రపంచ యుద్ధంగా ప్రసిద్ధికెక్కింది.

రష్యా ఐఎస్‌ఐఎస్‌ను వ్యతిరేకించడం ..

సిరియాలోని నియంతృత్వ ప్రభుత్వాన్ని అమెరికా ఐరోపాలు వ్యతిరేకిస్తుండగా రష్యా చైనాలు మాత్రం సిరియా ప్రభుత్వాన్ని బలపరుస్తున్నాయి! ఐఎస్‌ఐఎస్ సిరియాలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకుంది, సిరియా ప్రభుత్వాన్ని తొలగించడానికి పూనుకుంది. అందువల్ల రష్యా ఐఎస్‌ఐఎస్‌ను వ్యతిరేకించడం మొదలైంది!

రష్యా విమానాన్ని తామే కూల్చనట్టు ప్రకటించిన సమయంలోనే..

ఐఎస్‌ఐఎస్ రష్యా విమానాన్ని తామే కూల్చనట్టు ప్రకటించిన సమయంలోనే, బంగ్లాదేశ్‌లోని ఒక పుస్తక ప్రచురణ కర్తను తాము చంపినట్టు అల్‌ఖాయిదా ప్రకటించుకుంది. యెమెన్‌లోకి చొరబడిన తాలిబన్, అల్‌ఖాయిదా తండాలు పశ్చిమ ఆసియా దేశాలలోని షియా ముస్లింలపై దాడులు తీవ్రతరం చేసాయి.

గత సోవియట్‌ కాలం నుండి వారసత్వంగా సంక్రమించిన వాటితో ..

అయితే గత సోవియట్‌ కాలం నుండి వారసత్వంగా సంక్రమించిన వాటితో సహా మొత్తం తన వద్దవున్న రసాయనిక ఆయుధాలలో ఇప్పటికే 90 శాతం మేర ధ్వంసం చేసినట్లు రష్యా ప్రక టించింది. అంతర్జాతీయ చట్ట నిబంధన ల మేరకు రసాయనిక ఆయు ధాల పూర్తి నిర్మూలనకు తమ కృషి కొనసాగుతుందని సంబంధిత వర్గాలు స్పష్టం చేసాయి.

రానున్న ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం మొత్తం ఆయుధాలన్నింటినీ ..

రానున్న ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం మొత్తం ఆయుధాలన్నింటినీ ధ్వంసం చేస్తామని రష్యా విదేశాంగ శాఖ నిరాయుధీకరణ విభాగం డైరెక్టర్‌ మిజైల్‌ ఉల్యనోవ్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. రష్యా తన వద్ద వున్న రసాయనిక ఆయుధ నిల్వల్లో ఇప్పటి వరకూ 92 శాతానికి పైగా నిర్మూలించిందని, ఇందులో గత సోవియట్‌ యూనియన్‌ నుండి వారసత్వంగా సంక్రమించినవి కూడా వున్నాయని ఉల్యనోవ్‌ను ఉటంకిస్తూ ఇటార్‌టాస్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇప్పుడు ధ్వంసం సంగతి పక్కనబెడితే..

ఇప్పుడు ధ్వంసం సంగతి పక్కనబెడితే రానున్న కాలంలో అమెరికాను కూడా శాసించగల ఆయుధాలు రష్యా సముపార్జించుకునే అవకాశం ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. మరి ముందు ముందు ఏం జరగుతుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Russians have far superior military technologies than Americans
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot