పైనుంచి మృత్యువు వస్తోంది, ఇంతకన్నా సాక్ష్యం దొరకదు

అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలతో పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.

|

అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలతో పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు సైతం దారి తీసే అవకాశం ఉందని మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు. ఇటీవల కాలంలో అంతరిక్షంలో అమెరికా రష్యా స్పేస్ ఏజెన్సీలు వేల సంఖ్యలో శిధిలాలను గుర్తించాయి. ఇవి దాదాపు 10 సెంటీ మీటర్లకంటే పెద్దగా ఉన్నాయి. వివిధ దేశాలు పంపినటువంటి శాటిలైట్లను ఇవి ఢీ కొన్నప్పుడు వాటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏదైనా దేశం పంపిన ముఖ్యమైన మిలిటరీ శాటిలైట్ ఈ అంతరిక్ష వ్యర్థాల ద్వారా ధ్వంసమైతే.. ప్రత్యర్థి దేశాల వారు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భావించే అవకాశం ఉందని, ఇది దేశాల మధ్య యుద్ధాలకు సైతం కారణం కాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

 

Readmore: షాకింగ్ : మిస్సయిన వందేళ్లకు..

చైనా తమ దేశానికి చెందిన

చైనా తమ దేశానికి చెందిన

గతంలో.. చైనా తమ దేశానికి చెందిన కాలం చెల్లిన ఓ వాతావరణ శాటిలైట్‌ను 2007లో ధ్వంసం చేసింది. దీని ద్వారా మూడు వేలకు పైగా శిథిలాలు అంతరిక్షంలో మిగిలిపోయాయి.

2013లో రష్యాకు చెందిన బ్లిట్స్ శాటిలైట్

2013లో రష్యాకు చెందిన బ్లిట్స్ శాటిలైట్

2013లో రష్యాకు చెందిన బ్లిట్స్ శాటిలైట్ అంతరిక్ష వ్యర్థాలు ఢీ కొనడం ద్వారా ధ్వంసమైంది. అయితే చైనా శాటిలైట్ ధ్వంసంలో ఏర్పడిన శిథిలాలే తమ శాటిలైట్ ధ్వంసానికి కారణమని రష్యా ఆరోపించింది.

నాసా ప్రకారం 20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు
 

నాసా ప్రకారం 20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు

అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా ప్రకారం 20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో చాలా వస్తువులు ఫుట్ బాల్ కంటే పెద్ద సైజులో ఉన్నాయి.

మరో 5లక్షల చిన్న వ్యర్థాలు

మరో 5లక్షల చిన్న వ్యర్థాలు

వీటితోపాటు మరో 5లక్షల చిన్న వ్యర్థాలు కూడా శూన్యంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఇవి నట్లు, బోల్టులు, మేకుల వంటివి. ఇక గుర్తుపట్టలేనంత చిన్న వస్తువులు లక్షలాదిగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.

గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో

గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో

భూమి చుట్టూ చక్కర్లు ఇవి గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మనం విసిరే రాయి తలకు తగిలితేనే బ్లడ్ వస్తుంది. అలాంటిది ఇంత వేగంతో తిరిగే వస్తువు వ్యోమగాములకు తగిలితే ఏమవుతుందో ఊహించారా?

ఆరు రెట్లు ఎక్కువ వేగం

ఆరు రెట్లు ఎక్కువ వేగం

మన శరీరాన్ని అది రెండుగా చీల్చుకుంటూ వెళ్లిపోవడం ఖాయం. గన్ నుంచి వచ్చే బుల్లెట్ గంటకు 4,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ అంతరిక్ష వస్తువులు అంతకు ఆరు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తున్నాయి.

ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా ...

ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా ...

అభివృద్ధి పేరుతో మనం భూమి చుట్టూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాం. ప్రపంచ దేశాల శాటిలైట్లు భూకక్ష్యలో తిరుగుతూ సేవలు అందిస్తున్నాయిగానీ, కాలపరిమితి ముగిసినవి మాత్రం ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా మారుతున్నాయి.

ఈ చెత్తను తిరిగి భూమికి తెచ్చేందుకు

ఈ చెత్తను తిరిగి భూమికి తెచ్చేందుకు

ఈ చెత్తను తిరిగి భూమికి తెచ్చేందుకు ఏ దేశమూ ప్రయత్నించట్లేదు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం మరి. చిన్న చిన్న వ్యర్థాల వల్ల ప్రస్తుత శాటిలైట్లకూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చాలా నష్టం జరుగుతోంది. స్పేస్ షటిల్స్ అద్దాలు, కిటికీలూ, సోలార్ ప్లేట్లూ దెబ్బతింటున్నాయి.

2009లో అమెరికాకు చెందిన ఇరిడియం శాటిలైట్ ను

2009లో అమెరికాకు చెందిన ఇరిడియం శాటిలైట్ ను

2009లో అమెరికాకు చెందిన ఇరిడియం శాటిలైట్ ను రష్యాకు చెందిన పాతకాలపు ఉపగ్రహం ఢీకొట్టింది. అది వివాదంగా మారిన తరువాత సద్దుమణిగింది.

2007లో ఓ పాతకాలపు వాతావరణ శాటిలైట్ ను

2007లో ఓ పాతకాలపు వాతావరణ శాటిలైట్ ను

2007లో ఓ పాతకాలపు వాతావరణ శాటిలైట్ ను నాశనం చేసేద్దామని చైనా ఓ క్షిపణిని ప్రయోగించింది. క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు శూన్యంలో తిరగడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ అవి తిరుగుతూనే ఉన్నాయి.

ఈ అంతరిక్ష వ్యర్థాలు ఒక్కోసారి గతి తప్పి

ఈ అంతరిక్ష వ్యర్థాలు ఒక్కోసారి గతి తప్పి

ఈ అంతరిక్ష వ్యర్థాలు ఒక్కోసారి గతి తప్పి భూమిపై పడుతున్నాయి. ఇళ్లు, అపార్ట్ మెంట్లపై కూలుతున్నాయి. అగ్ని ప్రమాదాలు, కార్చిచ్చులకు కారణమవుతున్నాయి.

ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం

ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం

ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరుగుతోంది. శాటిలైట్ ను పైకి పంపించేటప్పుడే, దాని కాలపరిమితి ముగిసిన తర్వాత, తిరిగి భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

2002లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ

2002లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ

2002లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇంటెగ్రల్ మిషన్ ను పైకి పంపించింది. దాని కాలపరిమితి 2028లో ముగుస్తుంది. ఫలితాలు తేలడానికి దశాబ్దం పైనే అదే ఏడాది లేదా తర్వాతి సంవత్సరం అది భూమిపై పడేలా ప్రోగ్రాం రూపొందించారు. ఆ ఫలితాలు తేలడానికి మనం దశాబ్దం పైనే ఆగాలి.

ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని భూ కక్ష్యలో

ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని భూ కక్ష్యలో

ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని భూ కక్ష్యలో పెరిగిపోతున్న శిథిలాలు దేశాల మధ్య చిచ్చురేపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మరి ఈ వ్యర్థాలతో పెను ప్రమాదం రాకముందే దీనిపై తగు చర్యలు తీసుకోవడం మేలని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటు ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Rise in space junk orbiting the Earth could provoke armed conflict

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X