హ్యాక్ చేస్తే 6 లక్షలు: ఉగ్రవాదుల బంఫర్ ఆఫర్

Written By:

ప్రపంచంలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలంటూ నెత్తుటేరులు పారిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఇండియాలో నెత్తుటేరులు పారించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మనదేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక సమాచారం కోసం మన దేశ హ్యాకర్లకు వల విసురుతోంది. మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాం మీ దేశ సమాచారాన్ని మాకందించండి అంటూ గాలం వేస్తున్నారు. ఇంకా షాకింగ్ నిజాలను చూడండి.

Read more: చెత్తతో దేశాల మధ్య యుద్ధానికి తెర

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లను

ఇండియన్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లను హ్యాక్‌ చేయండి.. అందులో ఉన్న కీలక సమాచారాన్ని తస్కరించి మాకందజేయండి.. అలాగే సోషల్‌ మీడియాలో మాకు మద్దతుగా మాట్లాడేవారిని గుర్తించండి.. ఇవన్నీ మీరు చేయడానికి సిద్ధమైతే మీకు రూ. 6.8 లక్షల మనీ ఇస్తాం..ఇది ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ భారతీయ హ్యాకర్లకు వల.

ఏకంగా నకిలీ పాస్‌పోర్టుల తయారీకి ఓ పరిశ్రమనే

ఇదంతా ఓ ఎత్తయితే ప్రపంచంలో ఇస్లామిక్‌ సామ్రాజ్య స్థాపన కోసం ఈ ఉగ్రవాద సంస్థ వివిధ దేశాల్లోకి ఉగ్రమూకలను చేరవేసి విధ్వంసం సృష్టించేందుకు ఏకంగా నకిలీ పాస్‌పోర్టుల తయారీకి ఓ పరిశ్రమనే ప్రారంభించింది.

ఆయుధాలు తయారు చేసుకునేందుకు 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీపైనా

దీని ద్వారా ఉగ్రవాదులను చేరవేస్తోందని, అలాగే అత్యంత సులభంగా, చౌకగా ఆయుధాలు తయారు చేసుకునేందుకు 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీపైనా దృష్టి సారించిందని అంతర్జాతీయ భద్రతా సంస్థలు చెబుతున్నాయి.

హ్యాకింగ్‌ కోసం ఏకంగా 30 వేల మంది భారతీయులను

ఇప్పటిదాకా భారతదేశంలో హ్యాకింగ్‌ కోసం ఏకంగా 30 వేల మంది భారతీయులను ఐఎస్‌ ఆన్‌లైన్‌లో సంప్రదించినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఐఎస్‌ ఇవ్వజూపిన భారీ ఆఫర్లకు వీరిలో చాలామంది లొంగిపోయారనీ భావిస్తున్నాయి.

ఐఎస్‌కు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లలో

భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లలోకి చొరబడి కీలకమైన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఐఎస్‌లో చేరేందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లలో గుర్తించాలని, అందరి వివరాలతో పూర్తి డేటాబేస్‌ను రూపొందించాలనీ ఆ సంస్థ హ్యాకర్లను కోరింది.

ఇలా చేసిన ప్రతి హ్యాకర్‌ ఉద్యోగానికీ

ఇలా చేసిన ప్రతి హ్యాకర్‌ ఉద్యోగానికీ 10 వేల డాలర్లు(రూ. 6.80 లక్షలు) జీతం ఇస్తామని చెబుతుండటంతో భారతలో అడ్డదారులు తొక్కే హ్యాకర్లు ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిరియా నుంచి నిర్వహిస్తున్న స్కైప్‌, సైలెంట్‌ సర్కిల్‌..

అయితే వీరు ఎక్కువగా సిరియా నుంచి నిర్వహిస్తున్న స్కైప్‌, సైలెంట్‌ సర్కిల్‌, టెలిగ్రామ్‌, వాట్సాప్‌ అప్లికేషన్‌ల ద్వారా సంప్రదింపులు కొనసాగిస్తున్నారని, గత ఆరునెలలుగా ప్రభుత్వ సమాచారం తస్కరించి, పెద్ద మొత్తానికి బయటి వ్యక్తులకు అమ్ముకోవడం పెరిగిందని ఈ మేరకు కిస్‌లే చౌధరీ అనే సైబర్‌ క్రైమ్‌ నిరోధక నిపుణుడు వెల్లడించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నిన 14 మంది ఐఎస్‌ మద్దతుదారులను భద్రతా సంస్థలు ఇటీవలే అరెస్టు చేసిన నేపథ్యంలో.. దక్షిణాదిలోని వివిధ ప్రాంతాల్లో, కశ్మీర్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఇతర చోట్ల ఐఎస్‌ మద్దతుదారులు సోషల్‌ మీడియా ద్వారా భారత వ్యతిరేక ప్రచారాన్ని చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు తేలింది.

ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 94 వెబ్‌సైట్‌లను బ్లాక్‌

స్థానిక సంఘటనలు, అంశాలనే హిందీ, తమిళం, గుజరాతీ, ఉర్ధూ, ఇతర భాషల్లో ప్రస్తావిస్తూ కొన్ని నెలలుగా విద్వేషం వ్యాప్తిచేస్తున్నారని వెల్లడైంది. ఈ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 94 వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేసినట్లు మహారాష్ట్ర ఏటీఎస్‌ వెల్లడించింది.

కేరళ ప్రభుత్వ వెబ్ సైట్లలో అక్రమంగా ప్రవేశించిన తీవ్రవాదులు

గతంలో కేరళ ప్రభుత్వ వెబ్ సైట్లలో అక్రమంగా ప్రవేశించిన తీవ్రవాదులు అక్కడ ఐఎస్ఐఎస్ కి సంబంధించిన నినాదాలు ఉంచారు. దీనిపై కేరళ హ్యాకర్స్ బృందం గట్టిగానే బుద్ధి చెప్పింది. వారి సైట్లలోకి వైరస్ ఎక్కించి వాటిని స్థభింపజేశారు.మీరింకా అమ్మకూచి అని మాతో ఆటలాడవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఉగ్రవాదంలో పనిచేస్తున్నఫైటర్లకు వేతనాలను

ఇదిలా ఉంటే ఉగ్రవాదంలో పనిచేస్తున్నఫైటర్లకు వేతనాలను ఐఎస్‌ సగానికి సగం పైగా కోత విధించింది. ఐఎస్‌కు ఆదాయం తెచ్చిపెడుతున్న చమురు బావులు, ఇతర ఆదాయ వనరులపై, నగదు నిల్వలు, పంపిణీ చేసే కేంద్రాలపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు దాడులు చేస్తుండటంతో ఆ మేరకు ప్రభావం పడుతోంది.

సిరియాలో ఐఎస్‌ ఫైటర్ల జీతాలను 50 శాతం

అసాధారణ పరిస్థితుల దృష్ట్యా సిరియాలో ఐఎస్‌ ఫైటర్ల జీతాలను 50 శాతం తగ్గిస్తున్నాం. అధికారుల నుంచి సాధారణ సైనికుల వరకూ అందరికీ ఇదే వర్తిస్తుంది'' అంటూ సిరియాలోని ఐఎస్‌ కంచుకోట రఖాలో గల ఆ సంస్థ ట్రెజరీ బయత మాల్‌ అల్‌-ముస్లిమీన్‌ అధికారిక పత్రాలను విడుదల చేసింది.

ఐఎస్‌ పెద్ద ఎత్తున నకిలీ పాస్‌పోర్టులను

ఇరాక్‌, లిబియా, సిరియాలలో దొంగిలించిన పాస్‌పోర్టులు, పత్రాల ఆధారంగా ఐఎస్‌ పెద్ద ఎత్తున నకిలీ పాస్‌పోర్టులను తయారు చేస్తోందని ఫ్రెంచ్‌ అధికారులు హెచ్చరించారు.

పారిస్‌లో గత నవంబరులో ఉగ్రదాడికి

పారిస్‌లో గత నవంబరులో ఉగ్రదాడికి పాల్పడినవారిలో ఇద్దరు ముష్కరులు నకిలీ సిరియా పాస్‌పోర్టులతో గ్రీస్‌ నుంచి ఫ్రాన్స్‌లోకి వలసవాదుల ముసుగులో ప్రవేశించిన నేపథ్యంలో ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు గాను ఓ బృందాన్ని గ్రీస్‌కు అధ్యయనం కోసం పంపనున్నట్లు ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నార్డ్‌ క్యాజెనీవ్‌ పంపనున్నట్లు తెలిపారు.

నకిలీ పాస్‌పోర్టులతో ఉగ్రమూకలను ఆయా దేశాల్లోకి

ఇరాక్‌, సిరియాల్లో నెలకొన్న శరణార్థుల సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకుంటున్న ఐఎస్‌.. వలస పౌరుల ముసుగులో.. నకిలీ పాస్‌పోర్టులతో ఉగ్రమూకలను ఆయా దేశాల్లోకి చేరవేసేందుకు ఎత్తులు వేస్తోందని బ్రిటన్‌ నిఘా సంస్థలు హెచ్చరించాయి.

పాస్‌పోర్టుల ముద్రణకు ఐఎస్‌ ఓ యంత్రాన్ని

పాస్‌పోర్టుల ముద్రణకు ఐఎస్‌ ఓ యంత్రాన్ని కూడా ఐఎస్‌ కొనుగోలు చేసినట్లు తెలిసిందని అమెరికన్‌ అధికారులు కూడా గత నెలలో వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే

అమెరికా వైమానిక దాడిలో

ఇక అమెరికా వైమానిక దాడిలో అప్పుడు జీహాది జాన్ చనిపోయిన విషయాన్ని ఐఎస్ ఇప్పుడు బహిర్గతం చేసింది. ఈమేరకు చేతిలో ఆయుధంతో దాడికి బయలుదేరిన జిహాదీ జాన్‌ చిత్రాన్ని తాజాగా విడుదల చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ISIS Offering $10,000 To Indian Hackers To Steal Sensitive Data From Government
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot