ఉగ్రవాదుల టెక్నాలజీతో షాక్ : పారిస్‌కు మరో ముప్పు

Written By:

పారిస్‌పై దాడికి ఐఎస్‌ఐఎస్ వాడిన టెక్నాలజీని చూసిన వారికి కళ్లు బైర్లు కమ్మతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారు సాగించిన మారణకాండను చూసిన ఇన్విస్టిగేషన్ అధికారులు సైతం షాక్ కు గురవుతున్నారు. కేవలం వీడియో గేమ్స్, ఫోన్ యాప్స్ , టెలిగ్రాంల ద్వారానే పారిస్ లో నరమేధం సృష్టంచారనే నిజాలు ఇప్పుడు బయటి ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్నాయి. ఇంకా ఐ ఫోన్ ఎన్ క్రిప్సన్ యాప్స్ తో ప్లాట్ అవుట్ సైడ్ రక్తపుటేరులు పారించారని ఇన్విస్టిగేషన్ లో తేలింది. విస్తుగొలిపే నిజాలను చదవండి.

Read more: రఫాలేతో ఫ్రాన్స్ ఉగ్ర రూపం: వైట్‌హౌస్‌పై ఉగ్రకన్ను

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీరు సైలెంట్ సర్కిల్ అయిన వాట్సప్ అలాగే టెలిగ్రాంలనే

ఉగ్రవాదుల టెక్నాలజీని చూసిన అధికారులకు దిమ్మ తిరుగుతోంది. వీరు సైలెంట్ సర్కిల్ అయిన వాట్సప్ అలాగే టెలిగ్రాంలనే ప్రధానంగా అటాక్ కోసం ఉపయోగించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీటితోనే వారు కమ్యూనికేషన్ అయి పారిస్ లో నరమేధానికి పాల్పడ్డారని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ చెబుతోంది.

వీటితో పాటు 120 రకాల ఫ్లాట్ ఫాంలను ఐఎస్‌ఐఎస్ వాడుతోందని

వీటితో పాటు 120 రకాల ఫ్లాట్ ఫాంలను ఐఎస్‌ఐఎస్ వాడుతోందని అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారానే ఉగ్రవాదులు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. వీటిల్లో ప్రధానంగా వారికి ఉపయోగపడింది టెలిగ్రాం.. ఇది చాలా సీక్రెట్ గా ఉండటంతో ఉగ్రవాదులు దీనిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ప్లే స్టేషన్ 4 ని దాడుల కోసం ఉపయోగిస్తున్నట్లు

ఇక అత్యాధునిక టెక్నాలజీగా వీడియో గేమ్స్ ని వాడారని నిపుణులు చెబుతున్నారు. ప్లే స్టేషన్ 4 ని దాడుల కోసం ఉపయోగిస్తున్నట్లు దాంతోనే వారు సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. డబ్బుల ట్రాన్స్ పర్ కి సంబంధించిన లావా దేవీల సమాచారం కూడా ఈ ప్లే స్టేషన్ ద్వారానే జరిగినట్లు తెలుస్తోంది.

కేవలం టెలిగ్రాం ద్వారానే 78 ఛానళ్లు టెర్రరిస్టు గ్రూపులు

కేవలం టెలిగ్రాం ద్వారానే 78 ఛానళ్లు టెర్రరిస్టు గ్రూపులు నడుపుతున్నారంటే వారి టెక్నాలజీ ఎంతగా ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పారిస్ దాడుల్లో సైతం ఈ టెక్నాలజీని వాడారు. ఒంటరి తొడేలు చంపడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అంటూ యాప్ ద్వారా పారిస్ అటాక్ ల గురించి చర్చించుకున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఆయుధాల తయారీ దగ్గర నుంచి వాటిని లాంచ్ చేసే దాకావీరి తతంగమంతా

ఆయుధాల తయారీ దగ్గర నుంచి వాటిని లాంచ్ చేసే దాకావీరి తతంగమంతా ఈ యాప్ ద్వారానే నడిచిందని తెలుస్తోంది. మాములుగా టెలిగ్రాంలో గ్రూపు క్రియేట్ చేసి 200 మందికి అందులో నుంచి మెసేజ్ పంపే వీలుంటుంది. దీన్ని వారు తమ ఆయుధంగా వాడారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టెలిగ్రాం దాన్ని ఇప్పుడు బ్లాక్ చేసింది. అంతే కాకుండా 12 భాషలలో ఐఎస్‌కుచెందిన 78 గ్రూపులను కూడా బ్లాక్ చేసింది.

యాప్ నిర్వాహకులపై దాడులు చేయాలన్న యోచనలో

టెలిగ్రాం దానిని బ్లాక్ చేససే కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో వారు ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిచండటంతో పాటు తమ చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న యాప్ నిర్వాహకులపై దాడులు చేయాలన్న యోచనలో ఉన్నట్లు ఐఎస్ఐఎస్ హెచ్చరిక సంకేతాలు పంపించింది.

యాపిల్ ఫోన్ ను సైతం ఉగ్రవాదులు అటాక్ చేయడానికి

ఇక యాపిల్ ఫోన్ ను సైతం ఉగ్రవాదులు అటాక్ చేయడానికి వాడుకున్నారు. అత్యంత రక్షణ గల ఈ ఫోన్ కూడా ఉగ్రవాదులకు ఆయుధంగా మారిందని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఉన్న ఇన్ స్క్రిప్షన్ యాప్స్ ను ఉగ్రవాదులు నరమేధానికి వాడుకున్నారని వారు చెబుతున్నారు. మేసేజ్ పంపడానికి అలాగే డిలీట్ చేయడానికి వీరు టైంని కూడా సెట్ చేసుకున్నారంటే వారి టెక్నాలజీని అర్థం చేసుకోవచ్చు.

అనేక మంది యువ సైబర్ నిపుణులు ఇప్పుడు ఉగ్రవాదుల్లో

అనేక మంది యువ సైబర్ నిపుణులు ఇప్పుడు ఉగ్రవాదుల్లో చేరి ఉన్నారనే నిజాలు బయటకొచ్చాయని యూరోపియన్ కౌంటర్ టెర్రరిజం చెబుతోంది. కొంతకాలం నుంచి వారు చాలా అప్రమత్తంగా తయారయ్యారు టెక్నాలజీని రాడార్లకు చిక్కకుండా వాడుతున్నారని వారు చెబుతున్నారు.

వీడియో గేమ్స్ అందరూ ఆడుకోవడానికి ఉపయోగిస్తే

ఇక వీడియో గేమ్స్ అందరూ ఆడుకోవడానికి ఉపయోగిస్తే వీరు అందులో నుంచి అటాక్ కు సంబంధించిన మేసేజ్ లు పంపుకున్నారు. దాని ద్వారా పారిస్ పై అటాక్ చేశారు. వీడియో గేమ్ లో కూడా ఛాటింగ్ ఆప్సన్ ఉండటంతో అత్యంత తెలివిగా ఉగ్రవాదులు దీన్ని ఉపయోగించుకున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

భవిష్యత్తులో పారిస్లో అత్యంత జుగుప్సకరమైన పరిస్థితులు

ఇదిలా ఉంటే భవిష్యత్తులో పారిస్లో అత్యంత జుగుప్సకరమైన పరిస్థితులు కనిపించేలా దాడులు నిర్వహిస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ దాడులు మొన్న జరిగిన దాడికంటే భయంకరంగా ఉంటాయని హెచ్చరించింది.

ఈఫిల్ టవర్ను ఓ క్షిపణి బలంగా ఢీకొట్టడంతోపాటు..

ఇందుకు ఓ ట్రయల్గా 'జీఐ జో: ది రైస్ ఆఫ్ కోబ్రా' అనే చిత్రంలోని ఓ వీడియో క్లిప్ ను ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసింది. ఈ వీడియో ప్రకారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈఫిల్ టవర్ను ఓ క్షిపణి బలంగా ఢీకొట్టడంతోపాటు చిన్న రొబోటిక్ డిస్ట్రాయర్స్ ధ్వంసం చేస్తాయి.

పారిస్ కుప్పకూలిపోయింది' అని పేరుపెట్టి

దీంతో ఆ టవర్ అందరు చూస్తుండగా నది మీదుగా కూలిపోతుంటుంది. ఈ వీడియో ద్వారా పారిస్ కు హెచ్చరికలు పంపించినట్లవుతుందని ఈ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఈ వీడియోకు 'పారిస్ కుప్పకూలిపోయింది' అని పేరుపెట్టి మరీ విడుదల చేసింది.

ఈ ఘటన కోసం పెట్టిన ఖర్చు కేవలం రూ.5లక్షలు

ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే 119 మంది అమాయకుల్ని అత్యంత దారుణంగా హతమార్చటంతో పాటు.. యూరప్ సహా.. ప్రపంచ దేశాల్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన కోసం పెట్టిన ఖర్చు కేవలం రూ.5లక్షలు మాత్రమేనట. ప్యారిస్ ఉగ్రదాడికి పెట్టిన ఖర్చు విషయం పైన తాజాగా రాయటర్స్ ఒక అంచనా వేసింది. ఈ అంచనా ప్రకారం రూ.5లక్షల స్వల్ప మొత్తంతో ఇంతటా భారీ దారుణమారణకాండ చేపట్టినట్లుగా వెల్లడించింది.

దాదాపు రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తే

తమ దేశంపై జరిపిన ఉగ్రదాడి కోసం ఫ్రాన్స్.. బెల్జియం దేశాలు ఐఎస్ తీవ్రవాదుల మీద పోరాటం చేయటంతో పాటు.. అదనపు రక్షణ చర్యల కోసం దాదాపు రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తే.. దారుణ మారణకాండ కోసం ఐఎస్ ఖర్చు చేసింది మాత్రం రూ.5లక్షలు మాత్రమే కావటం గమనార్హం.

రూ.5లక్షల్లో కూడా నాలుగు రైఫిళ్ల కోసమే పెట్టిన ఖర్చే ఎక్కువ

రూ.5లక్షల్లో కూడా నాలుగు రైఫిళ్ల కోసమే పెట్టిన ఖర్చే ఎక్కువ. అది మినహాయిస్తే.. మిగిలిన వాటి కోసం పెట్టిన ఖర్చు చాలా స్వల్పం కావటం విశేషం. రసాయన పదార్థాల కోసం ప్రతి బెల్ట్ కు వినియోగించింది రూ.500 నుంచి రూ.1200 మాత్రమే. సూసైడ్ బెల్ట్ కోసం సుమారు రూ.16వేలు.. ఉగ్రవాదులు నివాసం ఉన్న రెండు అపార్ట్ మెంట్ల అద్దె కోసం దాదాపు రూ.70వేలు..

మూడు అద్దె కార్ల కోసం సుమారు రూ.65వేలు

ఉగ్రదాడి కోసం వినియోగించిన మూడు అద్దె కార్ల కోసం సుమారు రూ.65వేలు.. ఉగ్రదాడికి వినియోగించటానికి కొనుగోలు చేసిన 2వేల బుల్లెట్లు (అంచనా) సుమారు రూ.60వేలకు మించదని చెబుతున్నారు. విధ్వంసం చేయటానికి పెద్ద ఎత్తున నిధులు అక్కర్లేదన్న విషయాన్న ప్యారిస్ ఘటన ద్వారా ఉగ్రవాదులు చెప్పకనే చెప్పేశారన్న మాట.

యూరోపియన్ ఇంటిలెజెన్స్ అధికారులకు ఇప్పుడు దిమ్మ

ఫ్రాన్స్ లో విరుచుకు పడిన ఉగ్రవాదుల టెక్నాలజీ ని చూసిన యూరోపియన్ ఇంటిలెజెన్స్ అధికారులకు ఇప్పుడు దిమ్మ తిరుగుతోంది. రాడార్లకు చిక్కకుండా వారు వాడిన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఫ్రాన్స్ అధికారులకు సవాల్ విసురుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write isis secret communication technologies leaked
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot