ఎక్కువగా మాట్లాడితే మగతనానికే ముప్పట..?

Written By:

మొబైల్ ఫోన్‌లలో గంటల తరబడి మాట్లాడటం వల్ల మగతనానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మగవారు రోజు గంటకన్నా ఎక్కువ సేపు ఫోన్‌లో మాట్లాడటం వల్ల ఇన్ఫెర్టిలిటీ సంభవించే అవకాశముందని టెక్నియోన్ - ఇస్రాయిల్ ఇన్స్‌టిట్యూట్ ఇంకా కార్మిల్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు.

 ఎక్కువగా మాట్లాడితే మగతనానికే ముప్పట..?

వీరి అధ్యయనం ప్రకారం... రోజు గంటకన్నా ఎక్కువ సేపు ఫోన్‌లో మాట్లాడుతున్న వారిలో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలేంది. చార్జ్ అవుతోన్న ఫోన్ నుంచి మాట్లాడే వారిలో ఈ సమస్యను మరింత ఎక్కువుగా గుర్తించినట్లు వెల్లడైంది. పరిశోధనల్లో పాలుపంచుకున్నఈ రెండు సెంటర్‌‍లకు సంబంధించిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనా పత్రాలను రీప్రొడక్టివ్ మెడికల్ ఆన్‌‍లైన్ జర్నల్‌కు సమర్పించారు.

ఇక వాట్సాప్ గ్రూప్ చాట్‌ సభ్యులను 256 వరకు పెంచుకోవచ్చు

నిరంతరాయంగా ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ సంభవించే ప్రమాదముందని ఇటీవల పలు అధ్యయనాలు హెచ్చరించాయి. అయితే, ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు అనేక మొబైల్ యాక్సెసరీస్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ఫోన్ ను చెవి దగ్గరగా పెట్టుకుని మాట్లాడవల్సి వస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తక్కువ సిగ్నల్‌ ఉన్నప్పుడు

ఎక్కువుగా మాట్లాడితే మగతనానికే ముప్పుట..?

మీ ఫోన్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌ను కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్‌ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మీ మొబైల్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌లో ఉన్నప్పుడు మాట్లాడటం మానుకోండి.

హెడ్‌సెట్‌ వాడండి

ఎక్కువుగా మాట్లాడితే మగతనానికే ముప్పుట..?

సెల్‌ఫోన్‌లను చెవి దగ్గర పెట్టకుని గంటల తరబడి మాట్లాడకండి. హెడ్‌సెట్‌ వాడడం రేడియేషన్‌ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది

ఎక్కువుగా మాట్లాడితే మగతనానికే ముప్పుట..?

మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. దీంతో సెల్‌ఫోన్‌ విద్యుదస్కాంత క్షేత్ర ప్రభావం నుంచి మెదడును కాపాడుకోవచ్చు.

మెసేజ్‌లతోనే ముగించేయండి

ఎక్కువుగా మాట్లాడితే మగతనానికే ముప్పుట..?

సాధ్యమైనంతవరకు మీ సంభాషనలను మెసేజ్‌లతోనే ముగించేయండి. ఈ సమయంలో సెల్‌ఫోన్‌ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ప్రభావమూ దానిపై పడదు.

చిన్నపిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి

ఎక్కువుగా మాట్లాడితే మగతనానికే ముప్పుట..?

ముఖ్యంగా చిన్నపిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి.ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్నీ తెచ్చిపెట్టొచ్చనీ వివరిస్తున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ని దూరంగా ఉంచటం మేలు. బయటకు వెళ్లినపుడు ప్యాంటు, చొక్కా జేబుల్లో కన్నా సంచీలో వేసుకోవటం మంచిది.

ప్యాంటు జేబులో పెట్టుకున్నా

ఎక్కువుగా మాట్లాడితే మగతనానికే ముప్పుట..?

సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా రేడియేషన్ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

అస్తమానం తొడల పై పెట్టుకోవద్దు

ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి

ల్యాప్‌టాప్‌లను అస్తమానం తొడల పై పెట్టుకుని పనిచేసే మగవారిలోనూ వీర్యకణాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు...

కాలిన గాయాలు ఏర్పడే ప్రమాదం

ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి

ల్యాప్‌టాప్‌ను తొడ భాగంలో పెట్టుకుని ఉపయోగించటం వల్ల ఆ భాగంలో కాలిన గాయాలు ఏర్పడే ప్రమాదముంది. ల్యాపీ నుంచి విడుదలయ్యే వేడి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

యాంటీ రేడియేషన్ కిట్‌

ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి

యాంటీ రేడియేషన్ కిట్‌లను ఉపయోగించటం ద్వారా రేడియేషన్‌ను అధిగమించవచ్చు.

ప్రభావం సంతానోత్పత్తి పై

ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి

పురుషులు లేదా మహిళలు ల్యాప్‌టాప్‌ను తొడ భాగంలో పెట్టుకుని ఉపయోగించటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం సంతానోత్పత్తి పై చూపే అవకాశముందట.

ఒత్తిడి పెరిగిపోయే అవకాశం

ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి

ల్యాప్‌టాప్ నుంచి విడుదలయ్యే వేడి ఒత్తిడి స్థాయిలను పెంచేస్తుందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Israeli Scientists Warn Men Less Talk on Cell Phones. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting