ఇస్రోకి సలాం కొడుతున్న అగ్రదేశాలు

Posted By:

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఎటువంటి లోట్లు లేకుండా విదేశీ శాటిలైట్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఈ సంస్థ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. ఈ సంస్థ తాజాగా రూపొందించిన ‘అస్ట్రోశాట్' ఉపగ్రహాన్ని సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పొలార్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ)-సీ30 ద్వారా ఆ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విజయం సాధించింది. మొట్టమొదటిసారిగా ఖగోళ పరిశోధన కోసం చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మిగితా కథనం కింద చూడండి.

Read more:మామ్ ఏడాది పయనంలో మరచిపోలేని చిత్రాలెన్నో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అస్ట్రోశాట్ ను అంతరిక్ష్యంలోకి..

పీఎల్ఎల్వీ సీ30 ఉపగ్రహ వాహన నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన అస్ట్రోశాట్ ను అంతరిక్ష్యంలోకి పంపించారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రిక్రియ.. నిర్వఘ్నంగా కొనసాగి సోమవారం ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.

ఇస్రో చేసిన తొలి ప్రయోగం

ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన ఈ తొలి ప్రయోగంలో భాగంగా.. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి ప్రయోగించారు. అంతేకాదు.. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించారు.

ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం

ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు.

ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు..

ఆస్ట్రోశాట్‌లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది.ఈ శాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు.

ఉపగ్రహాలను నింగిలోకి

పీఎల్ఎల్వీ సీ30 రాకెట్ ద్వారా ‘అస్ట్రోశాట్‌'తో పాటు ఇండోనేషియా లాపాన్‌-2(68 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్‌యా(5.5) యూఎస్‌కు సంబంధించిన లెమర్‌-2, 3, 4,5(16కిలోలు) ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది.

విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50 దాటింది.

ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించారు. ఇంకో విశేషం ఏమిటంటే.. పీఎల్ఎల్వీ 30 ద్వారా పంపిన ఆరు విదేశీ ఉపగ్రహాలతో భారత్ ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50ని దాటింది. అలాగే.. అగ్రరాజ్యమైన అమెరికా ఉపగ్రహాలను కూడా నింగిలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రోది.

ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇదే మూడోసారి.

ఇప్పటివరకు ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను విజమవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఫీజు తీసుకుని ఇలా ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వస్తోంది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇదే మూడోసారి.

ప్రపంచదేశాలు సెల్యూట్

ఇస్రోకి ప్రపంచదేశాలు సెల్యూట్ కొడుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న షార్ విజయగాధను చూసి షాకవుతున్నాయి. 

ఇస్రో విజయగాధ ఇదే

ఇస్రో విజయగాధ ఇదే 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here Write ISRO launches ASTROSAT, first space observatory
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot